మీరు ప్రయత్నించదగ్గ ఐదు స్టడీ బ్రేక్ ఐడియాలు

 

 

పరీక్షల సమయం చాలా ఒత్తిడిగా ఉంటుంది. ఆకలి, నిద్ర లేకపోవడం, ఫోకస్ లేకపోవడం వల్ల మీ పనితీరు ప్రభావితం కావొచ్చు. కొన్ని సరళమైన దశలు పరీక్షా సమయంలో సకాలంలో బ్రేకులు తీసుకోవడం ద్వారా మీ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

స్టడీ బ్రేక్ సమయంలో మీరు చేయదగ్గ ఐదు పనులు:

1) ఒక స్నేహితుడికి ఫోన్ చేయడం

మీ మైండ్‌కు బ్రేక్ ఇవ్వడం కొరకు హృదయపూర్వకంగా నవ్వుకోవడానికి మీ ప్రాణ స్నేహితుడికి కాల్ చేయండి లేదా ఏవైనాఆటల గురించి చర్చించండి. ప్రియమైనవారితో కాసేపు చర్చించడం వల్ల మీ మనస్సు రిఫ్రెష్ అవుతుంది- మీ కొరకు మీరు సెట్ చేసుకున్న సమయంకంటే ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా ఉండేలా దయచేసి ధృవీకరించుకోండి. మీరు ప్రస్తుతం చదువుతున్న సబ్జెక్ట్‌కు సంబంధించి మీ స్నేహితుడిని అడుగుతూ క్విజ్ ఆడటం ద్వారా కూడా పరిస్థితులను కాస్తంత మార్చవచ్చు.

2) బ్రెయిన్ ఎరైజ్

బ్రెయిన్ ట్రైనింగ్ యాక్టివిటీస్ సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తాయి, మీ పదజాలం విస్తరించబడుతుంది మరియు చదువుకు సంబంధించిన ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రాస్‌వర్డ్, సుడోకు లే దా లుమోసిటీ గేమ్‌లను బ్రేక్ కొరకు ఆడటం ద్వారా మీరు మరింత స్మార్ట్‌గా మారతారు, మరింత అలర్ట్‌గా మరియు తరువాత స్టడీ సెషన్ కొరకు రెడీ అవుతారు.

3) స్ఫూర్తిని పొందండి

చదవడానికి కూర్చోవడానికి ముందు, మీకు స్ఫూర్తి కలిగించే వ్యక్తులు మరియు మీకు ఉత్సాహం కలిగించే విషయాలను జాబితా చేయండి. మీ డెస్క్ కొరకు స్ఫూర్తిదాయక మూడ్ బోర్డ్‌ని సృష్టించడానికి మీరు వారి ఇమేజ్‌లు లేదా కోట్లను ఉపయోగించుకోవచ్చు. మీ గోల్స్ మరియు మీరు పొందే పురస్కారాలను రాసుకోవడం అనేది కూడా గొప్పగా ఉపయోగపడుతుంది. మీ బ్రేక్ సమయంలోటిఈడి టాక్‌లు చదవడం లేదా చూడటం వల్ల కూడా మీరు స్ఫూర్తిని పొందుతారు.

4) సృజనాత్మకతంగా ఉండటం

మీ క్రియేటివిటీ మిమ్మల్ని గైడ్ చేయడం మీ మనస్సును ఉత్సాహంగా మార్చుకోవడానికి మరియు మీ మూడ్‌ని మార్చుకోవడానికి మీ చదువుకు సంబంధం లేని గిటార్ లేదా డూడ్లింగ్ వంటి పనులు చేపట్టండి. మీరు ఫ్రెష్ మైండ్‌తో మరియు పునరుత్తేజిత ఫోకస్‌తో మీ చదువులపై దృష్టిని కేంద్రీకరించవచ్చు.

5) మీ బక్కెట్ లిస్ట్‌ని అప్డేట్ చేయడం

మీ గోల్స్ దిశగా మిమ్మల్ని నడిపించడానికి బక్కెట్ లిస్ట్ రూపొందించడం అనేది ఒక గొప్ప మార్గం. ఒకవేళ మీరు ఇంకా మీ బక్కెట్ లిస్ట్‌ని ప్రారంభించకపోయినట్లయితే, ఇప్పుడు దానిని ప్రారంభించే సమయం ఆసన్నమైంది. మీరు వెళ్లాలని అనుకునే ప్రదేశాలు, ఆహారం మరియు సాహస కార్యక్రమాలకు సంబంధించిన లింక్‌లు మరియు చిత్రాలను ఒక వర్డ్ డాక్యుమెంట్లో సేవ్ చేసుకోండి. మీ స్టడీ ప్లాన్‌లో మీరు మైలురాయిని సాధించిన ప్రతిసారి కూడా, మీ బక్కెట్ లిస్ట్‌కు ఏదైనా జోడించుకోవడం ద్వారా మిమ్మల్ని మీకు పురస్కారాలను అందించుకోండి.

ప్రాజెక్ట్‌ల నుంచి ప్రజంటేషన్ల వరకు ప్రతిదీ కూడా సక్రమంగా చేయడం కొరకు సరైన టెక్ టూల్స్ ఉపయోగించడం ద్వారా మీ చదువును సరళీకృతం చేసుకోవడాన్ని మర్చిపోవద్దు.