దూర విద్య- ఏకాగ్రతను నిర్వహించడంలో మరియు నిమగ్నమై ఉండటంలో పిల్లలకు సహాయం చేయడానికి 8 చిట్కాలు

ఈ రిమోట్ అభ్యాసం యుగంలో విద్యార్థులను నిమగ్నం చేసి ఉంచడం ఆసక్తికరమైనది మరియు సవాళ్ళతో కూడినది. అభ్యాసం పట్ల వారికి ఉత్సాహం కలిగించడం మరియు వారి కుతూహలన్ని పెంచడంలోనే కిటుకు ఉంది. ఇందుకు సహాయపడే కొన్ని చిట్కాలు ఇక్కడ ఉన్నాయి:

 

  1. తల్లిదండ్రులతో కలిసి పని చేయండి: విద్యార్థి  పురోగతిని ట్రాక్ చేయడానికి నెలకి రెండుసార్లు వీడియో-కాన్ఫరెన్స్ సమావేశాలు నిర్వహించడం ఉపయోగపడతుంది, ఒక ఉపాధ్యాయునిగా, మీరు కూడా తల్లిదండ్రులకి డిజిటల్ బోధన వనరుల ప్రాప్యతను అందించాలి, తరగతి సమయం తరువాత తమ పిల్లలను నిమగ్నం చేయడానికి వారు వీటిని ఉపయోగించగలరు.
  2. అభ్యాసాన్ని సరదాగా మార్చండి: టిక్ టాక్ పై “60 సెకన్లలో సైన్స్ వాస్తవాలు” వంటి సెషన్లు అంతకు ముందు ఎన్నడూ లేని మార్గాలలో మీరు మీ విద్యార్థులతో అనుసంధానం అవ్వడానికి వీలు కల్పిస్తాయి.
  3. సానుకూల బలం పెంచడానికి ప్రయత్నించండి: చేతికి అందించిన బహుమతులు, మెయిల్ చేసిన సర్టిఫికెట్లు మరియు మొత్తంగా సానుకూల గుర్తింపు పిల్లవాడిని బాగా ప్రేరేపించగలదు. 
  4. మానసిక ఆరోగ్యం పై దృష్టి పెట్టండి: గ్రూప్ లేదా వ్యక్తిగత కౌన్సిలింగ్ సెషన్లకు ప్రాప్యతనివ్వండి. చదువు, ప్రవర్తన, సామాజిక అవసరాలకు అదనపు మద్దతునివ్వడం, విద్యార్థులు అందరు పాల్గొంటూ, నిమగ్నం అవుతున్నారు అని నిర్ధారించుకోగలిగేలా చేస్తుంది.
  5. పాఠాలను సరళతరం చేయండి: మీరు నేర్పుతున్న పాఠాలను మరియు నేర్పుతున్న విధానాన్ని సరళతరం చేయండి. పాఠ్యప్రణాళికలోని నైపుణ్యాలు మరియు భావనలపై దృష్టి పెట్టండి. పిల్లలు విజయం సాధించగలరాని   ఇది నిర్ధారిస్తుంది.
  6. సాంకేతికతను గరిష్టంగా ఉపయోగించండి: విద్యార్థుల పై ఎక్కువ ప్రభావం కొరకు పాఠాలలో సంగీతం, వీడియో గేమింగ్, సౌండ్ డిజైన్ మరియు మరెన్నిటినో ఉపయోగించండి.
  7. మార్పులను ట్రాక్ చేయండి: పాఠాల మధ్య మారడం కొరకు ముందస్తుగా ప్రణాళిక వేశారని నిర్ధారించుకోండి, తద్వారా సమయం వ్యర్ధం కాదు. టైమర్ ఉపయోగించడానికి సంకోచించవద్దు.
  8. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కునేందుకు సిద్ధపడండి: బలహీనమైన, ఇంటర్నెట్, కనెక్షన్లు అనేవి 3 పదాలు. కానీ ప్రతిదీ అనుకున్నట్లు జరగదు అని మీరు అంచనా వేస్తే, మీ నష్టాలు మరియు సమయాన్ని మరింత మెరుగ్గా నిర్వహించగలుగుతారు.

 

ఇది ఖచ్చితంగా శుభారంభం అయినా, మరిన్ని చిట్కాల కొరకు మా వెబినార్ చూడండి - https://www.dellaarambh.com/webinars/