ఆరంబ్ అనేది పాన్ ఇండియా పిసి ఫర్ ఎడ్యుకేషన్ ప్రోత్సాహం, టెక్నాలజీయొక్క పవర్‌తో అభ్యసనను మెరుగుపరచడానికి ఉద్దేశించబడింది, ఇది తల్లిదండ్రులు, టీచర్లు మరియు పిల్లలు డిజిటల్ యుగంలో అడుగు పెట్టడానికి దోహదపడే విధంగా డిజైన్ చేయబడింది. ఈ చొరవ ద్వారా తల్లిదండ్రులు, టీచర్లు మరియు విద్యార్థులతో అనుసంధానం కావడం మరియు వారికి అవసరమైన శిక్షణ అందించడం ఉంటాయి, తద్వారా వారు ఇంటి వద్ద స్కూలులో అభ్యసన కొరకు కంప్యూటర్‌ని మరింత మెరుగ్గా ఉపయోగించగలుగుతారు.

పిసిలను స్వీకరించడం మరియు ఉపయోగించడం విషయానికి వస్తే భారతదేశంలో పిసిలు చొరబాటు ౧౦% కంటే తక్కువగా ఉన్నట్లుగా డెల్ వద్ద మేం జరిపిన పరిశోధనల్లో తేలింది. చదువులో పిసి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో తల్లిదండ్రులు మరిు టీచర్ల యొక్క ఆలోచనలు ప్రారంభంలో ఒకేవిధంగా ఉన్నప్పటికీ, మెరుగైన అభ్యసన కొరకు పిసిని ఎలా - ఉపయోగించాలనే దానిపై అవగాహన లేకపోవడంతో వారు అడ్డంకుల్ని ఎదుర్కొంటారు..

ట్రైనింగ్ మరియు సర్టిఫికేషన్‌ల ద్వారా సమిష్టింగా తల్లిదండ్రులు, పిల్లలు మరియు విద్యాసంస్థలను ఉద్యుక్తులను చేయాలని మేం విశ్వసిస్తున్నాం. మేం తల్లిదండ్రులు, టీచర్లు మరియు, తదుపరి పిల్లలకు, కంప్యూటర్ టెక్నాలజీ యాక్సెసబిలిటీని అందించడం ద్వారా కీలక పిసి వినియోగ నైపుణ్యాలను అందిస్తున్నాం.

సృజనాత్మకత, క్రిటికల్ థింకింగ్ మరియు సంక్లిష్ట సమస్యా పరిష్కారాలు అనేవి నేటి డిజిటల్ యుగంలో భారతీయులకు అవసరమైన అత్యంత కీలకమైన నైపుణ్యాలు, టెక్నాలజీ సాయంతో ఈ మూడు నైపుణ్యాలను అందించేందుకు ఆరంభ్ చర్యలను తీసుకుంటోం. ఈ చొరవ ద్వారా, మేం ఇప్పటి వరకు మా డెల్ చాంప్స్ స్కూల్ కాంటాక్ట్ కార్యక్రమం ద్వారా ౧.౫మిలియన్ మంది విద్యార్థులను నిమగ్నం చేశాం. ఎన్ఐఐటి యొక్క అనుబంధంతో, మేం 70కు పైగా నగరాల్లోని ౫,౦౦౦ స్కూళ్లకు చెందిన ౧,౨౫,౦౦౦ మంది టీచర్లకు శిక్షణ ఇచ్చి, సర్టిఫికేషన్ అందిస్తున్నాం, మరియు డెల్ డిజిమామ్స్ కార్యక్రమంలో భాగంగా ౪,౦౦,౦౦౦ మంది తల్లులకు సాధికారతను కల్పిస్తున్నాం.

రండి, మాతో చేతులు కలపండి- మనం ఒక కొత్త అభ్యసన విధానానికి ‘ఆరంభం’ పలుకుందాం.