ప్రతి విద్యార్థి పాటించాల్సిన ఐదు స్టడీ టిప్స్

 

చదవడం అంటే పరీక్షకు ముందు లేదా ప్రాజెక్ట్ కు ముందు చదవడం కాదు.

మీరు ఎంత ముందు నుంచి చదవడం ప్రారంభిస్తారో, అంత బాగా సబ్జెక్ట్ ని అర్థం చేసుకుంటారు మరియు మంచి మార్కులు పొందే మీ అవకాశాలను మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. [1]

పిసి ద్వారా పరీక్షల్లో మరింత మెరుగ్గా మార్కెట్ సాధించడమే కాకుండా, సంక్లిష్టమైన భావనలను పరిశోధించడానికి మరియు అర్థం చేసుకోవడానికి కూడా దోహదపడుతుంది.

పిసిని ఉపయోగించేటప్పుడు మరిన్ని వనరులు మరియు విషయాలను తెలుసుకోవడానికి ఐదు స్టడీ చిట్కాలు ఇవిగో:

1. ఒక షెడ్యూల్ రూపొందించండి, అలానే దానికే కట్టుబడి ఉండండి

ఒక స్టడీ షెడ్యూల్ రూపొందించుకోవడం ద్వారా ఎన్ని ఛాప్టర్ లు క్లియర్ చేయాలి మరియు ప్రతిదానికి ఎంత సమయం పడుతుందనే విషయాలు స్పష్టంగా తెలుస్తాయి. స్థిరమైన స్టడీ ప్లాన్ ని రూపొందించుకోవడానికి గూగుల్ క్యాలెండర్ వంటి టూల్స్ సహాయపడతాయి. మీ షెడ్యూల్ లో రెగ్యులర్ బ్రేక్ లు కూడా ప్లాన్ చేసుకోండి.

2. క్లాసులో నోట్స్ తీసుకోండి

క్లాసు రూమ్ లో నోట్స్ తీసుకోవడం ద్వారా సబ్జెక్ట్ విషయాలను మీరు పరీక్షల కోసం చదివేటప్పుడు లేదా ఒక ప్రాజెక్ట్ పై పనిచేసేటప్పుడు రిఫరెన్స్గా ఉపయోగించుకోవచ్చు.  పేపర్ వర్క్ ఫర్వాలేదు, అయితే వర్డ్ ప్రాసెసర్ లు ఉపయోగించవచ్చు, ఎందుకంటే మీరు ఇంటర్నెట్ నుంచి రిఫరెన్స్ లు మరియు లింక్ లతో నోట్ లను వ్యక్తిగతీకరించుకోవచ్చు.

3. బోధించబడ్డ భావనలను నిజజీవితంలో అనువర్తించడం నేర్చుకోండి

చదువుకునేటప్పుడు, ఎల్లప్పుడు థియరీ మరియు ప్రాక్టికల్ మధ్య అంతరాన్ని పూడ్చండి. క్లాసు రూమ్ లో నేర్చుకున్న విషయాలను మీ రోజువారీ విషయాలతో అనువర్తించడం వల్ల మీరు మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. కాన్సెప్ట్ లను వివరించే వీడియోలు చూడటం, మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్ చేపట్టడం [2] మరియు  ఎడ్యుకేషనల్ గేమ్స్ ఆడటం [3] వల్ల మీరు మరింత మెరుగ్గా ఆకళింపు చేసుకోవడానికి దోహదపడుతుంది.

4. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మరియు మీ తప్పుల నుంచి నేర్చుకోండి 

ఒకే విషయాన్ని మళ్లీ మళ్లీ వల్లే వేయడం కాకుండా, మీ నేర్చుకున్న టాపిక్ ని టెస్ట్ చేసుకోవడం అనేది సమాచారాన్ని గుర్తుంచుకునేందుకు ఒక మంచి మార్గం.[4] ఆన్ లైన్ టూల్స్ ఉపయోగించి, మీరు నేర్చుకున్న విషయాలను మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొదటిసారి సరిగ్గా నేర్చుకోనప్పటికీ, మీరు ఏమి తప్పు చేశారనే విషయాన్ని నేర్చుకోండి. వచ్చేసారి బాగా నేర్చుకోవడానికి దోహదపడుతుంది.

5. మీరు ఏమి నేర్చుకున్నారో నిరంతరం రివిజన్ చేయండి

స్థిరంగా చదవడం అనేది కీలకం. సాధ్యమైతే ప్రతిరోజూ లేదా ప్రతివారం స్టడీ మెటీరియల్ రివిజన్ చేయడం మరియు ఆన్ లైన్ రిఫరెన్స్ లను గమనించడం చేయాలి. దీని వల్ల మీరు ఎక్కువ కాలం గుర్తుంచుకోవడమేకాకుండా,మీ పరీక్షల ముందు చదవాల్సిన ఒత్తిడి తగ్గిపోతుంది.

సమర్థవంతంగా చదవడం ద్వారా అభ్యసన మరియు గుర్తుంచుకోవడం ప్రోత్సహించబడుతుంది. మీరు మరింత స్మార్ట్ గా చదవడానిక అలానే స్కూలు ప్రాజెక్ట్ ల్లో లేదా పరీక్షల్లో   మరిన్ని ఎక్కువ మార్కులు సాధించడానికి దోహదపడుతుంది.