2020 లో మీరు చూడబోయే అయిదు టెక్ ట్రెండ్స్

సమాచార నాణ్యతపై అభివృద్ధి ఆధారపడి ఉండే విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ వైపుగా భారతదేశం ముందుకు దూసుకెళ్తుండగా, మన పిల్లలకు భవిష్యత్తులో అవసరమయ్యే నైపుణ్యాలను అందించడం మనకు మరింత ముఖ్యం అవుతుంది. సాంకేతికత గురించి తెలుసుకోవడం మరియు దానితో సౌకర్యంగా ఉండగలిగే సామర్థ్యం తల్లిదండ్రులు తమ పిల్లలకు అందించవలసిన కీలకమైన నైపుణ్యాలలో ఒకటి.

1. ధ్వని సాంకేతికత

ధ్వని సాంకేతికత ఆదేశించబడిన పనులను నిర్వహించుటకు మాటలను గుర్తుపట్టుట అనే ప్రక్రియను ఉపయోగిస్తుంది, తద్వారా విలువైన సమయాన్ని ఆదా చేస్తూ సమాచారానికి సులభంగా యాక్సెస్ పొందవచ్చు. 1  వాస్తవానికి, ధ్వని సాంకేతికత ద్వారా విద్యార్థులు కొత్త కొత్త అంశాలను నేర్చుకొనుటకు సరదా ఆటలను సృష్టించడము ద్వారా తరగతిగది శిక్షణలను మెరుగుపరచుటకు దీనిని ఉపయోగించవచ్చు. 2

2. డేటా విశ్లేషణలు

5G అనేది 4G యొక్క అప్గ్రేడెడ్ వర్షన్ అయిన రాబోయే-తరం వైర్లెస్ సాంకేతికత. ఇందులో అధిక ఇంటర్నెట్ స్పీడ్, అత్యధిక బ్యాండ్ విడ్త్ మరియు తక్కువ ల్యాగింగ్ లేదా బఫరింగ్ వంటి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ ఫోన్లకు మాత్రమే కాకుండా కంప్యూటర్లు, ఐఓటీ మరియు స్మార్ట్ పరికరాలకు కూడా కనెక్టివిటి అందించగలగడం దీని ప్రత్యేకత. 3

3. డేటా విశ్లేషణలు

ఇందులో అధిక పరిమాణములో ఉన్న ముడి డేటాను పనిచేయదగిన మరియు ఉపయోగకరమైన ఫార్మాట్ లోకి మార్చే ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. దీనిని డేటా అర్థాన్ని తెలియజేయుటకు, సమస్యలను గుర్తించుటకు మరియు డేటాను ఎలా ఉపయోగించాలి అని సూచించుటకు ఉపయోగించవచ్చు. ఉదాహరణకు, ఉపాధ్యాయులు విద్యార్థి శిక్షణా సామర్థ్యం మరియు ప్రాధాన్యతల ఆధారంగా పరీక్షా మార్కులను క్రాఫ్ట్ అనుభవాలతో పోల్చి విశ్లేషించవచ్చు.

4. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) అనేది డేటాను సేకరించే మరియు షేర్ చేసే ఒక భారీ నెట్వర్క్ ను ఏర్పరుస్తూ పరికరాలను ఇంటర్నెట్ కు మరియు ఒకదానితో ఒకటికి కనెక్ట్ చేయడము. ఈనాడు స్వయం-చాలక కార్లు, ఫిట్నెస్ పరికరాలు మరియు గృహోపకరణాలతో సహా ప్రతి రంగములో ఐఓటీ ని చూడవచ్చు మరియు దీనిని ఆన్లైన్ లో శిక్షణా మెటీరియల్ ను అందించుటకు, గ్రేడ్స్ ను నిర్వహించుటకు మరియు ఆన్లైన్ లో తరగతులు తీసుకొనుటకు కూడా ఉపయోగించవచ్చు.  7

5. సైబర్ సెక్యూరిటి

బ్యాంకింగ్ వివరాల వంటి కీలక సమాచారానికి డిజిటల్ ఉనికి ఉన్న పరిస్థితిలో, సైబర్ సెక్యూరిటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు, పెరిగిన ఇంటర్నెట్ కనెక్టివిటితో టార్గెటెడ్ రాన్సంవేర్, ఫిషింగ్ మరియు మొబైల్ బ్యాంకింగ్ దాడుల వంటి అనేక భయాలు ఉన్నాయి. ఏఐ వంటి కొత్త సాంకేతికత సహాయంతో, ఈ సమస్యలను మనం ఎదుర్కొనవచ్చు మరియు ఇంటర్నెట్ ను సురక్షితం చేయవచ్చు.  8

రాబోయే ట్రెండ్స్ గురించి నేర్చుకోవడం ముఖ్యమైనదే అయినప్పటికీ, మన పిల్లలకు ఆవశ్యక పీసీ నైపుణ్యాలను అందించడం కూడా కీలకమైనదే. ఈ 2020 లో మనం సాంకేతికతను కలిసి అలవరచుకుందాం.