మీరు తెలుసుకోవాల్సిన టెక్నాలజీలోని 3 భారతీయ ఎచీవర్లు

అద్భుతాలు సాధించడానికి ఎలాంటి వయ:పరిమితి లేదు. టెక్నాలజీలో అనేక మంది ఆవిష్కకర్తల గురించి మీకు తెలుసు, వీరిలో కొంతమంది మీ వయస్సు వారు లేదా మీ కంటే తక్కువ వయస్సు వారు. టెక్నాలజీ ఫీల్డ్‌లో ఆవిష్కరణలు మరియు సృజనాత్మకతో వీరు మనందరం కూడా గర్వపడేలా చేస్తున్నారు.

వీరిలో కొంతమంది గురించి మీరు తెలుసుకునే సమయం ఆసన్నమైంది.

1. తినీత్ ఆదిత్య- ఎక్స్‌ట్రాఆర్డినటే్ యొక్క రూపశిల్పి

విద్యుత్ ఎక్స్‌టెన్షన్ బోర్డు మరియు బనానా లీఫ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ ఆవిష్కరణల వెనక ఉన్న బాలుడు తినీత్. ఇతడు ఇప్పటికే 17 ఆవిష్కరణలు చేశాడు. 2013లో ఇతడిని రాష్ట్రపతి భవన్‌లో సత్కరించారు.

2. అంగద్ దయానీ- తరువత ఎలానర్ మస్క్

ముంబైకు చెందిన అంగద్ దయానీ గుడ్డివారి కొరకు ఓపెన్ సోర్స్ సాఫ్ట్‌వేర్‌ని ఉపయోగించి గుడ్డివారి కొరకు వర్చువల్ ఈ రీడర్‌ని, సోలార్ పవర్‌పై నడిచే బోటును, గార్డినో అనే ఆటోమేటెడ్ గార్డెనింగ్ సిస్టమ్ అలానే భారతదేశంలో అతి చౌకైన 3డి ప్రింటర్ షార్ట్‌బోట్‌ని కూడా రూపొందించాడు. అతడు స్కూలు మానేసి, పిల్లల కొరకు చౌకైన డిఐవై కిట్‌లను అమ్మడం కొరకు స్వంతంగా కంపెనీ పెట్టుకున్నాడు.

3. ఆనంద్ గంగాధరన్ మరియు మోహక్ బల్లా- ఇద్దరు మేధావులు

ఆనంద్ మరియు మోహక్‌లు ఢిల్లీకి చెందిన స్నేహితులు, వీరు మొబైల్ పరికరాల నుంచి పోర్టబుల్ ఛార్జర్ వలే పనిచేసే పరికరాన్ని కనుగొన్నారు. వారు దీనిని ‘‘వాకీ మొబీ ఛార్జర్’’గా పేర్కొన్నారు, ఇది చాలా చార్జర్‌లు ఉత్పత్తి చేసే 5వాట్‌లకు భిన్నంగా ఇది 6 వాట్‌లను ఉత్పత్తి చేస్తుంది.

ఆవిష్కరణలకు మరియు సృజనాత్మకత కొరకు ఈ యంగ్ ఎచీవర్‌లు టెక్నాలజీని ఉపయోగించుకున్నారు. మీ వయస్సు ఎంత అయినప్పటికీ మీరు సాధించాలనే విషయంలో ఎలాంటి హద్దులు లేకుండా ముందుకు సాగిపోవడానికి టెక్నాలజీ దోహదపడుతుందనే దానికి వీరు సజీవ ఉదాహరణలు. వీరి నుంచి మరింత స్ఫూర్తితో, ఈ వినోదాత్మక టెక్ హాబీలను ప్రయత్నం ద్వారా మన స్వంత సాహసాలను ప్రారంభిద్దాం.

ఏ వయస్సు కూడా చిన్నది కాదు అలానే ఏ కల కూడా పెద్దది కాదు. నేడే ప్రారంభించండి.