సాంకేతికతను స్వీకరించండి, దాన్ని చూసి భయపడకండి – అది ఎందుకో 3 కారణాలు?

డిజిటల్ ప్రపంచంలో పేరెంటింగ్ అనేది ఒక సవాలు. కానీ తల్లిదండ్రులుగా, ఒకవేళ మీరు సాంకేతికత గురించి భయపడకుండా దాన్ని అంగీకరిస్తే, అది మీ బిడ్డపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. మీ పిల్లవాడి డిజిటల్ ప్రయాణాన్ని సురక్షితం చేయాడానికి మీరు డిజిటల్ సాధనాలను వినియోగించుకోవచ్చు. కొన్ని మార్గాలలో సాంకేతికత జ్ఞానాన్ని అందించవచ్చు.

 

  1. కుతూహలాన్ని పెంచడం

 

సాంకేతికత అంతం లేని కుతూహలాన్ని పెంచుతుంది. ఒక అంశం గురించి తమ కుతూహలాన్ని వారి తోటి విద్యార్థులు మరియు ఉపాధ్యాయులతో–చాట్ ద్వారా లేదా ఆన్ లైన్ ఫోరంలు ద్వారా పిల్లలు పంచుకునే వీలు కల్పిస్తుంది. రోబోట్స్ ని ఎలా తయారు చేస్తారు అనే విషయం గురించి అయినా లేదా ఒరిగామి యొక్క మూలాల గురించి అయినా ఆసక్తికరమైన అంశం గురించి మరింత తెలుసుకోమని మీ పిల్లవాడిని ప్రోత్సహించండి. ఈ కుతూహలం మీ పిల్లవాడు వైవిధ్యమైన ఆసక్తులను పెంచుకునేందుకు లేదా ఆకర్షణీయమైన వృత్తి మార్గాన్ని ఎంచుకోవడానికి దారితీయవచ్చు.

 

  1. పురోగతిని ట్రాక్ చేయడం

 

సాంకేతికత, తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల మధ్య మరింత స్థిరమైన సంభాషలకు వీలు కల్పించింది. పిల్లవాడి పురోగతిని ట్రాక్ చేయడం, వారు అదనపు కృషి చేయవలసిన అవసరం ఉన్న ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడుతుంది. తరువాత మీరు, ఆ విషయాలలో కృషి చేయడానికి ఉపాధ్యాయులతో సహకరించవచ్చు మరియు మీ పిల్లవాడి పూర్తి సామర్ధ్యాన్ని వెలికితీయవచ్చు.

 

  1. బహిరంగ సంభాషణలు

 

ప్రాధమిక అంశాలు మరియు సాంకేతికతలో స్థిరమైన పరిణామాల గురించి సంభాషణలు, మీ పిల్లవాడు సురక్షితంగా భావించడానికే కాకుండా సాంకేతిక నుండి గరిష్ట ప్రయోజనాలను పొందడం గురించి విశ్వాసం పొందేలా చేస్తాయి. మద్దతు మరియు స్వేచ్చల మధ్య సంతులనం సాధించడం ముఖ్యం.

 

డిజిటల్ పేరెంటింగ్ గురించి మరింత సమాచారం కోసం మా వెబినార్ లను వినండి –

https://www.dellaarambh.com/webinars/