తల్లిదండ్రులారా – మీ పిల్లవాడికి కోసం మొదటి ల్యాప్‌టాప్ కొంటున్నప్పుడు ఇవి గుర్తుంచుకోండి

రోజూవారీ జీవితంలో కంప్యూటర్ లు మరియు ల్యాప్ టాప్ లు అనివార్యమైన వస్తువులగా మారిపోయాయి. మనము అందరం క్రమం తప్పకుండా వాటిని ఉపయోగిస్తాము. కాబట్టి మన పిల్లలు వాటిని అడగటంలో ఆశ్చర్యం లేదు. కంప్యూటర్ల సైజ్ తగ్గుతూ పోతుంటే, కంప్యూటర్లు నేర్చుకునే వయసు కూడా తగ్గుతూ వస్తుంది. 

మీ పిల్లవాడి వయసును దృష్టిలో ఉంచుకోండి

త్వరలో లేదా మరి కొన్ని రోజులో మీ పిల్లలు మరింత స్వతంత్రాన్ని మరియు గోప్యతను కోరడం ప్రారంభిస్తారు, అందువలన వారి కొరకు ల్యాప్ టాప్ కొనడానికి పెట్టుబడి పెట్టడం వలన వారు పూర్తి సామర్ధ్యంతో నేర్చుకొని, అభివృద్ధి చెందగలరు. ఒక వయసులో వారు లోతుగా ఆలోచించే సామర్ధ్యాన్ని పొందుతారు మరియు ఆన్ లైన్ లో క్లిష్టమైన మరియు సమయ-ఆధారిత ఆటలను ఆడటాన్ని మరియు కార్యకలాపాలను నిర్వహించడాన్ని మరియు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడాన్ని ఆస్వాదిస్తారు.

మీ పిల్లవాడికి ఏది ఆసక్తి కలిగిస్తుంది?

ల్యాప్ టాప్ కొనే ముందు, మీ పిల్లవాడి కొరకు ఈ పెట్టుబడిని ఎందుకు పెడుతున్నారనే దానికి కారణాలను ఆలోచించండి. మీ పిల్లవాడి విద్య అవసరాలకు మద్దతు ఇవ్వడానికి లేదా ఆటలు ఆడతాన్ని మరియు చిత్రాలు చూడటానికి కంప్యూటర్ ను ప్రత్యేకంగా కొంటున్నారా? దేనికోసమైనా కానీ, మీ పిల్లవాడి ఆసక్తి మరియు భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నారని నిర్ధారించుకోండి. 

మీ బడ్జెట్ ను నిర్ణయించుకోండి

ప్రస్తుతం అన్ని ధరల శ్రేణులలో విభిన్న ల్యాప్ టాప్ లు అందుబాటులో ఉన్నాయి. మీ బడ్జెట్ మరియు అవసరమైన ఫీచర్లపై ఆధారపడి, మీ పిల్లవాడి జీవితానికి ఖచ్చితంగా సరిపోయే దానిని కనుగొనవచ్చు. మీరు ఖరీదైన ల్యాప్ టాప్ పై పెట్టుబడి పెడుతుంటే ఖరీదైన పరికరాలను నిర్వహించడంలో మీ పిల్లవాడికి శిక్షణ ఇవ్వండి. 

కావలసిన ఫీచర్ల కొరకు చూడండి

ఆంతేకాకుండా, స్క్రీన్ పరిమాణం, పరికరం బరువు, మరియు మన్నిక కూడా ముఖ్యము. 12 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లల కొరకు, మీరు చిన్నవైన మరియు తేలికైన ల్యాప్ టాప్ లను కొనాలి

మన్నిక ఒక ముఖ్యమైన ఫీచర్ గా కలిగి ఉన్న పరికరాన్ని ఎన్నుకున్నారని నిర్ధారించుకోండి. 

మీ పిల్లల కొరకు సరైన అభ్యాస వనరులను నిర్మించడం పై మరింత సమాచారం కొరకు మా వెబినార్ ను చూడండి.

https://www.dellaarambh.com/webinars/