మీ బిడ్డలోని అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించే ఐదు మార్గాలు

‘‘చదువు అనేది పునాది, దీనిపైనే మనం మన భవిష్యత్తును రూపొందించుకుంటాం’’ - క్రిస్టినీ గ్రెగరీ

 

తమ పిల్లలు విద్యావ్యవస్థలో ఏదోవిధంగా నెట్టుకు రావడం కంటే స్కూలులో బాగా రాణించడాన్ని మించిన గర్వపడే విషయం తల్లిదండ్రులకు ఉంటుందా? స్కూలులో తమ స్థాయిని మించి మెరుగ్గా పని చేయడం కొరకు, ఒక పిల్లవాడు చిన్నవయస్సు నుంచే తన అభ్యసన సామర్ధ్యాన్ని పెంపొందించుకోవాల్సి ఉంటుంది. మీ బిడ్డకు సహాయపడే దశలవారీ గైడ్ ఇదిగో:

1) రోజువారీ చదవడాన్ని అలవాటుగా చేసుకోవడం
రోజూ చదవడం వల్ల కలిగే గొప్ప ప్రయోజనం ఏమిటంటే మీ బిడ్డ ఆలోచలను స్పష్టం చేసేందుకు మరియు మెరుగ్గా రాసేందుకు అవకాశం కలుగుతుంది. న్యూస్ పేపర్ యొక్క స్పోర్ట్స్ విభాగమైనా లేదా ఒక క్లాసిక్ నవలలోఒక ఛాప్టర్ అయినా, ప్రతి రోజూ చదవడం ద్వారా మీ బిడ్డ కొత్త పదాలు నేర్చుకుంటాడు, భాషా నైపథ్యాన్ని అర్ధం చేసుకుంటాడు.

2) వారిలోని సృజనాత్మక కోణాన్ని బయటకు తీసుకొస్తారు
ప్రతి వయస్సు గ్రూపు పిల్లలు మరియు వారి ఆసక్తులుగా తగ్గట్టుగా మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్ ఉంటుంది, మీ బిడ్డకు ఆసక్తికరంగా ఉండే దానిని కనుగొనడం మరియు దానికి అవసరమైన మెటీరియల్ అందించడమే మీరు చేయగల పని. ప్రతి మార్కర్ స్పేస్ ప్రాజెక్ట్ మీ బిడ్డ నేర్చుకోవడానికి కొత్తదాన్ని అందిస్తుంది. దీని వల్ల మొదట కష్టంగా కనిపించిన ప్రాజెక్ట్‌ని విజయవంతంగా పూర్తి చేశామననే భావన కలుగుతుంది.

3) గేమింగ్‌లో నిమగ్నం కావడం
మీ బిడ్డ రోజువారీ స్టడీ రొటీన్లో గేమ్‌లు జోడించడం అనేది ఒక మంచి భాగం, ఎందుకంటే ఆడుకునేటప్పుడు ఎన్నడూ కూడా వారు ‘‘నాకు బోర్ కొడుతోంది’’ అనే మాట వాడరు. పరీక్ష కొరకు చదివేటప్పుడు బ్రేక్ కావొంచ్చు లేదా మొత్తం పోర్షన్ పూర్తి చేసినందుకు ప్రత్యేక టీట్గా కావొచ్చు. తమ యొక్క అన్ని శక్తులను ఉపయోగించేలా స్ఫూర్తి పొందినట్లుగా మీ బిడ్డ భావించడం, తమ సామర్ధ్యాన్ని వెలికి తీయడం కొరకు వారికి సహాయపడటం అత్యుత్తమ భాగం.

4) మీ బిడ్డ అభ్యసన శైలిని గుర్తించడం


కొంత కాలం గడిచిన తరువాత, సబ్జెక్ట్‌ని బట్టి, మీ బిడ్డలకు బాగా ఉపయుక్తమైన అభ్యసన సరళి అభివృద్ధి అవుతుంది. తల్లిదండ్రులుగా, సరైన పిసి వనరులను ఉపయోగించడాన్ని గుర్తించడం మరియు వారిని ప్రోత్సహించేలా చూడాలి.

5) నిర్ధిష్ట ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలి
సామర్ధ్యాలకు అనుగుణంగా సాగడం అనేది ప్రయత్నించిన మరియు పరీక్షించిన సలహా, అయితే మీ బిడ్డ బలహీనంగా ఉండే సబ్జెక్ట్‌ల విషయం ఏమిటి?
నిర్ధిష్టమైన, చర్య తీసుకోగల ఫీడ్‌బ్యాక్ కొరకు టీచర్ని అభ్యర్ధించడం అనేది మొదటి దశ మరియు దాని తరువాత దానికి అనుగుణంగా సహాయాన్ని పొందవచ్చు. ఇక్కడ కేవలం అవును లేదా కాదు అనే మాత్రమే సమాధానం కాకుండా ఉండే అనేక ప్రశ్నలను మీ బిడ్డ టీచర్ని అడగడం ముఖ్యం.

మీ బిడ్డ విజయం కొరకు కంప్యూటర్ ఒక గొప్ప స్ఫూర్తిదాయక ఉపకరణం అన్న విషయం మర్చిపోవద్దు.