కంప్యూటర్ ఉపయోగించి ఈ బట్టీ విధానానికి విరుద్ధంగా పాఠాలకు ప్రాణం పోయండి

 

టీచర్‌గా, మీరు పిల్లలకు చదవడానికి సంబంధించి ఉండే సంబంధాన్ని మార్చే శక్తి ఉం టుంది. పరీక్షలకు ముందు పిల్లలను చదవడం కొరకు ఏదైనా చేయడానికి బదులుగా, మీరు లేదా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి విముఖత లేకుండానే పిల్లవాడు కోరుకునే రీతిలో దానిని మార్చేందుకు మీరు చర్యలు తీసుకోవచ్చు.

దిగువ పేర్కొన్న అనే విధాలుగా కంప్యూటర్ సహాయపడగలదు, పాఠాలకు మీరు ప్రాణం ఎలా పోయవచ్చో ఇక్కడ చూడండి:

1) క్లాసును ఆశ్చర్యానికి గురి చేసే అంశాన్ని తీసుకురండి

విద్యార్ధులు స్టడీ మెటీరియల్ పరీక్షల తరువాత కూడా చాలా ఎక్కువ కాలం గుర్తించుకునేందుకు ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీ లెసన్‌కు సంబంధించిన ఒక పదం The Revolutionని “het nuvreilovoi”పై రాయండి,దీంతో విద్యార్ధుల్లో ఆ పదం ఏమిటి తెలుసుకోవడానికి ఉత్సుకత పెరుగుతుంది.

2) ఉదాహరణలు చూపించడం

మీ విద్యార్ధులపై ప్రభావాన్ని చూడటం కొరకు మీరు నిజంగా దీనిని ప్రయత్నించాల్సి ఉంటుంది. మీరు బోధిస్తున్న షేక్స్ఫియర్ నాటకం యొక్క మూవీ వెర్షన్‌ని చూపించడం లేదా మొక్క జీవిత దశను వివరించడం కొరకు క్లాసుకు మొక్క తీసుకొని రావడం- ఇలా చాలా విషయాలను ఉదాహరణలుగా చూపించి బోధించవచ్చు.

3) మీ విద్యార్ధులు లోతుగా ఆలోచించి, సబ్జెక్ట్ విషయాలకు అనుసంధానం అయ్యేలా ప్రోత్సహించడం

దీని కోసం మీరు విద్యార్థులకు ఒక టాపిక్ ఇచ్చి, దానిపై కంప్యూటర్లో శోధించమని కొంత సమయం కేటాయించాలి, దాని తరువాత దానిపై క్లాసులో చర్చను నిర్వహించాలి. దీని వల్ల విద్యార్ధులు భావనల గురించి మరింత లోతుగా ఆలోచించడానికి, మరింత ఊహాత్మక పదాల గురించి ఆలోచించడానికి, విభిన్నటాపిక్ల మధ్య ఉండే సంబంధాలను తెలుసుకోవడానికి దారితీస్తుంది.

4) హోమ్ వర్క్‌ని ఆసక్తికరంగా తీర్చిదిద్దండి

మీ విద్యార్ధులు Drawisland వంటి కంప్యూటర్ వనరులు ఉపయోగించి మీ విద్యార్థులు కార్టూన్లుగా మారిపోవడం గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
క్లాసు ఎంతో ఉత్సాహంగా నేర్చుకుంటుందో ఒక్కసారి ఊహించండి.

5) ప్రాక్టీస్ పేపర్ల కొరకు క్లాస్ టైమ్‌ని కేటాయించడం

తరచుగా పిల్లలు పరీక్షలకు ముందు చివరి నిమిషంలో ప్రాక్టీస్ పేపర్లు తయారు చేస్తారు మరియు చాలా సందేహాలను అలానే ఉండిపోతాయి. ఇటువంటివి జరగకుండా నిరోధించడం కొరకు, మీరు క్లాసులో రెగ్యులర్‌గా టెస్టులు నిర్వహించి, మీ విద్యార్ధులకు Wikispaces Classroom, Google Classroom ద్వారా లేదా ఇమెయిల్ ద్వారా ఫీడ్‌బ్యాక్ పంపవచ్చు, తద్వారా మీ పిల్లలు రివిజన్ చేసుకునేటప్పుడు ఫీడ్‌బ్యాక్‌ని రిఫర్ చేయగలుగుతారు.

విద్యార్థులకు బోధించడం యొక్కపరమార్ధం వారు భావనలను తేలికగా అర్ధం చేసుకోవడం మరియు పరీక్షల తరువాత కూడా గుర్తుంచుకునేలా చేయడం. బట్టీపట్టి చదవడం వల్ల చాలా సందర్భాల్లో ఇలాంటివి లోపిస్తాయి. మీరు మీ లెసనర్ ప్లాన్లను నేరుగా ప్రారంభించవచ్చు మరియు అతి తక్కువ కాలంలో తేడాను గమనించవచ్చు. హ్యాపీ టీచింగ్