ఆన్‌లైన్ అభ్యాసం ఉపాధ్యాయుల పాత్రను ఎలా పునర్నిర్వచించింది?

ఈ కొత్త సాధారణ పరిస్థితిలో, ఉపాధ్యాయుల పాత్ర తరగతి గదిని దాటి విస్తరించింది. విద్యార్థులు వారి ఇళ్లలోనే ఉంటే, తగిన తరగతి వాతావరణాన్ని సృష్టించడంలో ఉపాధ్యాయులు కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నారు. విజువల్స్, యానిమేటెడ్ వీడియోలు, మరియు గేమ్-ఆధారిత క్విజ్ ల ద్వారా విద్యార్థుల కొరకు లీనం చేసే, మరియు ఇంటరాక్టివ్ అభ్యాస అనుభవాల ద్వారా పాఠాలపై విద్యార్థులు దృష్టి పెట్టేలా చేయడానికి ఉపాధ్యాయులు కొత్త మార్గాలను అభివృద్ధి చేశారు. తరగతి సరిహద్దులను ఉపాధ్యాయులు నిర్వచించిన కొన్ని ఇతర మార్గాలు ఇవి:

 

ఇ-అభ్యాసం మరియు వ్యక్తిగతీకరణ:

ఇ-అభ్యాసం ద్వారా, సాంకేతికతను ఉపకరణంగా ఉపయోగించి, విద్యార్థులు ఇ-అభ్యాసానికి మారడానికి ఉపాధ్యాయులు సహాయపడ్డారు. ఆయా విద్యార్థుల అవసరాలను తీర్చడానికి, వ్యక్తీగతీకరించిన అభ్యాసం, పరిచయం చేయబడింది. విద్యార్థులు తమ సొంత వేగంతో నేర్చుకోవడం మరియు విషయాలను పొందికగా గ్రహించడం కొనసాగించవచ్చు.

 

కంటెంట్ సృష్టికర్తలుగా ఉపాధ్యాయులు 

అందుబాటులో ఉన్న కంటెంట్ పై ఆధారపడటానికి బదులుగా కంటెంట్ సృష్టికర్తలుగా మారడానికి ఉపాధ్యాయులు ప్రయత్నం చేస్తున్నారు. విద్యార్థులను లీనం చేసే, కొత్త ఇంటరాక్టివ్ కంటెంట్ ని రూపొందించడం ద్వారా, వారు  సమగ్రంగా అభివృద్ధి చెందడానికి దోహదపడ్డారు. 

https://dellaarambh.com/telugu/gal-uploads/0b924b50a46d11c7bfd59756b7501601.jpg

ప్రశ్నలు మరియు ఒత్తిడి:

ఈ కొత్త పరిస్థితులలో, తల్లిదండ్రుల ప్రశ్నలు మరియు ఆన్ లైన్ అభ్యాసం యొక్క ఒత్తిడులతో వ్యవహరించడంలో ఉపాధ్యాయులు నైపుణ్యతను సాధించారు. కొత్త బోధనా పద్ధతులను నేర్చుకుంటూ, ఉపాధ్యాయులు తామే విద్యార్థులుగా మారారు. 

 

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, తమ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలం చేయడానికి తమ జీవితాలను అంకితం చేసిన ఈ ఉపాధ్యాయులను గౌరవించుకుందాము. డెల్ వెబినార్లో చేరండి: https://www.dellaarambh.com/webinars/

 

ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!