BYOD: ఇది స్కూళ్లకు ఏవిధంగా సహాయపడుతుంది

 

BYOD అంటే ఏమిటి?

BYOD లేదా స్కూలుకు మీ స్వంత కంప్యూటర్ తీసుకురావడం అనేది, స్కూలులో అభ్యసన కొరకు స్వంత కంప్యూటర్ తెచ్చుకోవడాన్ని తెలియజేస్తుంది. క్లాసుల్లో, బ్రేక్ సమయంలో చదువుకోవడానికి కంప్యూటర్ ఎంతగానో సహాయపడుతుంది, ఒకవేళ విద్యార్ధులు కోడింగ్ క్లబ్ వంటి స్కూలు అనంతర కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లయితే కంప్యూటర్ అవసరం అవుతుంది. ఇది భారతదేశవ్యాప్తంగా స్కూళ్లలో ఈ భావన వేగం పుంజుకుంటోంది, ఎందుకంటే, కంప్యూటర్ ద్వారా విద్యార్ధులు నేర్చుకోవడానికి ఇది ఒక సమర్ధవంతమైన మార్గం.
డిజిటల్ నేటివ్ స్టూడెంట్ కొరకు ఒక సందర్భం సృష్టించడం

డిజిటల్ నేటివ్ స్టూడెంట్ అంటే ఎవరు?

మీవిద్యార్ధులు అందరూ
ఇవాళ పిల్లలు కంప్యూటర్ని ఉపయోగించడమే కాదు, దానితో ఎదుగుతున్నారు. ఇది వారి రోజువారీ స్టడీ రొటీన్లో ఒక సరైన రీతిలో ఒక సహజభాగమైంది. మీ స్వంత కంప్యూటర్ని స్కూలుకు తీసుకొని రావడం వల్ల అనేక ప్రయోజాలు ఉన్నాయి, మరిముఖ్యంగా మీ పిల్లవాడు ఎదుగుతున్న కొలదీ ఈ ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఈ దిగువ పేర్కొన్న ప్రయోజనాల కొరకు మీరు మీ స్కూలులో BYODని ప్రోత్సహించాలి:

1) విద్యార్ధులు చాలా సంతోషంగా ఉంటారు, ఎందుకంటే వారు తమ స్వంత కంప్యూటర్ ఉపయోగించడం ఎంతో సౌకర్యవంతంగా భావిస్తారు.
2) కంప్యూటరు ప్రారంభించడం లేదా ఫైళ్లు సేవ్ చేయడం వంటి పనులకు క్లాసులో సమయం వృధా కాదు, ఎందుకంటే విద్యార్థులు వీటన్నింటిని ఇంటి వద్దనే చేస్తారు.
3) విద్యార్ధులు నియంత్రణలో ఉండటం వల్ల, వారు మరింత శ్రద్ధ పెడతారు మరియు క్లాసులో దృష్టి సారించగలుగుతారు, దీని ఫలితంగా అభ్యసన అనుభవం సానుకూలంగా మరియు ఉత్పాదకంగా ఉంటుంది.

టీచర్లు ఏవిధంగా ప్రయోజనం పొందుతారు?

తమ విద్యార్థులకు BYOD ఉపయోగించడం ద్వారా టీచర్లు సైతం లబ్ధిని పొందుతారు. మొత్తం క్లాసు కూడా కంప్యూటర్ అధారిత క్లాస్ రూమ్ అనుభవాన్ని పొందడమే కాకుండా, మామూలు కంటే ఎక్కువగా నిమగ్నం అవుతాయి, అలానే, విద్యార్థుల సామర్ధ్యాలకు అనుగుణంగా అభ్యసన మెటీరియల్ని కస్టమైజ్ చేయడానికి కూడా టీచర్లకు సహాయపడుతుంది. టీచర్లు కూడా విద్యార్ధి చేసే పనిని రియల్ టైమ్లో మానిటర్ చేస్తారు, అలానే కొత్త అసైన్మెంట్లు మరియు ప్రాజెక్ట్లు జారీ చేయడం కూడా సులభతరం అవుతుంది.

స్కూలు ఏమి అందించాల్సి ఉంటుంది?

BYODని విజయవంతంగా అమలు చేయడానికి, స్కూలు దిగువ పేర్కొన్నవాటిని అమర్చుకోవాల్సి ఉంటుంది:

1) ఛార్జింగ్ స్టేషన్లు
2) Wi-Fi యాక్సెస్
3) విద్యార్థులకు అవసరమైనప్పుడు సాయం అందించడం కొరకు ఐటి టీమ్
4) చదవడానికి కంప్యూటర్ని సమర్ధవంతంగా ఉపయోగించడంలో టీచర్లు శిక్షణ పొందడం.

దీనికి స్కూలు వైపు నుంచి చాలా సమయం, శ్రమ, జాగ్రత్తగా ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది, అయితే దీని వల్ల అనేక ప్రయోజనాలుంటాయి, విద్యార్ధులు గతంలో ఎన్నడూ లేని విధంగా కంప్యూటర్ సాయంతో అభ్యసనకు సంబంధించి మరింత స్ఫూర్తిని పొందుతారు.