మీరు ప్రయత్నించాల్సిన 10 టైపింగ్ ఆటలు!

 

టైపింగ్ విషయానికి వస్తే, కేవలం రెండు విషయాలకు మాత్రమే అత్యధికంగా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది- అవే ఖచ్చితత్త్వం మరియు స్పీడ్ మీ క్లాస్ మేట్ ల వలే వేగంగా టైప్ చేయలేకపోవడం వల్ల క్లాస్ లో వెనకబడటం గురించి ఒక్కసారి ఊహించుకోండి. అయితే, శుభవార్త ఏమిటంటే, మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా దానిలో నిష్ణాతులు కాగలరు.


1. టైప్ రేసర్

 

టైప్ రేసర్ అనేది గ్లోబల్ టైపింగ్ కాంపిటీషన్, ప్రపంచవ్యాప్తంగా ఉండే ఇతర వ్యక్తులతో మీరు పోటీపడటం ద్వారా మీ టైపింగ్ వేగం పెరుగుతుంది.

 

2. టైపింగ్ అలియన్

 

అభ్యసన వినోదంగా ఉండదని ఎవరు అంటారు? టైపింగ్ అలియన్ యొక్క ఒక్క రౌండ్ ఆడండి, ఇక మీరు అతుక్కుపోతారు. టైపింగ్ టెక్నిక్ లు మరియు స్పీడ్ ని అందిపుచ్చుకోవడానికి గేమ్ ఎంతో మంచిది.

 

3. కీమ్యాన్

 

కీమెన్ మీరు ఒక లెవల్ సెట్ చేసుకునేందుకు దోహదపడుతుంది, (దీనిలో ఈజీ నుంచి హార్డ్, అలానే ఆల్ఫాబెట్ లు మరియు నెంబర్లు విడిగా సెట్ చేసుకోవచ్చు) అందువల్ల, చేతికి మరియు కంటికి మధ్య సమన్వయాన్ని పెంపొందించుకోవచ్చు, అదేవిధంగా అతి తక్కువ సమయంలోనే మీ టైపింగ్ వేగాన్ని పెంపొందించుకోవచ్చు.

 

4. కీబోర్డ్ నింజా

 

దీని పేరు సూచించినట్లుగానే, కీ బోర్డ్ నింజా గేమ్ ఆడటం ద్వారా మీరు వినోదాన్ని పొందడమే కాకుండా వేగవంతమైన మరియు సమర్ధవంతమైన టైపింగ్ ని పొందడానికి దోహదపడుతుంది!

 

5. టైప్ ఎ బెలూన్

 

విభిన్న క్లిష్టమైన లెవల్స్ తో (హార్డ్, మీడియం, మరియు ఈజీ)తో అనేక లెసన్ టైప్ లను కలిగి ఉండే మరో గేమ్, ఇది కీబోర్డ్ లోని వరసలను ఏర్పరుస్తుంది, టైప్ ఎ బెలూన్ మీ టైపింగ్ కొరకు గొప్ప ప్రాక్టీస్ ని అందిస్తుంది.

 

6. ద టైపింగ్ ఆఫ్ ద ఘోస్ట్స్

 

ఈ పేరు కాస్తంత భయపెట్టవచ్చు, అయితే టైపింగ్ ఆఫ్ ద ఘోస్ట్స్ అనేది ఒక ఛాలెంజింగ్ గేమ్, దీనిలో మీరు దెయ్యాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాల్సి ఉంటుంది, దీని వల్ల మీ చేయి మరియు కంటి కో ఆర్డినేషన్ మెరుగవుతుంది.

 

7. వర్డ్ ట్రిస్ స్క్రబ్బెల్

 

మీ టైపింగ్ రిఫ్లెక్స్ లు మరియు ఒకాబిలరీని రెండింటిలోనూ శిక్షణ పొందడానికి వర్డ్ ట్రిస్ స్క్రబ్బెల్ మీకు చక్కటి అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు ఆడే ప్రతి గేమ్ లో మీరు మెరుగైన ‘టైపర్’ కావడం కొరకు గేమ్ నిండుగా అనేక చిట్కాలు మరియు ట్రిక్కులు ఉంటాయి.

 

8. టైప్ ద ఆల్ఫాబెట్

 

టైపింగ్ స్పీడ్ స్టర్ కావడం కొరకు మీకు అవసరమైనవి అన్నీ కూడా టైప్ ద ఆల్ఫాబెట్ లో ఉంటాయి. మీఅందరికీ కూడా, క్లాసులో సైతం పోటీని నిర్వహించవచ్చు.

 

9. ఫాస్ట్ ఫైర్ టైపర్

 

మీ పదజాలాన్ని పెంచుకోవడంతోపాటుగా మీరు టైపింగ్ మాస్టర్ కావాలని కోరుకుంటున్నారా? పాస్ట్ ఫైర్ టైపర్ అనేది ఏదైనా ముఖ్యమైన అసైన్ మెంట్ లేదా టస్ట్ కు ముందు ఆడే ఆట, తద్వారా మీరు టాప్ ఫామ్ లో ఉండవచ్చు.

 

10. విండోస్ కొరకు టైపింగ్ మాస్టర్

 

విండోస్ కొరకు టైపింగ్ మాస్టర్ అనేది ఒక గేమ్ కంటే ఎక్కువ. మీ టైపింగ్ లో ఖచ్చితత్త్వం సాధించడానికి మరియు మీ వీక్ పాయింట్ లు (ఒకవేళ ఏవైనా ఉన్నట్లయితే) దానిపై పనిచేయడానికి ఇది డౌన్ లోడ్ చేసుకోగల కోర్సు.

 

ఇప్పుడు, మీ కంప్యూటర్ ని సూపర్ ప్రొడక్టివ్ గా చేయడం అనే దాన్ని చేయాల్సి ఉంటుంది. హ్యాపీ టైపింగ్!