అమలు చెయ్యడంలో మరియు విజయం సాధించడంలో ఎదురయ్యే సవాళ్లు

ఆరంభ్ ద్వారా, మేము సుమారు 1.5 మిలియన్ విద్యార్థులను చేరుకోగలిగాము, మరియు 70 నగరాల్లోని 5,000 కి పైగా పాఠశాలల నుండి 1,00,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ అందించడం మరియు యోగ్యతా పత్రాలను ఇవ్వడం లక్ష్యంగా చేసుకున్నాము. ఇవి ఇప్పటి వరకు మా ప్రయాణంలో మేము ఎదుర్కొన్న విజయాలు మరియు సవాళ్లు.

శిక్షణ పట్ల ఉపాధ్యాయులు సానుకూల వైఖరిని కలిగి ఉన్నారని కాంతర్ నివేదిక పరిశీలనలు తెలియజేస్తున్నాయి. వారాంతపు శిక్షణ, కంటెంట్, శిక్షకులు మరియు శిక్షణా విధానం పట్ల వారు సంతోషంగా ఉన్నారు.

స్మార్ట్ క్లాసులకు 100% హాజరు ఉందని ఉపాధ్యాయులు విశ్వసిస్తున్నారు, విద్యార్థులు కంప్యూటర్ ఆధారిత (పిపిటి) అసైన్మెంట్లు అడగడం ప్రారంభించారు. ఇంట్లో పిసిలు లేని విద్యార్థులు పాఠశాలలో ఉన్న వాటిని  అసైన్మెంట్లు మరియు సమూహ పనుల కోసం ఉపయోగించారు.

ఈ ప్రయాణంలో సవాళ్ళు ఎదుర్కోకపోలేదు. కొంతమంది తల్లిదండ్రులు ల్యాప్ టాప్ / పిసిని కొనలేరు లేదా కొందరు ఇంటర్నెట్ సమస్యలను ఎదుర్కొన్నారు. పిల్లలు పిసిలతో ఎక్కువ సమయం గడుపుతున్నారు, దానితో పిసి ఆధారిత పనులను ఇవ్వడం కష్టతరం అయ్యింది.

దీనికి విరుద్ధంగా, ఉపాధ్యాయులు ప్రోగ్రామ్ యొక్క వ్యవధి మరియు తరచుదనాన్ని  పెంచాలని మరియు ఉత్పాదకతను మెరుగుపరిచే అనువర్తనాలు/సాధనాల గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నారు .

 

 

వాటాదారులకు ఏం కావాలి

84% మంది ఉపాధ్యాయులు ఆన్ లైన్ శిక్షణతో సౌకర్యంగా ఉన్నారు, ఇది వయస్సుతో తగ్గుతుంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రధానోపాధ్యాయులు కూడా ఆన్ లైన్ శిక్షణ వైపు మొగ్గు చూపుతున్నారు. హాండ్స్-ఆన్ శిక్షణ మరియు సందేహ నివృత్తి  సెషన్ల కోసం ఆఫ్ లైన్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

 

 

ఆసక్తిగా ఎదురుచూస్తున్నాము

మేము మార్పులను మూడు విధాలుగా అమలు చేస్తాము-

  • పునఃశిక్షణ-

పిసి ప్రావీణ్యం మరియు వాడకం వయస్సుతో తగ్గుతుంది, కాబట్టి మేము సీనియర్ ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక శిక్షణా సమావేశాలను నిర్వహిస్తాము

  • సెమినార్ల నిర్వహణ-

ఉపాధ్యాయులు మరియు యాజమాన్యం, కంప్యూటర్ ఆధారిత విద్య యొక్క ప్రయోజనాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడానికి అవగాహన కార్యక్రమాలను నిర్వహించగలరు.   

  • సలహాలను చేర్చడం-

84% మంది ఉపాధ్యాయులు ఆన్ లైన్ శిక్షణతో సౌకర్యంగా ఉన్నారు, మరియు అది తెచ్చిన నిరంతర మరియు ప్రవర్తనా మార్పులను ఇష్టపడుతున్నారు, కాబట్టి మేము దీనిని కొనసాగిస్తాము.

రాబోయే సంవత్సరాల్లో ఎక్కువ మంది విద్యార్థులను ప్రభావితం చేసి, ఎక్కువ మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి భారతదేశానికి పిసి అనుకూల జనాభా ఉండేలా పెద్ద మార్పు తీసుకురావడానికి మేము ఎదురుచూస్తున్నాము.