మీ బిడ్డ చదువుకు సహాయపడేందుకు ఒక వెబ్‌సైట్‌ని ఎంచుకోవడానికి ముందు అడగాల్సిన నాలుగు ప్రశ్నలు

 

మీ బిడ్డ నేర్చుకోవడానికి స్క్రీన్ టైమ్ అనేది ఒక సమర్ధవంతమైన మార్గం. దీని కోసం సరైన వెబ్ సైట్ లను ఉపయోగించడం ఎంతో ముఖ్యం. ఎడ్యుకేషన్ మరియు ఎంటర్ టైన్ మెంట్ సంతులం కలిగి ఉండే వెబ్ సైట్ లు పిల్లలకు ఆసక్తి కలిగించడంతోపాటుగా వారు మరింత మెరుగ్గా చదవడానికి దోహదపడుతుంది.
సరైన వెబ్ సైట్ ని కనుగొనడం అనేది ఎంతో సవాళ్లతో కూడిన పని. మీ బిడ్డను నిమగ్నం చేయడంతోపాటుగా సరైన సమాచారం అందించే వెబ్ సైట్ ని కనుగొనడం ఎంతో ముఖ్యమైనది.
మీ బిడ్డ మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సరైన వెబ్ సైట్ ని కనుగొనడానికి సహాయపడే చెక్ లిస్ట్ ఇదిగో.

1. ఇది మీ బిడ్డ అభ్యసన అవసరాలను తీరుస్తుందా?

మీరు ఎంచుకునే వెబ్ సైట్ మీ బిడ్డ అభ్యసన స్థాయికి తగ్గట్టుగా ఉండాలి. మీ బిడ్డ వయస్సు మరియు గ్రేడ్ లు అత్యంత నిర్ధారిత కార్యక్రమాలు. దీనితోపాటుగా, బిడ్డ మెరుగుదలకు దోహదపడే సబ్జెక్ట్ లు మరియు నైపుణ్యాలు వంటి కారకాలను కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి. మీ బిడ్డను సవాలు చేసే ఇంటరాక్టివ్ వెబ్ సైట్ ల కొరకు చూడండి.

2. ఇది ఉపయోగించుకోవడం ఫ్రీనా?

చాలా వెబ్ సైట్ లకు ‘‘ఫ్రీమియం’’ మోడల్ ఉంటుంది, వినియోగించే సమాచారం యొక్క మొత్తాన్ని పరిమితం చేయబడుతుంది. తరువాత మరుగునపెట్టబడ్డ రుసుం ఏదైనా విధించబడుతుందా అని ముందుగా చెక్ చేసుకోవడం మంచిది, దీని వల్ల మీ బిడ్డ అభ్యసనకు విఘాతం కలగకుండా ఉంటుంది. ఒక వెబ్ సైట్ ని యాక్సెస్ చేసుకోవడానికి డబ్బులు చెల్లించాలని నిర్ణయించుకోవడానికి లేదా మరోఆప్షన్ ని ఎంచుకోవడానికి ముందు యూజర్ రేటింగ్ లు, రివ్యూలు మరియు ఎడ్యుకేటర్ రికమండేషన్ లు దోహదపడతాయి.

3. ఇది సంబంధిత సమాచారం?

సరైన సమాచారం మరియు వనరులు బిడ్డ అభ్యసన ప్రక్రియలో మార్పును చూపిస్తాయి.[4] తోటివారు మరియు ఫీల్డ్ లోని నిపుణుల్లో వెబ్ సైట్ పాపులారిటీతోపాటుని కూడా పరిగణించాల్సి ఉంటుంది. అనేక వనరుల నుంచి ఆన్ లైన్ రివ్యూలు, టీచర్లు మరియు మీ పిల్లల స్నేహితుల నుంచి అభిప్రాయాలను విచారించి వెబ్ సైట్ యొక్క కంటెంట్ మీ బిడ్డకు తగినదని ధృవీకరించుకోండి.

4. ఇది ఉపయోగించుకోవడం సురక్షితమా?

నిస్సందేహంగా ఆన్ లైన్ సేఫ్టీ అనేది తల్లిదండ్రులకు భారీగా ఆందోళన కలిగించే అంశం. ఒక వెబ్ సైట్ యొక్క భద్రత మరియు విశ్వసనీయతను చెక్ చేయడం కొరకు తల్లిదండ్రులు విధిగా వెబ్ సైట్ లో మాల్ వేర్ లు, పాప్ అప్ లు, తప్పుతోవ పట్టించే ప్రకటనలు ఉన్నాయా అని క్షుణ్నంగా చెక్ చేయాలి. అదనపు భద్రత కొరకు, గూగుల్ ట్రాన్స్ పరెన్సీ రిపోర్ట్ టూల్ ఉపయోగించి, పిల్లలు సందర్శించడానికి సురక్షితమైన వెబ్ సైట్ లను తల్లిదండ్రులు గుర్తించవచ్చు.

దశ 1: మీరు చెక్ చేయాలని అనుకుంటున్న వెబ్ సైట్ లింక్ ని కాపీ పేస్ట్ చేయాలి.

దశ 2: ఎంటర్ ని నొక్కండి.

దశ 3: ఫలితాన్ని చూడండి.
సంభాషణలు ముఖ్యం. పెద్ద పిల్లలు అదేవి మీ బిడ్డ క్లాస్ మెంట్ ల తల్లిదండ్రులతో కూడా మాట్లాడండి. మీరు ఎంచుకునే కంప్యూటర్ కూడా సరైనదని కూడా ధృవీకరించుకోండి: https://www.dellaarambh.com/telugu/pick-right-school-pc/