మీ పిల్లలు వేసవి కాలంలో అభ్యసనకు దూరం కాకుండా చేసేందుకు 4 మార్గాలు

పిల్లలు సెలవులను ఎంతగానో ఇష్టపడతారు. సుమారు 60 రోజులపాటు వారు స్కూలుకు, ఎండకు దూరంగా విశ్రాంతి పొందుతారు. సెలవులు అనేవి ఎలాంటి ప్రభావం చూపకుండా వారి సాధారణ అకడమిక్ టైమ్ టేబుల్‌కు మంచి బ్రేక్‌ని ఇస్తాయి వేసవికాలంలో కొన్నినెలలుపాటు చదువుకు దూరంగా ఉనన పిల్లలు తరువాత విద్యాసంవత్సరంలో ప్రధాన ఇబ్బందులు ఎదుర్కొంటారని, దీనిలో నేర్చుకున్న విషయాలను మర్చిపోవడం, టెస్ట్ స్కోర్లు తగ్గిపోవడం వంటివి ఉంటాయి. దీనిని ‘ వేసవి అభ్యసన నష్టం’గా పేర్కొంటారు.

వేసవిలో అభ్యసన కోల్పోవడానికి కొన్ని సాధారణ సూచనలు

1. విద్యార్థులు సెలవుల ప్రారంభంలో టెస్ట్‌ల్లో సాధించే స్కోరుకంటే సెలవుల చివరల్లో సాధించే స్కోర్లు తక్కువగా ఉంటాయి.

2. వారు గణిత పరికల్పనా నైపుణ్యాలను కోల్పోతారు.

3. వారి చదివే మరియు స్పెల్లింగ్ సామర్థ్యాలు ప్రభావితం అవుతాయి.

అందువల్ల వేసవి అభ్యసన నష్టాన్ని ఎలా నిరోధించాలి?

1. గణిత నైపుణ్యాలను అభివృద్ధి చేయడం

ఇది వారికి వినోదాత్మకం కానప్పటికీ, వేసవికాలంలో ప్రతిరోజూ మూడు నుంచి నాలుగు గణిత సమస్యలపై పనిచేయడం ద్వారా మీ బిడ్డ గణిత నైపుణ్యాలు దెబ్బతినకుండా చూడటానికి దోహదపడతాయి. వారి గణిత భావనలను మెరుగుపరుచుకోవడానికి మీరు ఆన్‌లైన్ టూల్స్ మరియు వీడియోలను కూడా చూడవచ్చు. అటువంటి ఛానల్స్‌లో ఒకటి ప్యాట్రిక్ జెఎమ్‌టి- ఇది యూట్యూబ్‌పై అత్యత ప్రజాదరణ కలిగిన ఎడ్యుకేషన్ ఛానల్స్‌లో ఒకటి, ఇది 150,000 సబ్‌స్క్రైబర్‌లకు ఉచిత గణిత వీడియోలను అందిస్తోంది.

2. గ్రామర్ నైపుణ్యాలను పెంపొందించడం

మీ బిడ్డ భాషపై నైపుణ్యాన్ని కోల్పోకుండా చూడటం కొరకు, గ్రామర్ కాన్సెప్ట్‌లను కలిసి సమీక్షించడం మరియు తరువాత సంవత్సరం సిలబస్ మీద పనిచేయడం ఉపయోగకరంగా ఉంటుంది. భాషా నైపుణ్యాలు దెబ్బతినకుండా చూడటం కొరకు ఇంగ్లిష్ గ్రామర్ 101 వంటి వెబ్‌సైట్‌లు మరియు వీడియోలను ఉపయోగించడం ద్వారా మీ బిడ్డ భావనలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేలా చూడండి.

3. బ్లాగుల ద్వారా క్రియేటివ్ రైటింగ్

మీ బిడ్డ ఒక బ్లాగ్‌ని రూపొందించేందుకు ప్రోత్సహించండి. ట్రావెల్ స్టోరీలతో వారు బ్లాగ్‌ని అప్‌డేట్ చేయగలరు అలానే సెలవుల డిఐవై సక్సెస్ స్టోరులు లేదా వారికి స్ఫూర్తిని కలిగించిన వాటి గురించి రాయవచ్చు. ఇది వారిలో సృజనాత్మకతను పెంపొందిస్తుంది, వారు నిమగ్నం కావడానికి మరియు తప్పులు లేకుండా రాయడానికి దోహదపడుతుంది.

4. బలహీనంగా ఉండే సబ్జెక్టులతో దృష్టి కేంద్రీకరించండి

మీ బిడ్డ కనీసం ఒక సబ్జెక్టులో ఇబ్బందులను ఎదుర్కొనవచ్చు. విసుగు కలిగించే ఈ సబ్జెక్టులో నైపుణ్యం సంపాదించడానికి వేసవి సెలవులు ఒక ఆస్కారాన్ని కల్పిసత్యి. ఎడ్యూరైట్ నుంచి వచ్చే ఇంటరాక్టివ్ పాఠాలు డెల్ ప్రొడక్ట్‌లకు యాడ్ ఆన్, అన్ని సబ్జెక్టుల్లో మీ బిడ్డ నాలెడ్జ్‌ని అవి సమర్థవంతంగా పెంపొందిస్తాయి, తద్వారా వచ్చే విద్యాసంవత్సరాన్ని ఎంతో గొప్పగా ప్రారంభించగలుగుతారు.