బోధించేటప్పుడు ప్రతి టీచర్ పాటించాల్సిన నాలుగు విషయాలు

 

‘‘కేవలం విద్యార్థులకు మాత్రమే కాకుండా, పిసి ఫ్లాట్‌ఫారం టీచర్లకు కూడా క్రియేటివిటి మరియు సృజనాత్మకతను అందిస్తుందిఅభ్యసనను ప్రోత్సహించేవిధంగా కొత్త మెథడాలజీల్లో  వారు ప్రయోగాలు చేయడానికి దోహదపడుతుంది.

శ్రీమతి ఆకాంక్షా భక్తీ-జాయిచంట్ డైరెక్టర్ సీడింగ్ ఇంటర్నేషనల్ అకాడమీ

విద్యార్థి జీవితంలో టీచర్ పాత్ర నిరంతరం ఉంటుంది. నాణ్యమైన టీచర్లు కేవలం విద్యార్థి విద్యా విషయాల్లో మాత్రమే కాకుండా,వారు జీవితకాలం విజయం సాధించేందుకు తేడాను చూపిస్తారని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. [1]  అనురక్తి, స్ఫూర్తిదాయకత మరియు సమర్థవంతంగా బోధించడం  అనేవి నాణ్యమైన విద్యకు పునాది.వేస్తాయి.

సరైన దిశలో కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా, ఒక టీచర్, ఒక విద్యార్థికి విద్య మరియు అభ్యసనతో ఉన్న సంబంధాన్ని పెంపొందించవచ్చు.

1. ఇంటరాక్టివ్ కార్యక్రమం ద్వారా బోధించడం

కొత్త యుచికాగో ఆధారిత అధ్యయనం ప్రకారంగా, కేవలం పుస్తకాల్లో ఉన్న థియరీని మాత్రమే చదివి అనువర్తించే విద్యార్థుల పోలిస్తే భావనలను అనువర్తించే విద్యార్థులు వాటి గురించి మరింత లోతుగా తెలుసుకుంటారు అని తేలింది.  చేయడం ద్వారా నేర్చుకునే మెథడాలజీ ద్వారా, ఫీల్డ్ ట్రిప్పులు, వర్చువల్ సిమ్యులేటర్‌లు, ల్యాబ్ సందర్శనలు మరియు గ్రూపు కార్యక్రమాలతో సహా వెంటనే సబ్జెక్ట్ విషయాలను ప్రాక్టికల్‌గా అనువర్తించడం జరుగుతుంది. [2]

2. అభ్యసనను సహకారాత్మక భాగం చేయడం

సహకారాత్మక ప్రాజెక్ట్‌లు విద్యార్థుల అంత:వ్యక్తిగత, టైమ్ మేనేజ్‌మెంట్ మరియు సంస్థాగత నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఒక అద్భుతమైన మార్గం. గ్రూపు కార్యకలాపాల్లో డిబేట్‌లు, ప్రజంటేషన్‌లు, రిపోర్ట్‌లు మరియు మేధోమథన సెషన్‌లు వంటివి విద్యార్థులు తాము ఏవిషయాల్లో మెరుగ్గా ఉన్నాం మరియు ఏ విషయాల్లో మెరుగుపరుచుకోవాలనే విషయాలను తెలుసుకోవడానికి దోహదపడుతుంది. 

3. బలాలు మరియు బలహీనతలు గురత్ంచడం

ఒకవేళ ఒక విద్యార్థి భాషలపట్ల, ఎక్స్‌ట్రా కరిక్యులం కార్యక్రమాలైన వ్రకృత్వం మరియు డిబేటింట్ వంటి విషయాల్లో ఆసక్తి చూపిస్తున్నట్లుగా విధిగా ప్రోత్సహించాలి. మరోవైపు, ఒక విద్యార్థి నిర్ధిష్ట విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే, ఉదాహరణకు, ఆల్జీబ్రా, వీకీ స్పేస్ క్లాస్‌రూమ్ద్వారా  విద్యార్థితో అభ్యసన వనరులను పంచుకోవచ్చు. [3] మదింపు గ్రూపు ప్రాజెక్ట్‌లు వంటి సరైన అవకాశాలను విద్యార్థులకు అందించడం ద్వారా వారు ఒకరినొకరు కలిసి నేర్చుకోగలుగుతారు.

4. పిసి ఆధారిత అభ్యసనను అలవాటుగా మార్చండి

పిసి ఎనేబుల్డ్ అభ్యసనలో విద్యార్థులు నాలెడ్జ్‌ని వేగంగా యాక్సెస్ చేసుకోవడానికి మరియు సబ్జెక్ట్ విషయాల్లో లోతైన అభ్యసన అందించడానికి దోహదపడుతుంది. సిమ్యులేషన్‌ల నుంచి ఆన్‌లైన్ టూల్స్ వరకు, పిసి వివిధ రకాలైన అభ్యసన వనరులను అందిస్తుంది. బట్టీ పట్టడానికి విరుద్ధంగా, విద్యార్థులు సబ్జెక్ట్ విషయాలను మరింత లోతుగా అర్థం చేసుకుంటారు, సమాచారాన్ని వేగంగా మరియు ఎక్కువ కాలం కలిగి ఉండటానికి దోహదపడుతుంది, ఇది టీచర్ మరియు విద్యార్థులు ఇద్దరికీ కూడా ప్రయోజనం కలిగిస్తుంది.

టీచర్లకు ప్రతిరోజూ ఒక కొత్త అభ్యసన అనుభవంతోపాటుగా మరింత మెరుగ్గా ముందడుగు వేయగలుగుతారు. ఈ టెక్నిక్‌లను అమలు పరచడం ద్వారా క్లాస్‌రూమ్ అనుభవం మెరుగుపడటానికి మరియు విద్యార్థుల్లో అభ్యసన పట్ల ప్రేమ పెరగడానికి దోహదపడుతుంది.

అందువల్ల, ప్రతి రోజూ మీ క్లాస్ రూమ్ అనుభవాన్ని మీరు ఏవిధంగా మెరుగుపరుచుకుంటున్నారు? #DellAarambh.ఉపయోగించి మాకు ట్వీట్ చేయండి.