ఉపాధ్యాయులు – ఆన్‌లైన్‌లో ప్రీ-స్కూల్ బోధన కొరకు 5 చిట్కాలు

ప్రీ-స్కూల్ కి బోధించడం అనేది ఎన్నో సవాళ్ళతో కూడుకున్నది. ప్రీ-స్కూల్స్ రిమోట్ అభ్యాసంగా మారడం వలన, వారి అభ్యాసాలను ప్రభావవంతంగా చేయడానికి ఉపాధ్యాయులు వారి తరగతి గదులలో సమర్ధత మరియు క్రమశిక్షణలను కొనసాగించడం ముఖ్యము

చాలా మంది ప్రీ-స్కూల్ ఉపాధ్యాయుల ఆందోళన, ఆన్ లైన్ లో 3 మరియు 4 సంవత్సరాల పిల్లలకు బోధించడంలోని సంక్లిష్టతతో కూడి ఉంటుంది. కాబట్టి ప్రధాన సూత్రాలు మిగిలి ఉండటం చాలా ముఖ్యము

వర్చువల్ గా మీట్ ది టీచర్ నిర్వహించడం

బలమైన తరగతి గది కమ్యూనిటీకి పునాది నిర్మించడానికి మీట్ ది టీచర్ కార్యక్రమంతో సంవత్సరాన్ని ప్రారంభించడం ఒక చక్కని అవకాశం. తల్లిదండ్రులు మరియు విద్యార్ధులకు మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. వారు సౌకర్యవంతంగా ఉండేలా చూడండి

వీడియో కాన్ఫరెన్సింగ్ వేదికలు మీ ఉత్తమ నేస్తాలుగా మారబోతున్నాయి

మీ విద్యార్థులు మిమ్మల్ని చూడటం, మీ గొంతు వినడం, మరియు మీతో అలాగే వారి తోటి పిల్లలతో బంధాన్ని కలిగి ఉండటం ముఖ్యము. ఇది మీకు ఇబ్బంది కలిగేలా చేయకండి. తరగతి గదిలో మీరు ఏ విదంగా అయితే మీ విద్యార్థులకు నేర్పించడం మరియు శ్రద్ధ వహించడం చేస్తారో అదే విదంగా వీడియో ద్వారా చేయండి.

హుందాగా ఉండండి!

వర్చువల్ గా ప్రీస్కూల్ కి బోధించడం చాలా కష్టతరం. ఓపికగా, సానుకూలంగా ఉండాలని గుర్తుంచుకోండి మరియు వారిని నిమగ్నం చేయండి. మీరు పరిపూర్ణంగా ఉండవలసిన అవసరం లేదు. మీ గురించి మీరు శ్రద్ధ తీసుకోండి, విరామం తీసుకోండి మరియు కొద్ది ఏకాంత సమయాన్ని పొందండి. 

మీ పాఠాలను ప్రత్యేకంగా మరియు మీ కార్యకలాపాలను అర్ధవంతంగా ఉంచండి

పోస్టర్ లు, యాంకర్ ఛార్టులు, వైట్ బోర్డ్స్, వీడియో ట్యుటోరియల్స్, లేదా పని యొక్క ఉదాహరణలు వంటి విజువల్ సాధనాలను ఉపయోగించండి. వారు నేర్చుకున్నదానిని విద్యార్ధులు వర్తింపజేయగలిగేలా నిజంగా సహాయపడే ఫాలో-అప్ యాక్టివిటీని చేర్చండి. అనేక కదలికలతో మీ పాఠాన్ని చిన్న భాగాలుగా విభజించడానికి ప్రయత్నించండి.

మీ విద్యార్ధులను మెచ్చుకోండి

తాము సాధించిన దానికి ప్రశంస మరియు బహుమతిని పొందడం చిన్న పిల్లలకు స్ఫూర్తినిస్తుంది మరియు మళ్ళీ మళ్ళీ చక్కని పనితీరు కనబరచడానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు డిజిటల్ బహుమతులు లేదా సర్టిఫికెట్లు పంపించడం లేదా ఆన్ లైన్ తరగతి గదులలో ఏకాగ్రత చూపలేకపోతున్న విద్యార్థులతో  ఫోన్ లో మాట్లాడటం వారితో సౌకర్యవంతమైన అనుబంధాన్ని పెంచుకోవడానికి సహాయపడుతుంది.

మీ ఇ-అభ్యాస నైపుణ్యలను పదును పెట్టుకునేందుకు మరియు మీ తరగతులను ప్రభావవంతంగా చేసేందుకు, మా వెబినార్లలో భాగం అవ్వండి.

https://www.dellaarambh.com/webinars/