కంప్యూటర్‌లు అభ్యసనను వినోదాత్మకంగా మార్చడానికి నాలుగు మార్గాలు

‘‘ప్రజలు నేర్చుకోవడానికి బదులుగా ప్రజల వద్దకు అభ్యసన తీసుకొని రావాలి.’’
- ఈలియట్ మాసే.

 

ఏ సబ్జెక్ట్ ఎవరికి విసుగు కలిగించదు. అదేవిధంగా, ఏ సబ్జెక్ట్ కూడా ప్రతిఒక్కరికి ఆసక్తికరంగా ఉండదు. విసుగు కలిగించే విషయాల్లో విద్యార్ధులను నిమగ్నం చేయడం అనేది ఉపాధ్యాయుడికి అత్యంత ముఖ్యమైన విషయం, ఒకవేళ దీనికి సంబంధించి సరైన వైఖరిని అవలంభించకపోయినట్లయితే ఇది మరింత క్లిష్టంగా మారుతుంది, ఇలాంంటి సమయంల్లో విద్యా ప్రయోజనాల కొరకు కంప్యూటర్ ఉపయోగించడం లాభదాయకంగా ఉంటుంది.  మీ విద్యార్ధి నిమగ్నతను మెరుగుపరచడానికి వివిధ రకాలైన మార్గాలున్నాయి. విసుగుపుట్టించే సబ్జెక్ట్ లు కంప్యూటర్ పుణ్యమా అని ఏమాత్రం విసుగ్గా ఉ:డవు.

చరిత్ర

పోకాహొంటాస్ లేదా నైట్ ఎట్ ద మ్యూజియం వంటి చిత్రాలు చరిత్రను తెలియజేస్తాయి, అందువల్ల, ఇది పిల్లలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించేవిషయం. మీ బోధనకు సాయపడేందుకు విజువల్ మీడియాని ఉపయోగించడం వల్ల క్లాసులో తెల్లమొహాలు వేసుకునేవారికి ప్రోత్సహించడానికి సాయపడుతుంది. చిత్రాలను రూపొందించేవారికి ఈ విషయంలో అపరిమితమైన ప్రేమ ఉంటుంది. ఉదాహరణకు, ఒకవేళ నాజీల ఊతకోత ఎంత తీవ్రమైనది అని మీ పిల్లలు అర్ధం చేసుకోవాలని మీరు కోరుకున్నట్లయితే, మీరు వారికి ద పియానిస్ట్, షిండ్లర్స్ లిస్ట్ లేదా ద డైరీ ఆఫ్ అన్నే ఫ్రాంక్ ని చూపించవచ్చు. మీరు చూసిన చిత్రంతోపాటుగా, చిత్రం యొక్క చారిత్రక ఖచ్చితత్త్వం గురించి మరియు వాటిని ప్రతిబింబించే భాగాల గురించి చర్చించవచ్చు. అదనంగా, విద్యార్ధులు కంప్యూటర్ వనరులు ఉపయోగించడం వల్ల విద్యార్ధులు పెద్దమొత్తంలో మెటీరియల్ ని అన్వేషించేందుకు దోహదపడుతుంది. 

సైన్స్

ఒకవేళ పిల్లలకు ఏదైనా ఇష్టమైన ప్రశ్న ఉంటే అది ‘వై’ అనేది. ప్రపంచం గురించి వారి సహజ ఆసక్తిని  ప్రోత్సహించడం మరియు వారంతట వారు ఎలా సమాధానాలు కనుగొనవచ్చు అని బోధించడం ద్వారా. విద్యార్ధులను పుస్తకాల నుంచి బయటకు తీసుకొచ్చి, వారికి సైన్స్ యొక్క వాస్తవిక అనువర్తాలను చూపడం అనేది కీలకం. ఈప్రక్రియలో వారు నిమగ్నం అయ్యేలా చూడటం కొరకు వారికి చర్చించే అవకాశం ఇవ్వడం ముఖ్యం. తరువాత, వారు అప్పుడే నేర్చుకున్న థియరీని వర్తింపచేయగల  ప్రయోగాలను చూపించడం ద్వారా, విద్యార్ధులను సైన్స్ ని మరింత వినోదాత్మకంగా చూడగలుగుతారు.

గణితం

చాలా మంది విద్యార్ధులకు గణితం నీటికి ఎదురు ఈదుతున్నట్లుగా అనిపిస్తుంది. సంఖ్యలు ఎలా కలిసిపోతాయనే దానికి సంబంధించి ఎలాంటి స్పష్టత ఉండదు మరియు ఇది చాలా సవాళ్లతో కూడిన అంశంగా కూడా ఉంటుంది. విద్యార్ధులు గణితం పట్ల ఉత్సకత ప్రదర్శించే సాంకేతికత ఎంతగానో సాయపడుతుంది. ఈ వెబ్ సైట్ లు ఇంటరాక్టివ్ యాక్టివిటీస్ ని మరియు విజువల్ రిప్రజంటేషన్ లను అందిస్తాయి, తద్వారా మీ విద్యార్ధులు వాటిలో నిమగ్నం అయ్యేలా చూస్తాయి. విద్యార్ధులు తాము తరగతి గదిలో నేర్చుకున్న విషయాలను నిజజీవితంలోనికి ఆపాదించుకున్నప్పుడు, వారు ఏమి నేర్చుకున్నారనేది అర్ధం చేసుకోవడానికి వారికి సాయపడుతుంది.

భూగోళశాస్త్రం

సరైన భూగోళశాస్త్ర పాఠంతో, విద్యార్ధులు క్లాస్ రూమ్ ని విడిచిపెట్టకుండా ప్రపంచం మొత్తం ప్రయాణిస్తారు. మ్యాప్ పై వివిధ దేశాలను గుర్తించడం నుంచి వివిధ టైమ్ జోన్ ల అర్ధం చేసుకునేంత వరకు వారు నేర్చుకుంటారు. పిసిని ఉపయోగించి, విద్యార్ధులు గూగుల్ ఎర్త్  యొక్క దృక్పథంలో ఉంచవచ్చు. విద్యార్థులకు వారి వ్యక్తిగత భౌగోళికాంశాల పరిధిని దాటి వారి జ్ఞానాన్ని విస్తరించడానికి మరింత సమాచారాన్ని అందించడం ద్వారా వారు నివసించే ప్రపంచం గురించి నేర్పడానికి ఇది ఒక ఐకానిక్ విధానం. 

మీ భావనలు మరింత సంబంధితమైనవి మరియు సాపేక్షమైనవి అయితే, ప్రపంచంలోని అత్యంత విసుగు కలిగించే విషయాలను సైతం నేర్చుకోవడానికి విద్యార్థులకు ప్రేరణ లభిస్తుంది.