వర్చువల్ పాఠశాల నైపుణ్యం సంపాదించడానికి చిట్కాలు

దూర అభ్యాసంతో మీకు ఇది మొదటి అనుభవమా? మీ రోజులని ఎలా రూపొందించాలో మీరు ఖచ్చితంగా తెలుసుకోలేకపోతున్నారా? మొదటగా, ఆన్ లైన్ అభ్యాసంలో విజయం సాధించడానికి మంచి అలవాట్లను అలవరచుకుని, మరింత స్వతంత్రంగా పని చేస్తున్నారని నిర్ధారణ చేసుకోవాలి. వర్చువల్ పాఠశాల నైపుణ్యం సంపాదించి తరగతిలో ప్రధమంగా నిలవడానికి ఇవి కొన్ని చిట్కాలు

1. నిమగ్నం చేసే మెటీరియల్స్ ను రూపొందించడం

ముఖ్యమైన అంశాలు, తేదీలు, మరియు పేర్ల కొరకు ఆక్కటుకునే విధంగా ఉండేలా  మరియు రంగు రంగుల ఫ్లాష్ కార్డులను రూపొందించండి. మీరు తేలికగా మరచిపోయే వివరాలను గుర్తుంచుకునేందుకు ఫ్లాష్ కార్డులు సహాయపడతాయి. 

2. ధ్యాసను మరల్చే వాటిని నివారించండి

ఆన్ లైన్ తరగతులు ధ్యాసను మరల్చే విధంగా ఉంటాయి. మీరు ఒక ప్రశాంతమైన చోట కూర్చున్నారని నిర్ధారించుకోండి మరియు ఉపాధ్యాయుడు చెప్పే దానిపై ధ్యాస ఉంచండి. మీరు తరగతి గదిలో కూర్చునే విధంగానే, సరైన భంగిమలో కూర్చోండి.  

3, ప్రశ్నలు అడగండి

ప్రశ్నలు ఎన్నిసార్లు అయిన అడగవచ్చు. కష్టమైన భావనలను వివరంగా చెప్పమని మీ ఉపాధ్యాయుని అడగండి.ఒకవేళ ఏదైనా మరీ కఠినంగా అనిపిస్తే, మీ తరగతి ఉపాధ్యాయునితో విడిగా మాట్లాడండి.

4. చక్కగా క్రమబద్ధీకరించుకోండి

ప్రతి తరగతి కొరకు మీ కంప్యూటర్ పై మరియు మీ ఇమెయిల్ ప్రోగ్రామ్ లో విడిగా ఎలక్ట్రానిక్ ఫోల్డర్లను సృష్టించండి. మీ వర్చువల్ పాఠశాల మీకు ఆన్ లైన్ ప్లానర్ ను అందిస్తే, ప్రాధాన్యత క్రమంలో ఆంశాలకు ర్యాంకును ఇస్తూ, మీ అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేయడానికి మరియు చేయవలసిన పనుల జాబితాను సృష్టించడానికి దానిని ఉపయోగించండి. 

5. సానుకూల ధృక్పధాన్ని కలిగి ఉండండి

మార్పు ద్వారా అభివృద్ధిని సాధించడం కష్టం, కానీ సానుకూల ధృక్పధంతో దీనిని చేయవచ్చు. ఆన్ లైన్ అభ్యాసం గురించి సానుకూల ధృక్పధంతో ఉండడం మీరు మీకు ఇచ్చుకోగలిగే ఒక ఉత్తమమైన బహుమతి.

విజయం సాధించండి!