గూగుల్ సేఫ్ సెర్చ్ గురించి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు

మనం జీవిస్తున్న ఇంటర్నెట్ ప్రపంచంలో, సమాచారం కేవలం కొన్ని క్లిక్ లకు దూరంలో ఉంటుంది. ఇంటర్నెట్ మీ పిల్లలకు అవసరమైన ఎంతో ముఖ్యమైన సమాచారానికి మూలంగా ఉంటుంది, అదే సమయంలో వారి యువ, ఆకట్టుకునే మనస్సులకు అసురక్షితమైన తప్పుడు సమాచారం కూడా ఉంటుంది. డిజిటల్ పేరెంట్ గా, వారు ఆన్ లైన్ సురక్షితంగా మరియు ఆనందంగా ఉండేవిధంగా చూడటం కొరకు వారి ఆన్ లైన్ సెర్చ్ ప్రవర్తనకు మీరు గార్డియన్ గా ఉండాలి. ఈ అత్యంత క్లిష్టమైన పనిని గూగుల్- సేఫ్ సెర్చ్ అనే టూల్ ద్వారా ఎంతో తేలికగా మరియు సమర్ధవంతంగా చేపట్టబడుతుంది.

ఇంటర్నెట్ లో గూగుల్ అత్యంత ముఖ్యమైన సెర్చ్ ఇంజిన్ కావడం వల్ల, అనుచితమైన సైట్ లకు అనియంత్రిత ప్రాప్యతని ఒకేఒక్క బటన్ తట్టడం ద్వారా మీరు నియంత్రించవచ్చు.

కానీ ముందుగా, ఇది ఏమిటి?

మన అనేక పరికరాల్లో గూగుల్ ప్రధానమైన సెర్చ్ ఇంజిన్ మరియు సెర్చ్ ఫలితాలపై తల్లిదండ్రులకు నియంత్రణ ఉన్నప్పటికీ, కొన్ని సెర్చ్ క్వైరీలు అనుచితమైన కంటెంట్ ని అందిస్తాయి. సెర్చ్ ఫలితాల నుంచి అటువంటి కంటెంట్ ని (చిత్రాలు మరియు వీడియోలతో సహా) ఫిల్టర్ చేయడానికి సేఫ్ సెర్చ్ సాయపడుతుంది, తల్లిదండ్రులు ఈ విధంగా పేరెంటల్ నియంత్రణ ఏర్పాటు చేయడానికి గూగుల్ సాయపడుతుంది

గూగుల్ సేఫ్ సెర్చ్ ని ఏవిధంగా సెట్ చేయాలి?

  • ‘‘మీ వెబ్ బ్రౌజర్ లపై సేఫ్ సెర్చ్ ని యాక్టివేట్ చేయడానికి గూగుల్ సెర్చ్ సెట్టింగ్ ల పేజీని సందర్శించండి: google.com/preferences
  • సేఫ్ సెర్చ్ ఆన్ చేయండి’’ బాక్స్ చెక్ చేయండి.
  • దాని పక్కన ఉండే నీలంరంగు పదాలను క్లిక్ చేయండి - ‘‘లాక్ సేఫ్ సెర్చ్’’
  • మీ జీమెయిల్ అకౌంట్ లోనికి మీరు ఇంకా లాగిన్ చేయనట్లయితే, సేఫ్ సెర్చ్ సెట్టింగ్ లను లాక్ చేయడానికి ముందు మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది (బ్రౌజింగ్ చేయడానికి ముందు సేఫ్ సెర్చ్ ని ఎవరైనా ఆఫ్ చేయకుండా నిరోధిస్తుంది).
  • మీరు మీ బ్రౌజర్ సెట్టింగ్ లను ‘‘ఎల్లప్పుడూ కుకీస్ ఆమోదించు’’కు మార్చాల్సి ఉంటుంది. (దీనిని ఎలా చేయాలనేది మీకు స్పష్టంగా తెలియనట్లయితే గూగుల్ దీనికి ఒక లింక్ ని మీకు ఇస్తుంది.)
  • దీనిని చేసిన తరువాత, ‘‘సేఫ్ సెర్చ్ లాక్ చేయి’’ బటన్ మీద క్లిక్ చేయండి.

మీరు ఇప్పుడు సేఫ్ సెర్చ్ ని ఎలా యాక్టివేట్ చేయాలనేది తెలుసుకున్నారు, మీరు విశ్రాంతిగా కూర్చుకున్న మీ బిడ్డకు పాజిటివ్ డిజిటల్ ఫుట్ ప్రింట్ ఉండేలా ధృవీకరించవచ్చు.