ఉపాధ్యాయులకు ఉచిత ఆన్‌లైన్ టీచింగ్ టూల్స్

విద్యా బోధనను ఆసక్తికరం చేయాలని, మీ విద్యార్థులతో మరింత ఇంటరాక్ట్ కావాలని మీరు అనుకుంటున్నారా? మీ విద్యార్థులను మరింతగా మమేకం చేయాలనుకుంటున్నారా? దీనికి ఆన్‌లైన్ టీచింగ్ టూల్స్ ఒక్కటే కీ. వీడియోలు, స్లైడ్ షోలు, గేమ్స్, బృందాలవారీగా చర్చలు మీకు అందుబాటులో ఉంటాయి. టెక్నాలజీపరంగా విద్యార్థులతో పాటుగా కలిసిపోయినట్లయితే క్లాస్ రూములో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. తరగతి గదిని కంప్యూటరుతో అనుసంధానిస్తే 21వ శతాబ్దికి అనుగుణంగా విద్యార్థుల యొక్క కీలక సాంకేతిక నైపుణ్యం పెరగడమేగాక, వారిలో మరింత నేర్చుకోవాలనే తపన చోటుచేసుకుంటుంది. 

ఈ ఆరు బోధనా ఉపకరణాలు మీ విద్యార్థులు కాన్సెప్టుని అర్థం చేసుకోవడంలో ఉపకరిస్తాయి.

1. Edmodo

పిల్లలు సాటివారితో కలగలిసి చదవడానికి ఇష్టపడతారు. అదే సమయంలో డిజిటల్ ప్రపంచంలోకి ప్రవేశించడానికి ఉత్సాహం చూపుతారు. ఈ రెండిటినీ కలగలుపుతూ ఎడ్‌మోడో ఒక నియమిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రూపొందించింది. ఈ వేదిక ద్వారా టీచర్లు ఆన్‌లైన్‌లోనే హోమ్ వర్క్‌ని అసైన్ చేయవచ్చు, సరిదిద్దవచ్చు. దీనిమూలాన తమ హోమ్ వర్క్‌పై ఎప్పటికప్పుడు గ్రేడ్ తెలుసుకుంటూ పిల్లల్లు సంబరపడిపోతారు. తదుపరి క్లాసులో జరగబోయేదేమిటోకూడా వాళ్లు ముందుగానే తెలుసుకోగలుగుతారు.      

మీరు చేయాల్సిందల్లా మీ స్కూలు తరఫున చేరి, ఒక స్టడీ బృందాన్ని క్రియేట్ చేయడమే. ఒక్కసారి సైన్-అప్ అయినట్లయితే మీ విద్యార్థులతో గ్రూప్ కోడ్ పంచుకుని ఆరంభించవచ్చు! మీరు సైన్-అప్ కాగానే ప్లాటుఫార్మ్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ ఇచ్చిన స్క్రీన్ షాట్ చూడండి. మీ క్లాస్ బృందాన్ని సృష్టించండి

2. Kahoot!

తరగతిలో క్విజ్ నిర్వహణకు, ప్రశ్నపత్రం తయారీకి సాయం కావాలా? కహూట్! ఉచితంగా మీకు సేవలందించగల యూజర్-ఫ్రెండ్లీ టూల్. దీనిద్వారా విద్యార్థుల తెలివితేటల్ని గ్రహించడానికి క్విజ్, సర్వే, ప్రశ్నాపత్రాలను టీచర్లు తయారు చేయగలరు. స్టూడెంట్లు భిన్నమైన పరికరాలతో జవాబులు చెప్పగలరు. క్విజ్‌లను, ప్రశ్నలను "కహోట్స్"గా వ్యవహరిస్తారు. ఇది క్లాస్‌రూములో మూస పద్ధతికి భిన్నంగా క్రీడా వాతావరణంకోసం రూపొందించబడినది. ప్లేయర్లు తమ కంప్యూటరుతో జవాబులిస్తారు. ఆటలన్నీ ఒక భాగస్వామిక స్క్రీన్ పైన ప్రదర్శితమవుతాయి. క్లాసంతా ఒక్కటిగా ‘క్యాంప్ ఫైర్’లా మారిపోతుంది. ఇక్కడ చూడండి మీ సొంత క్విజ్ రూపొందించడం ఎంత సులభమో!

