మీరు నేర్చుకోవాల్సిన 10 కంప్యూటర్ పదాలు

కంప్యూటర్ మీకు ఇష్టమైన బొమ్మ, మీ లైబ్రరీ మరియు ఒక్క క్లిక్తో వినోదాన్ని అందించే ఉపకరణం. ఇంటి వద్ద అదేవిధంగా స్కూలులో కంప్యూటర్ ఉండటం వల్ల మీరు మీ మార్గంలో అభ్యసన చేపట్టేందుకు దోహదపడుతుంది. మీరు కేవలం సమాచారాన్ని చదవడం మాత్రమే కాకుండా, ఇంకా అనేక పనులు చేస్తారు- మీరు వాస్తవానికి మీరు నేర్చుకున్న విషయాలను వీడియోలు, డయాగ్రమ్లు వంటి వాటి ద్వారా దృశ్యరూపం కల్పిస్తారు.

మీ కంప్యూటర్ లోపల ఏమి ఉంటాయి?

మీరు నేర్చుకోవాల్సిన 10 కంప్యూటర్ పదాలు ఇవిగో:

 

 

వైరస్ అనేది ఒక విధమైన కోడ్, ఇది కంప్యూటర్ లోని సిస్టమ్ ని కరప్ట్ చేయడం లేదా మీ డేటాను నాశనం చేయడం వంటి చెడు పనులు చేయగలదు.

 

 

బ్యాకప్ అనేది, బ్యాకప్ చేసే ప్రక్రియను తెలియజేస్తుంది, ఇందులో మీ కంప్యూటర్ డేటా మొత్తం కాపీ చేసి, ఆర్కైవ్ చేయబడుతుంది, తద్వారా ఒకవేళ మీరు డేటాను కోల్పోయినా కూడా దానిని మీరు తిరిగి పొందవచ్చు.

 

 

డేటా అనేది ఒక కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పై ప్రసారం చేయగల మరియు నిల్వ చేయగల సమాచారంగా పేర్కొనవచ్చు, దీనిలో మీ అసైన్ మెంట్ , ఇమేజ్ లు మరియు వీడియోలు ఉంటాయి.

 

 

డెస్క్ టాప్ కంప్యూటర్ అనేది రెగ్యులర్ గా ఒకే ప్రదేశంలో ఉపయోగించే పర్సనల్ కంప్యూటర్, దాని యొక్క సైజు లేదా పవర్ ఆవశ్యకతల కారణంగా దీనిని ఒక డెస్క్ లేదా టేబుల్ పై ఉంచబడుతుంది.

 

 

కర్సర్ అనేది కంప్యూటర్ స్క్రీన్ పై కదులుతూ ఉండే మార్క్, ఇది యూజర్ ద్వారా ఇన్ పుట్ చేయబడుతున్న పాయింట్ ని గుర్తిస్తుంది.

 

 

హోమ్ పేజీ అనేది ఒక వెబ్ సైట్ యొక్క పరిచయం పేజీ, సాధారణంగా సైట్ యొక్క విషయసూచిక ఉంటుంది లేదా ఇంటర్నెట్ బ్రౌజర్ యొక్క డిఫాల్ట్ వెబ్ పేజీగా ఉంటుంది.

 

 

పాస్ వర్డ్ అనేది వివిధ క్యారెక్టర్ల సమాహారం, ఇది కంప్యూటర్, మెయిల్ లేదా ఏదైనా సంరక్షిత వ్యవస్థలోనికి ప్రవేశించడానికి దోహదపడుతుంది.

 

 

సాఫ్ట్ వేర్ అనేది మైక్రోసాఫ్ట్ వర్డ్ పై వ్యాసం రాయడం వంటి నిర్ధిష్ట పనులు చేయడానికి కంప్యూటర్ ని ఆదేశించే ఆదేశాల సమాహారం లేదా ప్రోగ్రామ్.

 

 

స్క్రీన్ సేవర్ అనేది యానిమేషన్ లేదా ఇమేజ్, కంప్యూటర్ ని కొంత సమయం ఉపయోగించకుండా విడిచిపెట్టిన తరువాత, కంప్యూటర్ డిస్ ప్లే స్థానంలో ఇవి కనిపిస్తాయి.

 

 

షార్ట్కట్ అనేది ఒక ఫైలు లేదా వెబ్సైట్ లేదా ఇతర డేటా యొక్క చిరునామా రికార్డ్, ఇది వేగంగా యాక్సెస్ చేసుకోవడానికి దోహదపడుతుంది, అలానే కీ బోర్డు కమాండ్లు కూడా షార్ట్కట్లుగా పని చేస్తాయి, ఉదాహరణకు Ctrl + C అనేది డేటాను కాపీ చేయడానికి ఉపయోగిస్తారు.

స్కూలు లేదా ఇంటి వద్ద ప్రతిరోజూ కంప్యూటర్ ఉపయోగించేవారికి, హోమ్ వర్క్కు అత్యావశ్యమైనవాటితోపాటుగా ఇంకా అనేక కంప్యూటర్ పదాల గురించి తెలుసుకుంటారు. హ్యాపీ స్టడీయింగ్!