ప్రతి టీచర్ బుక్‌మార్క్ చేయాల్సిన 5 యూట్యూబ్ చానళ్లు

 

తరగతి గది విద్యార్థులతో నిండుగా కనిపించాలని ప్రతి టీచర్ కోరుకుంటారు. కానీ, కొన్ని కొన్నిసార్లు అదొక పగటి కలగా లేదా వారి ఆలోచనలకు భిన్నంగా జరుగుతుంది.

కాబట్టి, మీవైపు విద్యార్థులు నూరు శాతం దృష్టి పెట్టాలంటే ఎలా?

తరగతి గదిలో ఒక ఇంటరాక్టివ్ వీడియో!

మీ పాఠ్య ప్రణాళికను బట్టి- ఆరంభంలోగానీ, మధ్యలోగానీ లేదా చివరి అయిదు నిమిషాల్లోగానీ వీడియోని ప్లే చేయవచ్చు. దీనివల్ల విద్యార్థులు సమాచారాన్ని చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. వనరుల పరంగా, అన్ని వయసులవారికి, పాఠ్యాంశాలకు సంబంధించి యూట్యూబ్‌కి గల సమగ్ర అభ్యాస చానళ్లకు దరిదాపుల్లో ఎవరూ లేరు.

క్లాసు జరుగుతున్న ప్రతిసారి మీరు మీ యొక్క పిసి బ్రౌజర్లో బుక్‌మార్క్ చేయాల్సిన అయిదు చానళ్లు :

1) సైషో

విద్యార్థులకు సైన్స్ పట్ల ఆసక్తిని ఈ చానల్ తీర్చగలదు. దీనిలో మానవ మస్తిష్కం నుంచి ఓరిగామి-ప్రేరిత ఆవిష్కరణలు, యానిమేటెడ్ వీడియోల వరకు అయిదు నిమిషాలకు మించకుండా అన్ని అంశాలను కవర్ చేస్తుంది.

లింక్ : https://www.youtube.com/user/scishowkids/featured

2) గ్లామర్లీ

వ్యాకరణం మరియు సాధారణంగా గందరగోళపరిచే పదాలు, రాసే పద్ధతికి మార్గదర్శకం వంటివన్నీ గ్లామర్లీ చానెల్ అందిస్తుంది. పరీక్షలకు వారం రోజులు ముందుగా అవసరమైన మౌలిక అంశాలను మననం చేసుకోవడానికి ఇదొక చక్కటి చానల్.

లింక్ : https://www.youtube.com/channel/UCfmqLyr1PI3_zbwppHNEzuQ

3) క్రాష్ కోర్స్

పాఠ్యాంశం క్లిష్టంగానూ మరియు పాతబడినట్లుగానూ అనిపించినప్పుడు నవీకరించుకోవడానికి లేదా సదరు అంశం విద్యార్థులకు కొత్తదైనప్పడు సరిజూసుకోవడానికి హోమ్‌వర్క్ రిఫరెన్స్ అందిస్తుంది. ఆంగ్ల సాహిత్యం మొదలుకొని కంప్యూటర్ సైన్స్ వరకు క్రాష్ కోర్స్ వీడియోలు అందుబాటులో ఉంటాయి.

లింక్ : https://www.youtube.com/user/crashcourse

4) నేషనల్ జియోగ్రాఫిక్

తరగతి గదిలో మీరు నేర్పించినదానిని వాస్తవ ప్రపంచ కోణంలో విద్యార్థులు అర్థం చేసుకోవడానికి నేషనల్ జియోగ్రాఫిక్ వారి సంక్షిప్త చిత్రాలు ఉపకరిస్తాయి. ఒక షెడ్యూల్ రూపొందించుకుని మీరు మీ పాఠాలలో భాగంగా ఈ చానల్ని చేర్చుకోవచ్చు.

యూట్యూబ్ వారపు షెడ్యూల్ :
సోమ మరియు మంగళ : ప్రకృతి మరియు పర్యావరణం
బుధ : అన్వేషణ
గురు : సైన్స్
శుక్ర : వింతైన వాస్తవాలు
శని : సాహసం మరియు సురక్షితం
ఆది : చరిత్ర మరియు సంస్కృతి

లింక్ : https://www.youtube.com/user/NationalGeographic

5) ప్రపంచ ఆర్థిక వేదిక

విద్యార్థులు ప్రపంచవ్యాప్త పరిణామాలను, భవిష్య అంచనాలను మరియు తాజా వార్తలను బృందాలవారీ అసైన్మెంట్లు, పౌర పాఠాలు మరియు క్లాస్ రూమ్ డిబేట్లద్వారా తెలుసుకోవడానికి అయిదు నిమిషాలకు మించని వీడియోలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి.

లింక్ : https://www.youtube.com/user/WorldEconomicForum/featured

తదుపరి చర్య: హోమ్ వర్క్. ప్రతి టీచర్ హోమ్‌వర్క్ సహా ప్రతిదీ వినూత్నంగా ఉండాలని, ముఖ్యంగా మీరు విస్తృత ఆలోచనలు సాగిస్తున్నట్లయితే పిసి సహాయకారిగా ఉంటుంది.