మేకర్స్పేస్ అనేది భవిష్యత్ గ్రంథాలయం

 

బోధనా రంగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పుల మూలాన దేశవ్యాప్తంగా అనేక అభ్యాస పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. స్కూలులో డిజిటల్ విద్యాబోధన నిమిత్తం పీరియడ్లవారీగా క్లాసులు తీసుకోవడం మొదలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడం వరకు టీచర్లు వివిధ ఉపకరణాలను, పద్ధతులను అనుసరిస్తున్నారు.బోధనా రంగంలో చోటుచేసుకుంటున్న సాంకేతిక మార్పుల మూలాన దేశవ్యాప్తంగా అనేక అభ్యాస పద్ధతులు ప్రాచుర్యం పొందుతున్నాయి. స్కూలులో డిజిటల్ విద్యాబోధన నిమిత్తం పీరియడ్లవారీగా క్లాసులు తీసుకోవడం మొదలు ఆన్‌లైన్‌లో పాఠాలు బోధించడం వరకు టీచర్లు వివిధ ఉపకరణాలను, పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇంతకీ ఈ మేకర్‌స్పేస్ అనగానేమి? మేకర్‌స్పేస్ అనేది పిల్లల్లో ఆలోచనలను వికసింపజేయడానికి ఉపకరించే అనువైన ఉపకరణాలను, సదుపాయాలను కల్పించడానికుద్దేశించిన అభ్యాస విధానం.   

 

 

మేకర్‌స్పేసెస్ అనేది కె-12 టీచింగ్‌కి గుర్తించిన అభ్యాస సాంకేతికతలోని ఆరు ముఖ్య పరిణామాల్లో ఒకటిగా న్యూ మీడియా కన్సార్షియమ్-2015 పేర్కొనడమైంది. "విద్యార్థుల్లో సృజనాత్మకతను, చురుకైన ఆలోచనను పెంపొందిస్తూ స్వయంగా తమకుతామే డిజైన్, నిర్మాణం మరియు పదే పదే అభ్యాసాలద్వారా ఆరితేరేలా తీర్చిదిద్దడంలో మేకర్‌స్పేసెస్ తోడ్పడుతుంది" (పేజీ 38). మేకర్‌స్పేసెస్‌లో సమకూర్చిన ఉపకరణాలు, సదుపాయాలు అన్నిటినీ  వినియోగించుకుని పిల్లల్లు మున్ముందు జీవితంలో తమ ఆలోచనలను, పద్ధతులను తీర్చిదిద్దుకోగలుగుతారు.

 

సమస్యలకు క్లాస్ రూములో పొందలేని పరిష్కారాలను, సమాధానాలను మేకర్‌స్పేస్ ద్వారా విద్యార్థులు పొందగలుగుతారు. అనేక క్లిష్టమైన అంశాలనుసైతం తెలివిగా, నైపుణ్యంగా, ఉపకరణాల సాయంతో అవలీలగా పరిష్కరించగలిగిన అనుభూతుని పొందుతారు.        

 

ఇదొక్కటే కాదు, విద్యార్థులు కేవలం టెక్స్ట్ బుక్కులకే పరిమితం కాకుండా ఇతరత్రా ముఖ్య విషయాలలోసైతం తమ సృజనాత్మకత చాటుకోవడానికి నూతన మార్గాల అన్వేషణకు మేకర్‌స్పేస్ వీలు కల్పిస్తుంది.

"మేకర్‌స్పేస్ సామాజిక, సాంస్కృతిక పరిజ్ఞానం పెంపొందించుకోవడానికికూడా ఉపయోగపడుతుంది" అని ముంబైలోని ఆర్.ఎన్.పోదర్ స్కూలుకి చెందిన ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ వర్ష భంబానీ అన్నారు. "విద్యార్థులు విషయాన్ని అర్థం చేసుకోవడంతోపాటు, వారు తమ సొంత ఆలోచనలతో అభివృద్ధిపరచడానికి అనువైన అవకాశాన్ని మేకర్‌స్పేస్ కల్పిస్తుంది" అన్నారు భంబానీ. ఈ రోజున వివిధ అప్లికేషన్లద్వారా చక్కటి అభ్యాసాన్ని అలవరచడానికి సొంత మేకర్‌స్పేస్ కలిగిన స్కూళ్లలో ఆర్.ఎన్.పోదార్ స్కూలుకూడా ఒకటి. 

 

కాబట్టి, మీ స్కూలులో మేకర్‌స్పేస్ ఏర్పాటు చేసుకోవడమెలా? 

ఈ ప్రయాణంలో మీకు సహాయపడడంకోసం ఇక్కడొక సాధారణ ఇన్‌ఫోగ్రాఫిక్ ఇవ్వడమైంది. ఇది మీ స్కూలులో మేకర్‌స్పేస్ ఏర్పాటుకు సాయపడగలదు. 

 

 

వీటన్నిటితోపాటుగా, ఇక్కడ సూచించిన జాబితాలోని స్క్రాచ్, మేకీ మేకీ, మేక్ బ్లాక్ వంటి సాప్ట్‌వేర్, ఇతర వెరైటీ ఉపకరణాలనుకూడా సమకూర్చుకోవాలని భంబానీ సూచిస్తున్నారు. కంప్యూటర్ సాయంతో పిల్లలు తమ సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ ఉపకరణాలు దోహదపడతాయి. మేకర్‌స్పేసెస్ తమ కల్పనాశక్తిని గుర్తించి బ్లాక్‌లను నిర్మించగలిగేలా కంప్యూటర్లు జీవశక్తిని అందిస్తాయి. మేకర్‌స్పేస్ విద్యార్థులు ఒక పిసి ద్వారా ఆన్‌లైన్ కోర్సు నేర్చుకుంటూ మొత్తం పుస్తకాన్ని స్క్రీన్-ప్రింట్ చేయడమెలాగో నేర్చుకుంటారు. ఒక 3-డి ప్రింటర్ సాయంతో మోడల్ ఇళ్లనుకూడా నిర్మిచగలుగుతారు. [1] అపరిమితమైన అద్భుతాల సృష్టి మీ మేకర్‌స్పేస్‌కి సరైన కంప్యూటరుని ఎంచుకోవడంద్వారా సాధ్యపడుతుంది.  

మేకర్‌స్పేస్ ద్వారా కలిగే అభ్యాస లాభాలు అనేకం. అభ్యాసం, అభివృద్ధికి సంబంధించి విద్యార్థిపై మేకర్‌స్పేస్ గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది. మీ స్కూలులో మేకర్‌స్పెస్‌ని ఏర్పాటు చేసుకోవడంద్వారా అద్భుత ఫలితాలు అందుకోగలుగుతారు. పిల్లల్లో గూడుకట్టుకున్న సందేహాలన్నిటికీ సమాధానం పొందగలరు. విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెంపొందడానికి మేకర్‌స్పేస్ ఎంతగానో దోహదపడుతుంది. అందువల్లనే ఇది భవిష్యత్ గ్రంథాలయంగా పేరుపొందింది. మేకర్‌స్పేస్‌కి పెట్టుబడి పెట్టడమనేది విద్యార్థి మెదడులో నిక్షిప్తమైన సామర్హ్యాన్ని వెలికితీయడానికి ఒక తాళం చెవిలాంటిది. [2]