BYOD: విద్యా ట్రెండ్ని మీరు విస్మరించలేరు

 

మీ చిన్నారికోసం ఒక పిసిని ఇంటికి తీసుకురావడమనేది రోజూ ఒక బహుమతిని ఇవ్వడంలాంటిదే! ఒక చిన్న క్లిక్తో మీ బిడ్డ ఆడుకోగలదు, చదువుకోగలదు మరియు ప్రపంచాన్ని దర్శించగలదు. ఇదే అనుభూతిని మీ చిన్నారి స్కూలులో తన సొంత పిసి ద్వారా చదువుతూ పొందుతుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి!

BYOD నిగానీ లేదా ప్రపంచంలో విద్యారంగంలో ట్రెండ్గా మారిన మరేదైనా మీ సొంత డివైజ్నిగానీ తీసుకు రండి. ఇక్కడ మీరు తెలుసుకోవలసిందేమిటంటే.

BYOD అనగా ఏమిటి?

ప్రధాన సాఫ్ట్వేర్ తయారీదారు అడోబ్ ఇటీవల నిర్వహించిన సర్వేలో, సాంకేతికత మరియు విద్యాభ్యాసాల మేలు కలయికగా దీనిని దాదాపు 85 శాతం విద్యా సంస్థలు విశ్వసించాయి. [1] అన్ని వయసుల విద్యార్థులు సాంకేతికతతో కూడిన రోజువారీ అభ్యాసానికి BYOD ప్రాక్టీసు ఎంతో అవసరం.
పిల్లలు చేయాల్సిందల్లా తమ పిసిని స్కూలుకి తీసుకెళ్లి, ఇంటర్నెట్ మరియు తగిన చార్జింగ్ పాయింట్లు ఉన్నచోట దానిని అమర్చుకోవడమే.

మీ పిల్లలకు ఇదెలా సహాయపడగలదు?

కంప్యూటర్ ద్వారా చదువుకోవడానికి వయసుతో నిమిత్తం లేదు. ఒక విద్యార్థి తరగతి గదిలో నేర్చుకోవడానికి సొంత పిసి కలిగినట్లయితే అవే ప్రయోజనాలు సమకూరతాయి. పదే పదే వినియోగించడంద్వారా పిల్లలు పిసిలపై పనిచేయడంలో ప్రావీణ్యం పొందుతారు. అదే విధంగా సమయం కలిసొస్తుంది మరియు స్కూలులో కొత్త సాంకేతికతకు వీలు కలుగుతుంది. అదే సమయాన్ని మరియు ప్రయత్నాన్ని ఒక అసైన్మెంట్పై పనిచేయడానికి మరియు చదువుకోవడానికి వినియోగించుకోవచ్చు. అన్నిటికంటే, తమ సొంత పిసిగా భావించడంవల్ల పిల్లలు వ్యక్తిగత బాధ్యతగా చదువుపై అధిక ధ్యాస కనబరుస్తారు. BYOD జర్నల్ ఇలా అంటుంది- ప్రతి విద్యార్థి భవిష్యత్తుకోసం ‘తమ సొంత చేతులతో అభ్యసించాలి’. [2]

భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?

మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ సాంకేతికతను ఒంటబట్టించుకోవడం మరియు మార్పులను త్వరితంగా స్వీకరించడాన్నిబట్టి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి, నేటి బాలలు ఎదుగుదలకు ఇది సాయపడుతుంది. చాలా అధిక భారతీయ పాఠశాలల్లో ఐటి గదులనేవి సర్వసాధారణ స్థలంగా మారింది. మరియు స్కూళ్లలో ఇవి చాలా గొప్ప నాందిగా మారాయి. పాఠ్యాంశాన్ని కేవలం బట్టీ పట్టడంగా కాకుండా, ఆసక్తిదాయకంగా మరియు సులభగ్రాహ్యంగా నేర్చుకోవడానికిగాను ఇంటిలోనూ మరియు స్కూలులోనూ ప్రతి ఒక్క విద్యార్థికి తనకంటూ సొంత పిసి ఉండాలి.