మీ బిడ్డ హోమ్ వర్క్‌కు కంప్యూటర్ ఏఉవిధంగా ఉపయోగపడుతుంది

 

 

ఇప్పుడు ప్రపంచం మొత్తం డిజిటల్‌గా మారుతోంది, అదేవిధంగా పేరెంటింగ్ కూడా డిజిటల్ కావడం పెద్ద అతిశయోక్తి విషయం కాదు. అది నిజమే, 2018లో మరిముఖ్యంగా చదువు విషయానికి వస్తే, మీరు సాంకేతికతను ఇష్టపడే డిజిటల్ పేరెంట్‌గా మారాల్సిన అవసరం వచ్చింది.

1. కంప్యూటర్లు పరిశోధనను మరింత వేగవంతం చేస్తాయి

నాణ్యమైన రీసెర్చ్ ద్వారానే క్వాలిటీ అసెస్మెంట్లు రూపొందుతాయి. Google Search, Google Scholar మరియు Kiddle వంటి కంప్యూటర్ టూల్స్ ద్వారా రీసెర్చింగ్ మరింత వేగంగానే కాకుండా మరింత సులభతరంగా కూడా ఉంటుంది. గూగుల్ స్కాలర్ ఎంతో ఉపయోగకరమైనది ఎందుకంటే ఇది దాదాపుగా అన్ని రకాల టాపిక్లపై రీసెర్చ్ పేపర్లు, రిపోర్ట్లు మరియు మేధావుల ఆర్టికల్స్‌తో కూడిన సమాచారాన్ని అందిస్తుంది.

2. కంప్యూటర్లు మీ బిడ్డకు మరింత మెరుగ్గా స్ఫూర్తిని అందిస్తాయి

తరచుగా పిల్లలు హోమ్ వర్క్ ప్రారంభించడానికి బదులుగా సాగదీస్తూ, సమయాన్ని వృధా చేస్తుంటారు. దిశా నిర్దేశం లేకపోవడం వల్లనే ఇలాంటి ఆలస్యానికి కారణం అవుతుంది. Templatelab వంటి వెబ్సైట్లు ఎస్సేలు వంటి వాటి కొరకు తక్షణం లభ్యం అయ్యే టెంప్లెట్లను అందిస్తుంది, ఇది మీ బిడ్డకు ఒక విశ్వసనీయమైన ప్రారంభ బిందువును అందిస్తుంది.

3. వివిధ రకాల విషయాలను సమ్మిళితం చేయడానికి కంప్యూటర్ మీకు సహాయపడుతుంది.

కంప్యూటర్‌పై వర్డ్, పిపిటి, ఎక్సెల్, వీడియో ఇలా అనేక రకాలైన ఫార్మెట్లు లభ్యం అవుతున్నాయి, అందువల్ల మీ బిడ్డ విభిన్న రకాలైన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది. వ్యాసాలు రాయడానికి వర్డ్, కంప్యూటింగ్ కొరకు ఎక్సెల్, పిపిటిలు మీ బిడ్డలో ప్రజంటేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి దోహదపడతాయి.

4. కంప్యూటర్లు ప్రతిదానిని ఒక క్రమబద్ధంగా ఉంచుతాయి

సరళమైన మరియు వేగవంతమైన సెర్చ్‌తో మీ బిడ్డకు సంబంధించి ప్రతిదీ ఒకేచోట స్టోరు చేసుకునేందుకు కంప్యూటర్లు అవకాశం కల్పిస్తాయి. Calendar, Evernote మరియు One Note వంటివి డాక్యుమెంట్లు, వెబ్సైట్లు, ఛార్ట్లు మొదలైన వనరులు సేకరించడానికి సహాయపడతాయి, తద్వారా పరీక్షల సమయంలో మీరు తీవ్రంగా శోధించాల్సిన అవసరం ఉండదు.

5. కంప్యూటర్లు సబ్జెక్ట్ నిర్ధిష్ట గైడ్లు అందిస్తాయి

పదాల ఉచ్చారణ నుంచి సంక్లిష్టమైన సైంటిఫిక్ సిద్ధాంతాల వరకు, ప్రతి సబ్జెక్ట్ కొరకు ఏదో ఒకటి లభిస్తుంది- మీరు మరియు మీ బిడ్డ సరైన కంప్యూటర్ వనరుల కొరకు వెతకాల్సి ఉంటుంది. తేలికగా అర్ధం చేసుకునే ఫార్మెట్లో ఉండే ఎడ్యుకేషనల్ వీడియోల కొరకు వెతకడానికి YouTube ఒక మంచి ప్రదేశం.

6. కంప్యూటర్లు మీ బిడ్డకు మరింత మెరుగ్గా స్ఫూర్తిని అందిస్తాయి

మీ పిల్లలు ప్రతిరోజూ హోమ్ వర్క్ పూర్తి చేయడానికి కంప్యూటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. మీ బిడ్డను కంప్యూటర్ ఒక గంటపాటు చదివేందుకు మరియు పదిహేను నిమిషాలుపాటు అదనంగా ఆడుకునేందుకు అనుమతించడం ద్వారా మీ బిడ్డ ఒక గంటపాటు ఎలాంటి అంతరాయం లేకుండా హోం వర్క్ చేసేందుకు తగిన స్ఫూర్తిని పొందుతాడు.

సరైన టూల్స్ మరియు వనరులు, హోమ్ వర్క్‌ని చిన్న వయస్సులోనే మీ బిడ్డలోని అభ్యసన సామర్ధ్యాలను వెలికి తీసే సాధనంగా మారుస్తాయి. హ్యాపీ హోమ్ వర్క్!