మీ బిడ్డను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో చేర్చడానికి ఐదు కారణాలు

 

నిద్రలేవడం
స్కూలు
ట్యూషన్లు
నిద్ర
పునశ్చరణ

ఇక్కడ లోపిస్తున్నది ఏమది?

యాక్టివిటీని మీ బిడ్డ ఇష్టపడతాను మరియు దాని కొరకు ఎదురు చూస్తుంటాడు.

ప్రతిరోజూ రోటీన్‌గా ఒకే పని చేయడం ఎంత విసుగుగా ఉంటుందో ఆలోచించండి. పని మరియు జీవితానికి మధ్య సంతులనం లోపించిన వయోజనుల్లో కూడా ఇదేవిధమైన భావన ఉంటుంది - మీ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఇది మీకు పరిచయమైనది లేదా ఏదో ఒక సమయంలో మీరు అనుభూతి చెందిన విషయమే.

మీ బిడ్డను ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో నమోదు చేయడం ద్వారా, మీ బిడ్డ సమయాన్ని ఉత్పాదకంగా ఉంచేందుకు మరియు వాటిని చేసేటప్పుడు సరదాగా ఉండేందుకు మీరు అవకాశం కల్పిస్తారు. ఇవిగో మరో ఐదు కారణాలు:

1) చదువుల నుంచి బ్రేక్ కొరకు బాగా అవసరమైనది

చదువులు మరియు పరీక్షలు మరింత పోటీతత్త్వాన్ని సంతరించుకోవడంతో ఆటలు ఆడటం లేదా డ్యాన్స్, యోగా లేదా ఆర్ట్ వంటి హాబీలకు సమయాన్ని వెచ్చించడం ద్వారా అత్యావశ్యకమైన బ్రేక్ లభించడమే కాకుండా, పరీక్షలకు సంబంధించిన ఒత్తిడి నుంచి మీ బిడ్డ బయట పడేందుకు దోహదపడుతుంది.

2) ఒక టీమ్‌లో ఎలా పనిచేయాలని నేర్చుకునే అవకాశం

రెగ్యులర్‌గా గ్రూపు కార్యకలాపాల్లో పాల్పంచుకోవడం వల్ల మీ బిడ్డ టీమ్ కార్యక్రమాల యొక్క ప్రాముఖ్యతను అర్ధం చేసుకుంటాడు మరియు ఇతరులతో సహాయసహకారాలు అవసరమైనప్పుడు మెరుగ్గా వ్యవహరించగలుగుతారు. తమతోటి విద్యార్ధుల నుంచి మరిన్ని నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఇది సహాయపడుతుంది, తమలోని లోపాలు లేదా తెలియని వ్యక్తులతో మాట్లాడటంలో భయం వంటి సమస్యలను అధిగమించగలుగుతారు.

3) టైమ్ మేనేజ్మెంట్ నైపుణ్యలు ఎంచుకోవడం - ప్రాక్టీస్ ద్వారా మాత్రమే వచ్చే నైపుణ్యం

ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనడం వల్ల మీరు ప్రాధాన్యతీకరించబడ్డ వాగ్ధానంతోపాటుగా చదువుకోవడం మరియు ఆడుకోవడానికి మధ్య చక్కటి సంతులనాన్ని సాధించవచ్చు. ఇది పిల్లలు తమ రోజుని మరియు టాస్క్‌లను మరింత సమర్ధవంతంగా ప్లాన్ చేసుకోగలుగుతారు - ఈ నైపుణ్యం కేవలం అనుభవం ద్వారా మాత్రమే వస్తుంది.

4) అత్యాశవశ్యక సామాజిక నైపుణ్యాల అభివృద్ధి

కొత్త వ్యక్తులను కలవడం మరియు కార్యకలాపాల్లో కలిసిపాల్గొనడం వల్ల మానసికంగా మరియు భావోద్వేగ ప్రయోజనాలు రెండూ ఉంటాయి. ఇది పిల్లలు కొత్త స్నేహాలు చేసుకోవడానికి మరియు తమఆత్మ విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి దోహదపడుతుంది.

5) ఏదైనా కొత్తదాన్ని అన్వేషించండి

ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే కేవలం ప్లే గ్రౌండ్‌కు మాత్రమే పరిమితం కాదు. కంప్యూటర్లు అభ్యసనను మరింత సులభతరంగాను మరియు మరింత యాక్సెస్ చేసుకునేవిధంగా రూపొందించాయి. మీరు మీ బిడ్డను Canva ద్వారా డిజిటల్ ఆర్ట్ గురించి నేర్చుకునేందుకు లేదా Code.org నుంచి కోడింగ్ బేసిక్స్ నేర్చుకునేందుకు ప్రోత్సహించవచ్చు. ఒకవేళ ఈ యాక్టివిటీస్ ఇప్పటికే మీ బిడ్డ స్కూలులో అందించనట్లయితే, వాటిని ఏర్పాటు చేసేవిధంగా అధికారులతో మాట్లాడవచ్చు లేదా మీ బిడ్డ స్వయంగా చొరవ తీసుకొని ఇటువంటి కార్యకలాపాల్లో పాల్గొనేవిధంగా ఉత్తేజపరచవచ్చు.

మీ బిడ్డకు ఈ యాక్టివిటీ ఛాలెంజ్‌గా మరియు ఆనందించేవిధంగా ఉన్నంత వరకు, మీ బిడ్డ ‘‘అమ్మా, నాకు బోర్ కొడుతోంది’’ అనే మాటను చెప్పడు. :)