కిండర్ గార్టెన్ తల్లిదండ్రులకు చిట్కాలు

ఒకవేళ మీరు ప్రి-స్కూలర్ పిల్లవాడి తల్లిదండ్రులు అయితే, మీ పిల్లవాడిని చూసుకోవడం మీకు కొన్నిసార్లు సవాలుగా మరియు అలసటగా ఉండవచ్చు. పిల్లలను పెంచడం సవాళ్ళతో కూడుకున్న పనులలో ఒకటి, కానీ మీరు దీనిలో ఒంటరిగా ఉండనవసరం లేదు.

ప్రమేయం కలిగి ఉండటానికి మరియు మీ పిల్లవాడికి మరియు వారి పాఠశాలకు ప్రయోజనం కలిగించడానికి కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి. మీ పిల్లవాడి చదువులో ప్రమేయం కలిగి ఉండటం ఎన్నో విధాలుగా లాభం కలిగిస్తుంది. తల్లిదండ్రుల ప్రమేయం ఉంటే పాఠశాలలకు బలం చేకూరుతుంది మరియు మీరు అభ్యాసానికి విలువ ఇస్తారని పిల్లలకు తెలియజేస్తుంది. మీ పిల్లవాడిని పెంచడంలో సహాయపడే కొన్ని పేరెంటింగ్ చిట్కాలను మేము ఇక్కడ ఇస్తున్నాము.

ఇంటి నుండే పాల్గొనండి -

ప్రెజెంటేషన్స్ లేదా మరేవైనా పాఠాల కొరకు మెటీరియల్స్ ను సిద్ధం చేయడంలో సహాయపడండి. మీరు పిటిఎలో కూడా చేరవచ్చు. మీ సహాయపడే గుణాన్ని ఇంట్లో చూపించడం ద్వారా పాఠశాల ముఖ్యమైనది అన్న విషయం పిల్లవాడికి తెలుస్తుంది. ఉపాధ్యాయునితో మీ అనుబంధం బలోపేతం కావడానికి కూడా ఇది సహాయపడుతుంది.

పాఠశాల కార్యక్రమాలలో పాల్గొనండి -

వర్చువల్ ఓపెన్ హౌసెస్, ఆర్ట్ షోలు, మరియు ఇతర పాఠశాల కార్యక్రమాలలో తప్పకుండా పాల్గొనండి. సిబ్బంది మరియు ఇతర తల్లిదండ్రులతో మాట్లాడటానికి పాఠశాల కార్యక్రమాలు చక్కని ప్రదేశాలు.

పాఠశాల గురించి మీ పిల్లవాడితో మాట్లాడండి -

“నీ క్లాస్ ఎలా జరిగింది?” అని అడగటానికి బదులుగా,”క్లాస్ లో జరిగిన వాటిలో ఉత్తమైనది ఏది?” మరియు “కిండర్ గార్టెన్ లో నీవు ఈ రోజు నేర్చుకున్న ఒక కొత్త విషయాన్ని గురించి చెప్పు” అని అడగండి.

సాంకేతిక యుగంలో పిల్లవాడిని పెంచడం కష్టం. తల్లిదండ్రులకు సరైన సాంకేతిక అవగాహన ఉంటే ఈ పనులన్నీ మరింత సమర్ధవంతంగా చేయవచ్చు. మీ పిల్లవాడి శక్తి స్థాయిలు మరియు కుతూహలాన్ని అందుకోవడం కొన్నిసార్లు మీకు కష్టంగా ఉండవచ్చు. మీ పేరెంటింగ్ విధానాన్ని మెరుగుపరచుకునేందుకు మా ఈ పేరెంటింగ్ చిట్కాలను చూడండి.

21 వ శతాబ్దంలో డిజిటల్ యుగంలో పుట్టిన వారిని పెంచడం పై మా వెబినార్ ను ఇక్కడ చూడండి - https://www.dellaarambh.com/webinars/