పరీక్షల జ్వరం: మీ బిడ్డ పరీక్షల ఒత్తిడిని అధిగమించేందుకు సహాయూపడండి

 

పరీక్షలు చాలా ఒత్తిడిపూర్వక వ్యవహారం అని మనకు తెలుసు. పిల్లలు పెరుగుతున్న కొలదీ వారు మరింత ఒత్తిడిని ఎదుర్కొంటారు. దీని ఫలితంగా పిల్లలు చదవడం కంటే ఒత్తిడిని అధిగమించడంపై తమ శక్తియుక్తులు అన్నింటిని కేంద్రీకరిస్తారు. అయితే శుభవార్త ఏమిటంటే- మీరు మీ పిల్లలు ఒత్తిడిని అధిగమించేందుకు ఇలా సహాయపడవచ్చు:

1) రోటీన్ని ప్రేమించడం కొరకు

పరీక్షల టైమ్‌టేబుల్ వచ్చిన తరువాత, ట్యూషన్లు, ఆటలు మరియు ఆడుకునే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని గూగుల్ క్యాలెండర్ మరియు అసానా వంటి టూల్స్ ఉపయోగించి, ఒక వాస్తవిక షెడ్యూల్ రూపొందించండి. స్టడీ టైమ్‌ని మానిటర్ చేయడం, అలానే సకాలంలో బ్రేకులు ఇవ్వడం ద్వారా, మీ బిడ్డ మీ రోజువారీ కార్యక్రమాలకు కట్టుబడి ఉండేలా స్ఫూర్తిని ఇవ్వవచ్చు.

2) మీ పిల్లవాడికి ఏది బాగా పనిచేస్తుందనే విషయాన్ని తెలుసుకోండి

కంప్యూటర్ ద్వారా, మీ బిడ్డ పరీక్షకు ముందు రివిజన్ చేయడానికి టెక్ట్స్ పుస్తకాలు మాత్రమే కాకుండా ఇతర ఉపకరణాలను అందిస్తంది. సబ్జెక్ట్ విషయాలను మరింత బలంగా నేర్చుకోవడానికి యూట్యూబ్ ఎడ్యుకేషన్‌పై వీడియోలు, ఎడ్యుకేషన్ వరల్డ్ నుంచి వర్క్షీట్లు, మరింత లోతుగా నేర్చుకోవడానికి గూగుల్ స్కాలర్ వంటివి సహాయపడతాయి. మీ పిల్లలు తమకు ఏవి బాగా ఉపయోగపడతాయో తెలుసుకొని, వాటిని కొనసాగించాలి.

3) సాయం చేయండి, అయితే ఎక్కువగా సాయం చేయవద్దు

మీ పిల్లలకు నైతిక స్థైర్యం అందించడం కొరకు వారికి మద్దతుగా నిలవండి, అనేది వారు ఒక సమస్యను తమంతట తాము పరిష్కరించేందుకు కొన్ని ప్రయత్నాలు చేసిన తరువాత మాత్రమే వాటిని పరిష్కరించేందుకు సహాయపడండి. ఇది వారిలో స్వతంత్రత అలానే స్ఫూర్తిని అందిస్తుంది, ఇది ఇప్పుడు మాత్రమే కాకుండా, భవిష్యత్తులో సైతం తమ సమస్యను అధిగమించేందుకు దోహదపడుతుంది.

4) ఆడుకునే సమయం గురించి మర్చిపోవద్దు

పరీక్షలు ముగిసిన తరువాత మాత్రమే ఆడుకోవాలని చాలామంది తల్లిదండ్రులు భావిస్తారు. అయితే, ఆటలు ఆడుకోవడానికి అలానే స్పోర్సెల్ వంటి సైట్లపై కంప్యూటర్ గేమ్స్ ఆడుకోవడానికి ప్లాన్డ్ బ్రేకులు ఇవ్వడం వల్ల మీ పిల్లలు మరింత మెరుగ్గా దృష్టి నిలపగలుగాతారు మరియు వారి మైండ్ మరింత రిలాక్స్‌గా కూడా ఉంటుంది. బ్రేకులు - అర్ధగంట లేదా అంతకంటే తక్కువగా ఉండేలా చూసుకండి, తద్వారా మీ బిడ్డ తిరిగి చదువుకోవడానికి రావడం సులభతరం అవుతుంది.

5) తుది ఫలితం గురించి ఎక్కువగా ఆలోచించవద్దు

మీ బిడ్డకు ఎన్ని మార్కులు వస్తాయనే విషయం తెలుసుకోవడం కొరకు పరీక్ష ముగిసిన తరువాత పేపర్ని తీవ్రంగా విశ్లేషించడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. మీ బిడ్డ ఎలాంటి ఫలితాన్ని పొందతాడని తెలుసుకోవడం వల్ల ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపుతుంది, మీ బిడ్డ తరువాత పరీక్షకు మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉండటం లేదా పూర్తిగా స్ఫూర్తి కొరవడం జరుగుతుంది.

మీ పిల్లలు పరీక్షలకు సంబంధించి మరింత ఒత్తిడికి గురికాకుండా చూడటం, అలానే నిరంతరం కంప్యూటర్ ఉపయోగించి స్ఫూర్తిని పొందేలా చేయడం అనేవి ముఖ్య విషయాలు.