డెల్ ఆరంభ్: ఎందుకు, ఏమిటి & ఎలా - ఇంతవరకు జరిగిన ప్రయాణము

అది జూన్ 6, 2016 - టైర్ 2 నుండి టైర్ 4 నగరాలు లక్ష్యంగా, దేశమంతటా పీసీ విద్యను  అందించాలనే ఉద్దేశముతో  మేము భారతదేశవ్యాప్తంగా డెల్ ఆరంభ్ ను ప్రవేశపెట్టిన సుదినం.

2016 నాటికి భారతదేశములో టెలీడెన్సిటి 50.63%1 వరకు పెరిగింది, కాని గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు ఇంకా సాంకేతికత గురించి ఆందోళన చెందుతూనే ఉన్నారు. అప్పుడే మేము ఈ రంగములోకి ప్రవేశించాము.

ఇలా చేయుటకు, మేము అర్థజ్ఞానంలేని రకమైన సంప్రదాయిక పద్ధతుల నుండి దూరం వచ్చి ఆకట్టుకునే మరియు ప్రభావవంతమైన విధంగా ఉండే శిక్షణా రకానికి మారవలసి వచ్చింది. మేము తల్లులు, ఉపాధ్యాయులు, మరియు విద్యార్థులకు వినోదభరితంగా, ఆకట్టుకునే విధంగా మరియు అందరు పాల్గొనే విధంగా పీసీ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చే విద్యావేత్తల నెట్వర్క్ ను ఏర్పాటుచేశాము.

 

అయితే మా ప్రయాణము ఏ విధంగా సాగింది?

మా ప్రయాణము విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు తల్లులకు వారు పీసీని ఉపయోగించగలిగే పరిజ్ఞానాన్ని అందించుట, శిక్షణ ద్వారా వారి నైపుణ్యాలను పెంచుటపై దృష్టి సారించింది. ఉపాధ్యాయులకు శిక్షణా విలువలను గరిష్ఠంగా పెంచుటకు మేము సెంటర్ ఫర్ టీచర్ అక్రెడిటేషన్ (సీఈఎన్ టీఏ) వారతో భాగస్వాములము అయ్యాము మరియు ఒక వినోదాత్మక మరియు పోటీ శిక్షణా వృత్తిపరుల ఒలంపియాడ్ ను కూడా ప్రవేశపెట్టాము  

పాలసీ హ్యాక్ ద్వారా, ఉపాధ్యాయులు తరగతిగదులలో మరియు బయట ఎదుర్కొంటున్న సమస్యలకు నవప్రవర్తకమైన పరిష్కారాలతో ముందుకు రావాలని మేము విద్యావేత్తలను కోరాము. అంతేకాకుండా, టాటా క్లాస్ ఎడ్జ్ వారితో మా భాగస్వామ్యము వలన పాఠశాలలలో డిజిటల్ శిక్షణ అందించగలిగాము, దీని వలన తరగతిగదులలో సాంకేతికతను అమలు చేయుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని మేము ఉపాధ్యాయులకు అందించగలిగాము.

భవిష్యత్తు ఏ విధంగా కనిపిస్తుంది?

మూడు సంవత్సరాల నుండి, శిక్షణాంశాలతో యునెస్కో-ఎంజీఐఈపీ వారు రూపిందించిన ఫ్రేమర్ స్పేస్ వేదిక ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ అందించుటకు మేము యునెస్కో మహాత్మా గాంధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ పీస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (యునెస్కో-ఎంజీఐఈపీ) సంస్థతో భాగస్వాములముగా ఉన్నాము. ఇందులో మూడు రోజుల వర్క్ షాప్ గా మరియు దాని తరువాత 200 గంటల ఆన్లైన్ శిక్షణ ఉంటుంది.

అంతే కాదు&hellip.

 

లబ్ధిపొందిన 4,507 పాఠశాలలు, 83,501 మంది శిక్షణ పొంది ధృవీకరణపత్రాలు పొందిన ఉపాధ్యాయులు మరియు 1,13,708 శిక్షణ పొందిన తల్లు లతో, ఈ శిక్షణలు దేశవ్యాప్తంగా విస్తృతమైన ప్రభావాన్ని సృష్టించాయి. భవిష్యత్తులో 2020 సంవత్సరం ఆరంభ్ కు ఒక ముఖ్యమైన సంవత్సరం కాబోతోంది, ఎందుకంటే శిక్షణ పొందిన ఈ ఉపాధ్యాయులు మరింతమందికి శిక్షణను అందించగలుగుతారు - తద్వారా విద్యాసంబంధ పనుల కొరకు మాత్రమే కాకుండా పీసీలను జీవితం కొరకుకూడా ఉపయోగించుటకు ఆత్మవిశ్వాసం పొందిన వ్యక్తులను తయారు చేస్తారు.