మీ పిల్లలకు బోధిస్తున్న సమయంలో సున్నితత్వం మరియు దయ యొక్క ప్రాముఖ్యత

ప్రస్తుత ప్రపంచ పరిస్థితి కారణంగా ఎక్కువ ప్రభావితం అయినవారు పిల్లలు, అన్నీ మూతబడిపోవటంతో, పిల్లలు వారి తరగతులను, స్నేహితులను మరియు బోధన వాతావరణాన్ని వదిలివేయవలసి వచ్చింది. జ్ఞానం కొరకు సురక్షితమైన ప్రదేశాన్ని సృష్టించవలసిన బాధ్యత తల్లిదండ్రులపై పడింది, వారు సాంకేతికతతో యుద్ధం చేశారు మరియు అనుకూలమైన బోధన వాతావరణాన్ని సృష్టించడానికి కావలసిన సాధనాలు సమకూర్చుకోవడానికి ప్రయత్నించారు.

 

తెలియని మార్గాలలో ప్రయాణిసస్తున్నప్పుడు తల్లిదండ్రులు, సున్నితత్వం మరియు దయ ప్రదర్శించాలని గుర్తుంచుకోవడం ముఖ్యం. తమ పిల్లలకు బోధించడానికి శిక్షణ పొందిన విద్యావేత్తలు కూడా ఇబ్బందిపడతారు. దూరం నుండి నేర్చుకునే సమయంలో వారు దృష్టి కేంద్రీకరించడానికి, ఆసక్తిగా మరియు స్థిరంగా ఉండడంలో సహాయపడటానికి మీరు ఇలా చేయవచ్చు:

 

  1. నిరంతర ఫీడ్ బ్యాక్: మీ మధ్య ఫీడ్ బ్యాక్ వలయాన్ని స్థిరంగా మరియు మృదువుగా ఉండేలా చూసుకోవాలి. పిల్లలతో, తల్లిదండ్రులు మరీ కఠినంగా ఉండకూడదు. ఉపాధ్యాయులు, విద్యార్థులతో సంభాషిస్తున్నప్పుడు కూడా ఇది వర్తిస్తుంది. సమర్ధమైన ఫీడ్ బ్యాక్ వలయం పురోగతిని ట్రాక్ చేయడంలో సహాయపడుతుంది. 
  2. కొంత విరామ సమయం కలిగి ఉండండి: చదువుకునే మరియు ఇంటిలో ఉండే సమయాలు ఒకదానితో ఒకటి కలిసిపోవడంతో, కొంత నాణ్యమైన సమయాన్ని గడపడానికి మరియు విశ్రాంతి తీసుకునేందుకు విరామ సమయాన్ని కలిగి ఉండటం ముఖ్యం. తల్లిదండ్రులు మరియు పిల్లలు ఒత్తిడి తగ్గించుకునేందుకు ఇది సహాయపడుతుంది. 
  3. ఓర్పుగా ఉండండి: ప్రతి పిల్లవాడు తన సొంత వేగంతో నేర్చుకుంటాడు. కష్టమైన అంశాలను బోధిస్తున్నప్పుడు ఓర్పుగా మరియు సహనంగా ఉండండి, ఎటువంటి సంశయం లేకుండా ప్రశ్నలు అడగటానికి వారిని ప్రోత్సహించండి. 
  4. ప్రేరణను అందించండి: పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య మెరుగైన సంబంధాలు కలిగి ఉండటానికి మరియు స్వీయ-అవగాహనను ప్రోత్సహించడానికి ప్రేరణ సహాయపడుతుంది. మీ పిల్లవాడు తిరిగి అందరితో కలవడం ప్రారంభించినప్పుడు, ఇది ఆత్మ విశ్వాసాన్ని కూడా పెంచుతుంది.

 

పిల్లలు మరియు తల్లిదండ్రులు వారి అనుభవాల నుండి నేర్చుకునేందుకు, సున్నితత్వం మరియు దయగల వాతావరణాన్ని సృష్టించడం గురించి మరింత తెలుసుకునేందుకు మా వెబినార్లో చేరండి.