ఆన్‌లైన్‌లో పిల్లలను సురక్షితంగా ఉంచడానికి 5 మార్గాలు

ఈ రోజులో నిరంతరం పెరుగుతున్న డిజిటల్ ప్రపంచంలో, మీ పిల్లలు గణనీయమైన సమయాన్ని ఆన్ లైన్ లో గడుపుతున్నారు. తరగతుల నుండి విశ్రాంతి, సాంఘిక సంబంధాల వరకు, వారి జీవితంలో ఎక్కువ భాగము ఆన్ లైన్ కి మారింది.

తల్లిదండ్రులుగా మీరు, ఆన్ లైన్ ప్రపంచంలో వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు మీ పిల్లలు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి. దీనిని నిర్ధారించడానికి మీరు అనుసరించవలసిన 5 మార్గాలు ఇవి:

అవగాహనను పెంచండి

ఆన్ లైన్ ప్రపంచం యొక్క ప్రమాదాల గురించి వారికి అవగాహన కల్పించడం ప్రధానమైన విషయము. పాస్ వర్డ్ లను రహస్యంగా ఉంచడం యొక్క ప్రాముఖ్యత గురించి వారికి తెలియచేయండి మరియు సైబర్ సెక్యూరిటీ భావనను వారికి పరిచయం చేయండి.

మీ పిల్లల గుర్తింపును సంరక్షించండి

ఇంటర్నెట్ పై వారి వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం వలన వచ్చే ప్రమాదాల గురించి మీ పిల్లలతో మాట్లాడండి. వ్యక్తిగత సమాచారం అనగా ఫోన్ నంబర్ లు మరియు చిరునామాల వంటి సున్నితమైన సమాచారం ఉండవచ్చు.

మీ కంప్యూటర్ ను రక్షించుకోండి

ఆర్ధిక మోసాలకు దారి తీయగలిగే స్కామర్ లు, హ్యాకర్ లు, మరియు ఇతర ఆన్ లైన్ ప్రమాదాల నుంచి మీరు మీ కుటుంబాన్ని రక్షించుకోవాలి. అటువంటి ప్రమాదాల గురించి వారికి తెలియజేయండి మరియు సురక్షితంగా ఉండటానికి సాఫ్ట్ వేర్ సెక్యూరిటీని అప్డేట్ చేయండి.

ఆన్ లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించండి

ఇంటర్నెట్ పై ఆన్ లైన్ లో అన్నీ డొమైన్ ల కంటెంట్ ఉంటుంది. తల్లిదండ్రులుగా మీరు, అవాంఛిత కంటెంట్ నుండి మీ పిల్లలను దూరంగా ఉంచాలి. పేరెంటల్ కంట్రోల్ ఎంపికను ఉపయోగించడం ద్వారా దీనిని మీరు చేయవచ్చు.

సైబర్ బెదిరింపులను నివారించండి

ఇంటర్నెట్ పై వారు చేసే పోస్టుల గురుంచి ఆలోచించడాన్ని మీ పిల్లలకు నేర్పించాలి. ఆన్ లైన్ లో ఇతరుల పట్ల జాలి లేకుండా లేదా దురుసుగా ఉండటం వలన వచ్చే పరిణామాల గురించి వారికి గుర్తు చేయండి.

ఈ విషయాల గురించి మీ పిల్లలకు తెలియచెప్పడం ద్వారా, వారికి సాధ్యమైనంత సురక్షితమైన అభ్యాస అనుభవం కలిగి ఉన్నారని మీరు నిర్ధారించుకోగలరు. ఆన్ లైన్ లో నేర్చుకుంటున్నప్పుడు పిల్లలు సురక్షితంగా ఉన్నారని నిర్ధారించుకోవడం గురించి మరింత తెలుసుకునేందుకు మా వెబినార్ లో జాయిన్ అవ్వండి- https://www.dellaarambh.com/webinars/