కొత్త బోధన శకానికి అనుగుణంగా మారడం

 

మారుతున్న కాలంతో, దేశ వ్యాప్తంగా బోధన నమూనాలో నవీకరణ జరిగింది. హఠాత్తుగా, ప్రతి ఒక్కరూ డిజిటల్ తరగతి నమూనాని అవలంబిస్తున్నారు, పిసి అభ్యాసం ఈ కొత్త శకం బోధనకి కేంద్రం అయ్యింది.

 

మా విద్య కొరకు డెల్ కార్యక్రమంలో భాగంగా, ఉపాధ్యాయులు వారి నైపుణ్యాలను విస్తరించుకోవడానికి మరియు పిసి ఎనేబుల్డ్ అభ్యాసాన్ని చేర్చడంలో సహాయపడటానికి మేము వెబినార్లను ప్రారంభించాము.

 

75-90 నిమిషాలకు పైగా, భావనలను నిమగ్నం చేయడం, సమర్ధవంతమైన ఆన్ లైన్ బోధన, రూపకల్పన మరియు అభ్యాస ఫలితాల ప్రాధాన్యత, బోధన నమూనాల సమర్ధత, మదింపులను పునరాలోచించడం మరియు ఆన్ లైన్ సెషన్లో దేనిని నివారించాలో తెలుసుకోవడం గురించి మీరు నేర్చుకోవచ్చు.

 

మా శిక్షణల యొక్క ముఖ్య ఫలితాలు ఇవి-

మీ పరివర్తన కొరకు

  • ఆన్ లైన్ మాధ్యమం పై మీరు తరగతిని నిర్వహించే ముందు ఆ ఆన్ లైన్ మాధ్యమం గురించి నేర్చుకోండి. దాని ఫీచర్లు మరియు సాధనాల గురించి తెలుసుకోండి. ముందస్తుగా ట్రయల్ క్లాస్ ను నడిపి చూడండి.
  • మీ వ్యక్తిగత శైలి కొరకు మీ కెమెరాను స్విచ్ ఆన్ చేయండి. తరగతిలో సమాధానాలు చెప్పమని వ్యక్తులను ప్రోత్సహించండి. వారి ప్రశ్నలకు స్పందించండి.
  • అంతరాయం లేని ఇంటర్నెట్ ప్రాప్తి లేని లేదా బిజీగా ఉన్న విద్యార్ధుల కొరకు సిద్ధంగా ఉండండి, ప్రతి సెషన్ ను ప్రీ-రికార్డ్ చేయండి.

ఇంటరాక్టివ్ పాఠాల కొరకు

  • పాఠాన్ని చిన్న భాగాలుగా విడదీయడం ద్వారా సంక్షిప్తంగా ఉంచండి. వీడియోలు మరియు పిడిఎఫ్ ల వంటి పఠన సామగ్రిని అందించండి.
  • బహుళ అంశాలు మరియు తాజా సమాచారం కలిగి ఉన్న ఇ-లైబ్రరీని సృష్టించండి. ఆకర్షణీయమైన వీడియోలు మరియు ఆడియో క్లిప్పులను ఉపయోగించి దృష్టిని ఆకర్షించండి.
  • సాధించిన పురోగతిని కొలవడానికి ఇంటరాక్టివ్ అసైన్మెంట్లు, క్విజ్ లు మరియు పోల్స్ ద్వారా తరగతిని నిమగ్నం చేయండి.

మీరు ఎదుర్కొనగలిగే ఇబ్బందుల కొరకు

  • కొందరు విద్యార్థులు ఆడియో ద్వారా, కొందరు వీడియో ద్వారా నేర్చుకుంటారు. అందరు విద్యార్ధులను నిమగ్నం చేయడానికి మీ బోధనా ప్రదర్శనలో బహుళ ఫార్మాట్లను చేర్చండి.
  • విద్యార్థుల సందేహాలను తీర్చడంలో తలెత్తగలిగే సంభావ్య సాంకేతిక సమస్యల గురించి అవగాహన కలిగి ఉండండి. ఆన్ లైన్ పత్రాలకు మీరు బహిరంగ ప్రాప్యతను ఇస్తున్నారని నిర్ధారించుకోండి.
  • ఆన్ లైన్ అభ్యాసం యొక్క ఏకాంతంతో వ్యవహరించడంలో విద్యార్థులకు సహాయపడటానికి, ఇంటరాక్టివ్ అభ్యాసం కొరకు సమూహ కార్యకలాపాలు, అసైన్మెంట్లు, మరియు ప్రెజెంటేషన్లను సమన్వయం చేయండి.

 

ఉపాధ్యాయులుగా, మారుతున్న కాలం కొరకు సిద్ధంగా మరియు సన్నధ్ధంగా ఉండండి. మరింత నైపుణ్యం పెంచుకోవడానికి మరియు అభ్యాసం యొక్క భవిష్యత్తును స్వీకరించడానికి ఇక్కడకు వెళ్ళండి. (https://www.dellaarambh.com/webinars/)