టెక్-హాబీలతో ఆటాడుకోండి!

హాబీలు అంటే ఆటల పరంగానో, ఆర్టు పరంగానో ఉంటాయనుకునే రోజులు పోయాయి. ఇవేళ రేపు టెక్-బేస్‌డ్ హాబీలు వచ్చాయి. మీకు తీరిక ఉన్న సమయంలో కంప్యూటర్ ముందు కూర్చుంటే కల్పనాత్మక క్రియాశీల హాబీలు లెక్కలేనన్ని పొందవచ్చు.  ప్రపంచం మీ చుట్టు పరిభ్రమిస్తుంది. కళాత్మక చిత్రాలెన్నింటినో మీరే సృష్టించవచ్చు.

ఈ సాధారణ టెక్-హాబీలతో మొదలెట్టండి!

1. బ్లాగింగ్

 

బ్లాగ్ అనేది డైరీ మాదిరి వెబ్‌సైట్. ఆన్‌లైన్‌లో సరదా ముచ్చట్లు చెప్పుకొవచ్చు. మీ ప్రతిభను ప్రదర్శించుకోవచ్చు. ఆన్‌లైన్ జర్నల్ నిర్వహించుకోవచ్చు. టెక్స్ట్, ఇమేజీలతో కూడిన సంప్రదాయిక బ్లాగ్‌లు మీడియా వరకు ఎదిగాయి. వివిధ వేదికలుగా విస్తరించాయి. ఇప్పుడు పాడ్‌కాస్ట్ ఉపయోగించి మీరే ఒక ఆడియో ఆల్బమ్ తయారు చేసుకుని సౌండ్ క్లౌడ్ ద్వారా ప్రపంచానికి మీ స్వరాన్ని వినిపించవచ్చు. లేదా ట్విట్టర్ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రవేశించి 140 క్యారెక్టర్లతో ఒక "మైక్రో బ్లాగ్" సృష్టించవచ్చు. మీరు ఏ మాధ్యమాన్ని లేదా ఏ వేదికను ఎంచుకున్నారన్నది కాదు... ప్రపంచంతో కనెక్ట్ కావడానికి బ్లాగింగ్ అనేది మహత్తర అవకాశం.

2. కోడింగ్


 

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, యాప్స్ మరియు వెబ్‌సైట్లను సృష్టించేది ఇదే! మీ బ్రౌజర్, మీ ఓఎస్, ఫోన్‌లోని యాప్స్, ఫేస్‌బుక్, మరియు ఈ వెబ్‌సీట్... ఇవన్నీ కోడ్ ఆధారంగా రూపొందినవే, కోడింగ్ లాభదాయకమైన మరియు ఆసక్తికరమైన అభిరుచి. దీనిని ఫలప్రదమైన కెరీరుగాకూడా మలచుకోవచ్చు. ఏమో, ఎవరికి తెలుసు! మీరే తదుపరి ఫేస్‌బుక్‌ని సృష్టిస్తారేమో! ఇక్కడ కోడింగ్ యొక్క మౌలిక అంశాలను అర్థం చేసుకోవడానికి, మీరు ఎంచుకోవడానికి కొన్ని వనరులను ఇవ్వడమైంది.

3. వ్లాగింగ్

 

వ్లాగ్ (లేదా వీడియో బ్లాగ్) అనేది వీడియో కంటెంటుతో కూడీనది. మీరు మీ సొంత వ్లాగ్‌ని తయారు చేసుకోవడం చాలా సులభం. మీయొక్క డే-టు-డే కార్యకలాపాలను మీ ప్రేక్షకులకు చూపించుకోవచ్చు లేదా వారికోసం ఒక డీఐవై యాక్టివిటీని సృష్టించవచ్చు.  

ఎంతమది ప్రొఫెషనల్ వ్లాగర్లు ఉన్నారో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సూపర్ వుమన్‌గా ప్రసిద్ధిపొందిన లిల్లీ సింగ్, శ్రద్ధ శర్మ, తన్మయి భట్ వారు వీరిలో కొందరు మాత్రమే. వీరందరూ తమ ఇంటిలోనే వీడియోలను రూపొందించి వ్లాగ్‌లో పోస్టు చేస్తారు. ప్రఖ్యాత యూట్యూబ్ ట్రావెలర్ మరియు బ్యూటీ వ్లాగర్ ష్రెజాదె ష్రాఫ్ అందాల చిట్కాలను వ్లాగింగ్ చేసి పేరు గడించారు. ఆమె డెల్ జోస్యురాలుకూడా; మీ అభిరుచిని కెరీరుగా మలచుకోవడానికి ఒక అవకాశం చాలు.   

వీరందరి వ్లాగ్‌లను తిలకించినట్లయితే మీకంటూ ఒక సొంత వ్లాగ్ రూపొందించుకోవడానికి అవగాహన ఏర్పడుతుంది. 

 4. ఫొటోగ్రఫీ

 

డిజిటల్ ప్రపంచానికి, సారూప్యతకు నడుమ బంధాన్ని అన్వేషించదలిస్తే ఇదే సరైన హాబీ!. జీవితంలో మరువలేని ఘట్టాలను పదిలపరచుకోవడమెలాగో మీకు ఫొటోగ్రఫీ నేర్పిస్తుంది. స్పష్టంగా ఫొటోలు తీయడంలో మీరు ఆరితేరినట్లయితే, ఫొటో ఎడితింఘ్ విషయంలో గైడ్ చేయడానికి దీనిని చూడండి. మీ సొంత కళాకృతులను సృష్టించుకోవడానికి రెడీ అవ్వండి.

ఈ నూతన శకపు అభిరుచులతో అసంఖ్యాకమైన అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. మీ తపన ఏదయినాగానీ మనసుకు హత్తుకునేలా చెప్పగలదు. మీ ఆలోచనలకు రూపం ఇవ్వడానికి మరియు ప్రపంచం ముందు ప్రదర్శించడానికి మీకు కావల్సిందల్లా ఒక కంప్యూటర్ మాత్రమే. 

మరి, దేనిని ఎంచుకున్నారు?