అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మీ పిల్లలతో ఎలా జరుపుకోవాలి

ప్రతి సంవత్సరం 8 మార్చిన ప్రపంచ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అటువంటి చారిత్రాత్మక రోజున, మహిళలు చేసే త్యాగాల గురించి మరియు సమాజంలో వారికి ఉన్న అధికారాల గురించి పిల్లలు తెలుసుకోవాలి. 

మీ పిల్లవాడితో మీరు ఈ విధంగా ఒక గొప్ప మరియు విజ్ఞానదాయకమైన మహిళా దినోత్సవం జరుపుకొనుటకు ప్రణాళిక వేయవచ్చు.

మూవీ నైట్ కోసం ప్రణాళిక చేయండి

ఎన్నో చిత్రాలు పిల్లలకు స్ఫూర్తినిచ్చే బలమైన మహిళా పాత్రలను కలిగి ఉంటాయి. మీ పిల్లవాడి వయసుకు అనుగుణంగా, మహిళల బలాన్ని ప్రదర్శించే చిత్రాన్ని వారితో కలిసి చూడండి.  

ఆన్ లైన్ లో జీవిత చరిత్రలను చదవండి

అంతర్జాతీయ మహిళల దినోత్సవం కొరకు తగిన, బలమైన మహిళల జీవిత చరిత్రలను ఆన్ లైన్ లో కనుగొనవచ్చు, జీవితంలో అసాధారణ విషయాలను సాధించిన డిజైనర్ నుండి కళాకారులు, పరిశోధకుల వరకు విశిష్టమైన మహిళల జీవితాలను గురించి మీరు మరియు మీ పిల్లవాడు కనుగొనవచ్చు.

కలిసి వంట చేయండి

మీరు మరియు మీ పిల్లవాడు కొన్ని తేలికైన మరియు ఆసక్తికరమైన వంటలను కలిసి వండవచ్చు. యుట్యూబ్ లో వంటల కోసం చూసి డిన్నర్ కొరకు వారిని మెనూ తయారు చేయనివ్వండి. వంట అనేది సాధారణ జీవిత నైపుణ్యం మరియు ఇది లింగ-ఆధారిత పని కాదని వారికి నేర్పుతుంది.

పోటీతత్వం ఉండే ఆటను ఆడండి

సరదాగా మరియు పోటీతత్వం ఉండే ఆటలను మీరు కలిసి ఆడాలి. చాలా మంది పిల్లలు ఆటలను ఆడటాన్ని ఆనందిస్తారు మరియు, మన  పెద్దలకు, వారితో ఆడటానికి తరచుగా సమయం ఉండదు. ఆన్ లైన్ లో ఆడటానికి కొన్ని సరదా ఆటలను మీరు కనుగొనవచ్చు

వర్చువల్ గ్రీటింగ్ కార్డ్ రూపొందించడానికి వారికి సహాయపడండి

ఆన్ లైన్ లో గ్రీటింగ్ కార్డులను తయారు చేయడానికి మరియు వాటిని ఉపాధ్యాయులకు మరియు కుటుంబ సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున పంపించడానికి పిల్లలను ప్రోత్సహించండి. ఈ ప్రక్రియను సులభం చేయడానికి మరియు మరింత క్రియేటివ్ గా చేయడానికి కాన్వా వంటి ఆన్ లైన్ సాధనాలను వారు ఉపయోగించవచ్చు. 

ఈ సరదా పద్ధతులలో, మీరు మీ పిల్లలకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం గురించి తెలియజేయవచ్చు మరియు చక్కటి సమయాన్ని కూడా గడపవచ్చు.