ఇ-లెర్నింగ్ మీ పిల్లలకు ప్రయోజనం కలిగించే 5 కారణాలు

 

ఆన్ లైన్ లెర్నింగ్ లో భారీ వృద్ధిని మనము చూస్తున్నాము. నివేదికల ప్రకారము భారతదేశంలో ఆన్ లైన్ విద్యా మార్కెట్ యొక్క విలువ 2024 నాటికి INR 360 బిలియన్   అంచనా వేయబడినది.

తల్లిదండ్రులుగా మీకు, ఇ-లెర్నింగ్ మరియు మీ పిల్లల పై దాని ప్రభావం గురించి సందేహాలు ఉండవచ్చు. వారి అభ్యాస సామర్ధ్యాన్ని అధికంగా పెంచడము మరియు సమగ్ర అనుభవాన్ని అందించడంతో పాటు, మీ పిల్లలు ఆనందించగలిగే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

ఇవి ఆ ప్రయోజనాలు -

మీ పిల్లలను మరింత బాధ్యతాయుతులను చేస్తుంది

ఇ-లెర్నింగ్ సమయంలో, అసైన్మెంట్లను సమర్పించమని మరియు తరగతి చర్చలలో పాల్గొనమని మీ పిల్లలకు గుర్తు చేయడానికి భౌతిక ఉనికి ఉండదు. ఇది వారిని చిన్న వయసులో స్వీయ-చోదకులను చేస్తుంది.

ఉత్సుకతను మరియు నేర్చుకోవాలనే తీవ్రమైన కోరికను పెంపొందిస్తుంది

ఆన్ లైన్ లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఆన్ లైన్ అభ్యాసం యొక్క వివిధ రూపాల ప్రాప్తితో, మీ పిల్లలు వారికి ఉత్సుకత ఉన్న లేదా నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న అంశాల గురించి సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

పిల్లలు మరింత వ్యవస్థీకృతులవుతారు

తరగతి ఫైల్స్ ను నిర్వహించడం, ఇతర విద్యార్థులతో సమన్వయం చేయడం, అసైన్మెంట్లను సమర్పించడం ద్వారా, మీ పిల్లలు వ్యవస్థీకృత నైపుణ్యాల యొక్క ప్రత్యక్ష అనుభవాన్ని పొందుతారు. ఇది చిన్నతనం నుండే పనులకు ప్రాధాన్యత క్రమాన్ని కేటాయించడాన్ని నేర్పుతుంది.

వ్యక్తిగతీకరించబడిన అభ్యాసం

ఆడియో, విజువల్, లేదా టెక్స్ట్ వంటి అభ్యాసం యొక్క బహుళ మార్గాలతో, మీ పిల్లలు వారికి సౌకర్యంగా ఉండే ఫార్మాట్ లో నేర్చుకోగలరు. ఉపాధ్యాయులను ఆన్ లైన్ లో సంప్రదించడం లేదా స్వంతగా పరిష్కారాలను వెతకడం ద్వారా వారి సందేహాలను వారు పరిష్కరించుకోగలరు.

వినోదం కొరకు కాకుండా సాంకేతికతను నేర్చుకోడానికి ఉపయోగిస్తారు

మీ పిల్లలు ఎప్పుడూ సామాజిక మాధ్యమ వేదికలపై ఉంటున్నారని మీరు ఆందోళన చెందుతుంటే, ఇ-లెర్నింగ్ మీ ఆందోళనలను తగ్గిస్తుంది. ఆన్ లైన్ లో అందుబాటులో ఉన్న ఎన్నో అభ్యాస అవకాశాలతో, వారు సాంకేతికతను వినోదానికే కాకుండా వేరే వాటికి కూడా ఉపయోగించగలరు.

మీ పిల్లలు ఈ అభ్యాస పద్ధతికి అలవాటుపడేలా ప్రోత్సహించండి, ఎందుకంటే ఇది వారికి జీవితాంతం కావలసిన సాఫల్య లక్షణాలను మరియు పట్టుదల వైఖరిని వారిలో అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది.