#డి‌జిపేరెంట్స్ - పిల్లల ఇంటర్నెట్ సమయాన్ని నిర్వహించడానికి 3 ప్రభావవంతమైన చిట్కాలు

 

గేమింగ్ మరియు నిరంతర స్క్రోలింగ్, అందుబాటులో ఉన్న అనంతమైన మరియు విస్తృతమైన అభ్యాస మరియు వినోద కంటెంట్ కొరకు పిల్లలు ఇంటెర్నెట్ ను ఉపయోగించడాని ఇష్టపడతారు.

 

అయితే, ఇందులో స్పష్టమైన ప్రతిబంధకాలు ఉన్నాయి. తరచుగా, స్క్రోలింగ్ ఒకొక్కసారి మూర్ఖంగా మారుతుంది మరియు టీవి షోలు, కార్టూన్ లు చూడటంలో అధిక సమయాన్ని వృధా చేయడం జరుగుతుంది. అందుకే, తల్లిదండ్రులుగా మీకు, మీ పిల్లల ఇంటర్నెట్ మరియు స్క్రీన్ సమయాన్ని ప్రభావవంతంగా నిర్వహించడానికి, తక్షణమే ఉపయోగించగలిగేలా ఈ సరళమైన చిట్కాలను మేము పంచుకుంటున్నాము.

 

  1. కొత్త నైపుణ్యాలను నేర్చుకునేలా ప్రోత్సహించండి

 

ఒరిగామి మరియు విజ్ఞాన ప్రాజెక్టుల నుండి పాడటం మరియు కొత్త భాషలను నేర్చుకోవడం వరకు కొత్త శ్రేణి నైపుణ్యాలను నేర్చుకునే యాప్స్, ఈ-అభ్యాస వేదికలు మరియు మాధ్యమాలను మీ పిల్లలు ఉపయోగించేలా నిర్ధారించుకోండి.

 

వారు చేసిన పనిని ప్రపంచంతో పంచుకోండి మరియు వారిని సాధ్యమైనంత ఫీడ్ బ్యాక్ ను అందుకోనివ్వండి. ఇంటర్నెట్ ను, పిల్లలు మరియు సాంకేతికతలను మీ ప్రయోజనానికి ఉపయోగించుకోండి. మమ్మల్ని విశ్వసించండి. అతి తక్కువ కాలంలోనే, ప్రతి రోజూ ఏటువంటి పని చేయకుండా కార్టూన్ లను చూడటం కంటే ఎక్కువ ప్రయోజనకరమైన పనులను వాళ్ళు చేస్తారు.

 

  1. హాబీలు మరియు విమర్శనాత్మక ఆలోచనను ప్రోత్సహించండి.

 

విద్యేతర కార్యక్రమాల తరగతులలో చేరడానికి పిల్లలకు ప్రేరణనివ్వండి. బహుశా మీ పిల్లవాడికి పియానో వంటి సంగీత వాయిద్యాలను నేర్చుకోవాలనే కోరిక ఉండవచ్చు. కోర్సులను అందించే ఆన్ లైన్ వేదికలు ఎన్నో ఉన్నాయి. అభిరుచులను పెంపొందించుకునే దిశగా వారిని ప్రోత్సహించండి.

 

ఆన్ లైన్ లో తేలికగా అందుబాటులో ఉండే, ఆలోచనలను పెంపొందించే సుడోకు మరియు క్రాస్ వర్డ్ పజిల్స్ వంటి ఆటలను వారు ఆడుకునేలా చేయండి. ఇది వారి జ్ఞాపకశక్తి మరియు తార్కిక నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది.

 

క్లాక్ వర్క్ బ్రెయిన్ లేదా బ్రెయిన్ బీన్ వంటి యాప్స్ పజిల్స్, మెమరీ మరియు ఇతర ఎడ్యు-గేమ్స్ ద్వారా మీ పిల్లలను సవాలు చేసి నేర్చుకునేలా చేస్తాయి. విమర్శనాత్మక ఆలోచన 21వ శతాబ్దానికి అత్యవసరము మరియు రేపటి తరం పిల్లలు ఇది నేర్చుకోవడం ఎంతో ముఖ్యము.

 

  1. పర్యవేక్షించబడే మరియు పరిమిత ప్రాప్యత

 

‘గైడెడ్ యాక్సెస్’ వంటి ఫీచర్లు మీరు ప్రత్యేక యాప్స్ యొక్క ప్రాప్యతను పొందగలిగే సమయాన్ని పరిమితం చేస్తాయి. గేమ్స్ మరియు స్త్రీమింగ్ యాప్ లకు ఎక్కువ పరిమితులతో వేర్వేరు యాప్ లకు వేర్వేరు పరిమితులను మీరు సెట్ చేయవచ్చు.మీ పిల్లలు సాంకేతిక పరిజ్ఞానంతో వారి సమయాన్ని మరింత ఉత్పాదక మార్గంలో ఉపయోగించడంలో గైడెడ్ యాక్సెస్ సహాయపడుతుంది.