సాధారణ పరిస్థితులు నెలకొన్న తరువాత విద్య యొక్క హైబ్రిడ్ నమూనాని అవలంభించడంలో పిల్లలకు మీరు ఎలా సహాయపడగలరో తెలుసుకోండి

గత రెండు సంవత్సరాలలో, ప్రపంచం లాక్ డౌన్ లో ఉన్నప్పుడు, ప్రజలు తమ జీవనాన్ని కొనసాగించడంలో సహాయపడటానికి అన్నీ డిజిటల్ మాధ్యమనికి మారిపోయాయి. ఫలితంగా, ఆన్ లైన్ క్లాసులు కొత్త జీవన విధానం అయ్యాయి. ఇప్పుడు కేసుల తగ్గుదల కారణంగా పాఠశాలలు తెరుచుకుంటున్నాయి, అయితే, పిల్లలు పాఠశాలకి తిరిగి వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. వేగంగా మారడం కొంచెం కష్టంగా ఉండవచ్చు. వారికి మార్పు సులభంగా ఉండటంలో సహాయపడటానికి కొన్ని చిట్కాలు కింద ఇవ్వబడ్డాయి:

 

  1. కొత్త దినచర్య: మీ పిల్లలు తిరిగి పాఠశాలకు వెళ్ళడం ప్రారంభించినప్పుడు మీ పిల్లవాడి రోజువారీ జీవితంతో ఎంతో మార్పు వస్తుంది. అందువలన, వారి సాధారణ పాఠశాల రోజు గురించి సమాచారం వారికి అందిస్తే, మార్పుకి అలవాటు పడటంలో వారికి సహాయకరంగా ఉంటుంది.
  2. నిద్ర షెడ్యూల్: ఆన్ లైన్ లో చదువు, వారి నిద్ర షెడ్యూల్ గందరగోళం అవడానికి కూడా దారి తీసింది. వారి సాధారణ పాఠశాల సమయానికి వారికి నిద్రలేపడం మరియు వారు ఎనిమిది గంటల నిద్రని పొందగలిగేలా త్వరగా నిద్రపుచ్చడం ద్వారా నిద్రపోయే దినసరి విధానాన్ని అలవాటు చేయవచ్చు. 
  3. సంభాషణ ప్రధానం: ఇటువంటి పెద్ద మార్పులకు తేలికగా అలవాటుపడటం మీ పిల్లవాడికి కొంచెం కష్టం కావచ్చు.వారితో మీరు చక్కగా మాట్లాడుతూ,వారు చెబుతున్నది వింటున్నారని వారికి తెలిసేలా నిర్ధారించుకోండి. సమస్య కొనసాగుతుంటే, పాఠశాలని లేదా నమ్మకం ఉన్న ఉపాధ్యాయుని సంప్రదించండి. 
  4. అలవాటుపడటానికి వారికి సహాయపడండి: మార్పులకి అలవాటుపడటానికి ప్రతి పిల్లవాడు వేర్వేరు సమయం తీసుకుంటాడు. మీ పిల్లవాడి వేగాన్ని అర్ధం చేసుకునేందుకు ప్రయత్నించండి. వారు సమస్యని ఎదుర్కొంటుంటే, మీ సూచనలు మరియు మద్దతు కోరడం వారికి సౌకర్యంగా ఉందని నిర్ధారించుకోండి. 

 

మీ డిజిటల్ నేటివ్ పిల్లలను పెంచడానికి మరింత సమర్ధంగా మరియు సంసిద్ధులై ఉండటం ఎలాగో తెలుసుకోండి. మా వెబినార్ చూడండి - https://www.dellaarambh.com/webinars/