తరగతి గదిలో ఇబ్బంది పడుతున్న విద్యార్ధులకు స్ఫూర్తిని కలిగించేందుకు 5 మార్గాలు

 

 

మనకు అత్యుత్తమ టీచింగ్ ప్లాన్ ఉండవచ్చు, అలానే పురోగతి ట్రాక్ చేయడానికి మంచి అసెస్ మెంట్ లు అభివృద్ధి చేసి ఉండవచ్చు, సెమిస్టర్ సకాలంల పూర్తి చేయడానికి ప్లాన్ లు మరియు మ్యాప్ లు ఉండవచ్చు, అయితే, ఇంకా ఏదైనా లోపించిందా? ఒక సాధారణ విద్యార్ధి గొప్ప విజయం సాధించడాన్ని చూడటం ఆనందం కలిగించదా?

విద్యార్ధులకు స్ఫూర్తిని కలిగించడం కొరకు తరగతి గదిలో కంప్యూటర్ ఉపయోగించడానికి సంబంధించిన 5 వ్యూహాలు ఇవిగో:

  • విద్యార్ధుల మైండ్ ని అర్థం చేసుకోవడం:  విద్యార్ధులకు అభ్యసనకు సంబంధించిన ఒక అదృశ్యమైన నమ్మకం ఉంటుంది. వారు కొన్ని సామర్ధ్యాలు మరియు నైపుణ్యాలు లేకుండా జన్మించినట్లుగా విశ్వసిస్తారు, వారికి తగినంత స్ఫూర్తిని కలిగించినప్పుడు మాత్రమే వీటిని అధిగమించిగలుగుతారు. దీని నుంచి బయటపడటానికి అత్యంత ముఖ్యమైన అంశం, వారిని ప్రశంసించడం: ప్రతివారం నీ రాత అసైన్ మెంట్ లను నువ్వు బాగా చేస్తున్నావు. వావ్, నువ్వు చదవడం బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు, నీ డ్రాయింగ్ చాలా అద్భుతంగా ఉంది. సామర్ధ్యాలను ప్రశంసించడం వల్ల అది దీర్ఘకాలిక అభ్యసనను ప్రోత్సహిస్తుంది మరియు వచ్చేసారి వారు మరింత మెరుగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది.
  • బడ్డీ మెంటారింగ్ కార్యక్రమం- మీ విద్యార్ధులకు అన్నివేళలా ఉపాధ్యాయులు కావొద్దు, వారి బడ్డీగా ఉండటానికి ప్రయత్నించండి. ఇది వారు ఆత్మవిశ్వాసాన్ని పొందడానికి మరియు మిమ్మల్ని నమ్మడానికి సాయపడుతుంది, తద్వారా వారు మెరుగ్గా పనిచేయగలరు. చదువు మరియు అనుసంధానం కావడానికి ఒక ఆధునిక మార్గం వన్ డ్రైవ్ మరియు ఇమెయిల్స్ ద్వారా ఆన్ లైన్ లో అనుసంధానం కావడం. ఈ ఫ్లాట్ ఫారాల ద్వారా మీరు మీ డేటాను స్టోరు చేయవచ్చు మరియు పంచుకోవచ్చు
  • 2*4 టెక్నిక్ ప్రయత్నించండి - సరళమైనది మరియు సమర్థవంతమైనది ఈ టెక్నిక్ విద్యార్ధులు 4 రోజులకొరకు 2 నిమిషాలపాటు వారి ఆలోచనలు వ్యక్తీకరించేలా సూచిస్తుంది. వారు కోరుకున్న ఏవిషయంపైన అయినా మాట్లాడవచ్చు- వారు ప్రాణ స్నేహితుడి గురించి లేదా వారు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ గురించి మాట్లాడవచ్చు. మీరు మీ విద్యార్ధుల గురించి మరింత తెలుసుకోవచ్చు, వారితో సత్సంబంధాలను ఏర్పరుచుకోవచ్చు, ఇంకా వారికి బాగా ఇబ్బంది కలిగించే విషయాల గురించి చర్చించవచ్చు.
  • గ్రూపు కార్యకలాపాలను ప్రోత్సహించడం - విద్యార్ధులను ప్రేరణ కలిగించడం, చురుగ్గా నేర్చుకునేలా ప్రోత్సహించడానికి మరియు కమ్యూనికేట్ చేయడానికి గ్రూపు వర్క్ అనేది అత్యంత సమర్ధవంతమైన విధానం కావొచ్చు. గ్రూపు వర్క్ లో పాల్పంచుకునే విద్యార్ధులు సహకారాత్మకంగా ఉంటారు మరియు మెరుగైన పురోగతిని కనపరుస్తారు మరియు విడిగా యాక్టివిటీ చేసేవారితో పోలిస్తే మరింత ఆత్మవిశ్వాసంగా ఉంటారు (ద నేషనల్ అకడమిక్స్ ప్రెస్- https://www.nap.edu/read/5287/chapter/3).

 

 

  • ట్రాక్ పురోగతి - మానవులు సానుకూల విషయాల కంటే వ్యతిరేక విషయాలనే ఎక్కువగా చూస్తుంటారు. వారికి ప్రోగ్రెస్ రిపోర్ట్ ని చూపించడం ద్వారా పిల్లల్లో సానుకూలతను పెంపొందించేలా చూడండి. వారు ఎంత దూరం వచ్చారు అని చూపించడం కొరకు రిపోర్ట్ ను డయాగ్రమ్స్ మరియు ఎక్సెల్ షీటు ద్వారా చూపించవచ్చు.

ప్రేరణ కలిగించే టీచర్లు తమ విద్యార్ధుల పట్ల కరుణ మరియు సహానుభూతిని కనపరుస్తారు మరియు తద్వారా టీచింగ్ ని మంచి నుంచి గొప్ప వైపుకు! మళ్లిస్తారు.