హై స్కూలులో మీ పిల్లవాడు నేర్చుకునే 5 జీవిత నైపుణ్యాలు

 

జీవిత నైపుణ్యాలను రోజువారీ జీవితంలో ఎదురయ్యే డిమాండ్లు మరియు సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొనడానికి వ్యక్తుల్లో అనుసరణీయ మరియు సానకూల ప్రవర్తనను పాదుకొల్పేందుకు దోహదపడే సామర్థ్యాలుగా నిర్వచించవచ్చు. 

మీ బిడ్డ స్కూలులో నేర్చుకునే ఐదు విషయాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

1) సకాలంలో నిద్ర లేవడం

ప్రస్తుతం మీకు ‘‘అలారం’’లు ఉన్నాయి, వాటి ద్వారా మీరు మీ పిల్లలను నిద్ర లేపుతుంటారు, అయితే మీ పిల్లలు హాస్టల్ లేదా పనికి వెళ్లినప్పుడు మీరు ఇలా చేయగలరా? మీ పిల్లలు ప్రతిరోజూ నిద్ర లేవాల్సిన సమయానికి ఎవరిసాయం లేకుండా నిద్ర లేవడం అనేది అత్యంత ముఖ్యమైన జీవిత నైపుణ్యం. ప్రతిరోజూ ఒకే సమయానికి స్కూలు ప్రారంభం అవుతుంది, కాబట్టి ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్ర లేవాల్సి ఉంటుంది.

2) భోజనం తయారు చేయడం

మీ పిల్లల కొరకు ఆహారం తయారు చేయనప్పుడు భోజనం ఆర్డర్ చేయడం లేదా బయట నుంచి తినడం అనేది సహజంగానే జరిగే పనే. అప్పుడప్పుడు, ఇంటిలో తయారు చేసిన రుచికరమైన ఆహారాలతో మీ బిడ్డను ఆశ్చర్యానికి గురి చేయండి. టీ పెట్టడం కొరకు నీళ్లను వేడి చేయడం వంటి చిన్నచిన్న పనుల్లో మీ పిల్లలను నిమగ్నం చేయడం ప్రారంభించాలి, తద్వారా పిల్లలు స్వతంత్రంగా తమ కొరకు పోషకాలతో కూడిన ఆహారాన్ని తయారు చేసుకునే సామర్ధ్యాన్నిపొందుతారు.

3) కుటుంబంలోని చిన్నవారి పట్ల బాధ్యత వహించడం

దీనిని మనం ఏ మాత్రం నిరాకరించలేం, ఎందుకంటే బాధ్యత అనేది ఇంటి వద్దనే ప్రారంభం అవుతుంది. తమ్ముడు లేదా సోదరి లేదా పొరుగింటి పిల్లలను సంరక్షణ ద్వారా తన పట్ల అలానే తనపై ఆధారపడ్డ వారిపై బాధ్యత వహించడం ప్రారంభం అవుతుంది- ఇది వాస్తవ ప్రపంచంలో ఎంతో అవసరమైన నైపుణ్యం.

4) షెడ్యూల్ రూపొందించడం మరియు దానికి కట్టుబడి ఉండటం

స్కూలు, ట్యూషన్లు, ఆటలు, సామాజిక జీవితం మరియు ఇంటి వద్ద బాధ్యతలు నిర్వహించడం కొరకు అవసరమైన ముఖ్యమైన జీవిత నైపుణ్యాలను పొందడం భారం కాకూడదు. చిన్నవయస్సులోనే సమయాన్ని ఎలా నిర్వహించాలనే విషయాన్ని తెలుసుకోవడం ద్వారా, మీ బిడ్డ, అన్ని రకాల సవాళ్లను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలతో యవ్వనంలోని ప్రవేశిస్తాడు.

5) కంప్యూటర్ని మంచిగా ఉపయోగించడం

డిజిటల్ పేరేంట్గా మీకు తెలుసు, తప్పించుకునే టెక్నీలజీ ఏదీ లేదు. ఇంటి వద్దనైనా లేదా స్కూలు వద్దనైనా - మీ పిల్లవాడి యొక్క మొట్టమొదటి అభ్యసన గాడ్జెట్ కంప్యూటర్. టైమ్ మరియు ప్రాక్టీస్తో, చదివేటప్పుడు, కొత్త హాబీని ఎంచుకునేటప్పుడు మరియు ఇంకా వినోదం కొరకు గరిష్టంగా ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకుంటాడు.

ఎలాంటి సందేహం లేకుండా, 2018 మీ కంప్యూటర్ సంవత్సరం!