ఆన్‌లైన్ లెక్చర్లకి హాజరవుతున్నప్పుడు గుర్తించుకోవలసిన 6 విషయాలు

 

ఆన్ లైన్ లెక్చర్ లు అభ్యాసం యొక్క భవిష్యత్తు. ప్రస్తుతం తలెత్తిన పరిస్థితులతో, ఈ లెక్చర్లు మీకు మరియు మీ ఉపాధ్యాయులకు ప్రారంభంలో, సర్దుబాట్లులాగా ఉండవచ్చు.

 

మీకు సహాయపడటానికి, ఆన్ లైన్ అభ్యాస అనుభవం ఆనందంగా ఉండటానికి ఆరు సరళమైన వీడియో ప్రవర్తన చిట్కాలను కలిపి మీకు అందిస్తున్నాము.

 

నివారించలేని బ్యాక్ గ్రౌండ్ శబ్దాన్ని మీరు వింటుంటే, మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోండి

మీ పరిసరాలలో ఉండే గిన్నెల చప్పుడు వంటి శబ్దాలు, మీ సహ విద్యార్థులకు మరియు ఉపాధ్యాయులకు ఇబ్బంది కలిగించవచ్చు. మీ ఇంటి వద్ద అటువంటి అంతరాయాలను ఎదుర్కుంటుంటే, మిమ్మల్ని మీరు ముందుగానే మ్యూట్ చేసుకోండి.

 

ఆఫ్ చేయమని చెప్పేవరకు ఎల్లప్పుడూ మీ వీడియోను ఆన్ లోనే ఉంచండి

తరగతిని ఆకర్షణీయంగా మరియు ఇంటరాక్టివ్ గా ఉంచడానికి, అన్ని సమయాలలో మీ వీడియోని ఆన్ లో ఉంచండి. మీ ఉపాధ్యాయులు ఖాళీ స్క్రీన్ తో మాట్లాడాలని మీరు అనుకోరు కదా. మీ ఉపాధ్యాయులు ప్రత్యేకించి అడిగినప్పుడు మాత్రమే మీ వీడియోని ఆఫ్ చేయండి.

 

నోట్స్ తీసుకునేందుకు ఒక పుస్తకాన్ని మరియు పెన్ ని సిద్ధంగా ఉంచుకోండి

నేర్చుకునే మాధ్యమం భిన్నమైనది అయినా, అనుభవం అదే విధంగా ఉంటుంది. మీ ఉపాధ్యాయులు మాట్లాడుతున్నప్పుడు ముఖ్యమైన నోట్స్ ని రాసుకోడానికి పుస్తకము మరియు పెన్ ని మీ పక్కన ఉంచుకున్నారని నిర్ధారించుకోండి.

 

పొడి అక్షరాలు మరియు స్లాంగ్ పదాలను నివారించండి

లెక్చర్ లో పొడి అక్షరాలు మరియు స్లాంగ్ పదాలను ఉపయోగించకండి. మర్యాదగా మాట్లాడండి. భౌతిక తరగతిలో ఉండేటువంటి మీ ప్రవర్తననే ఇక్కడ కూడా కొనసాగించండి.

 

ఎప్పుడూ సమయాన్ని పాటించండి

ఆన్ లైన్ వేదికను మీ ప్రయోజనానికి ఉపయోగించండి. లెక్చర్ యొక్క వెయిటింగ్ రూమ్ లో అది ప్రారంభమవటానికి కొన్ని నిమిషాల ముందే జాయిన్ అవ్వండి. ఇది లెక్చర్ యొక్క మైండ్ ఫ్రేమ్ లోకి వెళ్లడానికి సహాయపడుతుంది, తద్వారా మీరు భావనలను వేగంగా గ్రహించగలుగుతారు.

 

పాల్గొనండి మరియు ప్రశ్నలు అడగండి

ఎంగేజ్ అవ్వండి, ప్రశ్నలు అడగండి, భౌతిక తరగతిలో అడిగే విధంగానే ప్రశ్నలు లేవనెత్తండి. వేదిక యొక్క స్వభావాన్ని మనసులో ఉంచుకోండి. వేరేవారు మాట్లాడుతున్నప్పుడు ఆటంకం కలిగించకండి.

 

మీ తదుపరి ఆన్ లైన్ లెక్చర్ లో ఈ చిట్కాలను అమలు చేయండి, మరియు ఆన్ లైన్ అభ్యాసం యొక్క ఆనందాన్ని అనుభవించండి.