3. Schoology


ఒకొక్కసారి, లెక్చర్లలో కవర్ చేసిన అంశాలను, ఇంకా చెప్పాల్సిన అంశాలను గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. అటువంటప్పుడు ఈ లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్టమ్ (ఎల్ఎన్ఎస్) అవసరపడుతుంది.  

స్కూలజీ ఒక లెర్నింగ్ మేనేజిమెంట్ సిస్టమ్. తరగతికి సంబంధించిన హాజరు పట్టీ, బోధనా ప్రణాళిక, క్యాలెండర్ల రూపకల్పనకు వీలు కల్పిస్తుంది. ఈ టూల్ విద్యార్థుల నడుమ ఇంటరాక్షన్‌కి, స్టూడెంట్ అసెస్‌మెంట్ ఫలితాలకుకూడా వినియోగపడుతుంది. అసైన్‌మెంట్లను, క్విజ్‌లను, మీడియా ఆల్బమ్‌లను... ఇంకా విద్యార్థులలో ఉత్సాహం పుట్టించడానికి ఇతర వనరులనుకూడా జత చేయవచ్చు. ఉమ్మడి విద్యాభ్యాసాన్ని పెంచడానికి ఇదొక అద్భుతమైన టూల్. దీని బేసిక్ ప్యాకేజీ ఉచితం. ఈ టూల్ అందించే విసృత ప్రయోజనాలేమిటో ఇక్కడ చూడండి. 

 

 4. Desmos

గ్రాఫ్‌లు గీయడం బోలెడంత శ్రమ. ప్రతి సబ్జెక్టుకి పీరియడ్ వారీగా సమయం కేటాయించడంవల్ల, వేగంగా ప్రాజెక్ట్ గ్రాప్‌ల తయారీకి ఈ టూల్ ఎంతో ఉపయోగం.

డెస్మోస్ అతి వేగవంతమైన ఆన్‌లైన్ కాలిక్యులేటర్ కావడంతో ఎలాంటి ఊహాత్మకమైన గ్రాఫ్‌నైనా క్షణాల్లో రెడీ చేయగలదు. వినియోగించేవారు తమకు అనువుగా స్లైడర్లను జత చేసుకోవచ్చు. డేటా టేబుల్ వగైరాలను గీసుకోవచ్చు. జామెట్రీ, సమీకరణాలు వంటి క్లిష్టమైన అంశాలను బోధించేటప్పుడు విద్యార్థులను ఆసక్తిగా మలచడం కష్టం. ఆ పనిని డెస్మోస్ చేసి పెడుతుంది. పాఠ్య పుస్తకాలకు మించి మిమ్మల్ని తీసుకెళ్తుంది. క్లాస్‌రూములో పిల్లల దృష్టి మరలకుండా తాజా సమాచారాన్ని అందించడానికి ఈ టూల్ మీకు సాయపడుతుంది.  5. Duolingo

భాషా అభ్యాసానికి విద్యార్థులు అంతగా సుముఖంగా ఉండరు. వాళ్లు తొందరగా బోర్ అనుభవిస్తారు. నిస్సారమైన బోధనా పద్ధతులను పాటించడంవల్ల బాషా బోధనా మరింత సంక్లిష్టంగా మారుతుంది.

డ్యూలింగో పాఠ్యాంశాల బోధనకు చాలా ప్రభావవంతమైనది. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మేథమేటిక్స్)పై దృష్టి సారంచడానికి అనేక అప్లికేషన్‌లు, టూల్స్ ఉండడంవల్ల, ఆసక్తికరంగా భాషలను నేర్పించడానికి డ్యూలింగో ధైర్యంగా ముందుకొచ్చింది. భాషా బోధనను అక్షరాలు దిద్దించడంతో మొదలుపెట్టి క్రమంగా పదాలను నేర్పడం, ఆ తర్వాత వాక్య నిర్మాణం చెప్పడంవంటి మూస పద్ధతిని అనుసరించదు. అలతి పదాలతో మొదలుపెట్టి క్రమంగా సంక్లిష్టమైన వాక్యాల దిశగా ఒక విశిష్ట బోధనా పద్ధతిని పాటిస్తుంది.డ్యూలింగో ఉపయోగించి మీ స్కుళ్లకోసం వేర్వేరు లాగ్వేంజీలలో బోధనాశాలనుకూడా ఇక్కడ రూపొందించుకోవచ్చు.