ప్రతి విద్యార్ధికి ఒక మెంటార్ ఎందుకు అవసరమో ఇదిగో తెలుసుకోండి

 

“హాల్ లో మీరు దాటి వెళ్లే ప్రతి విద్యార్ధి యొక్క కథను మీరు వినాల్సిఉంటుంది. బహుశా మీరే ఆ కథను వినాల్సిన వారు కావొచ్చు.’’

- బెథానీ హిల్

మెటారింగ్ అనేది ప్రొఫెషనల్ గా మరియు వ్యక్తిగత అభివృద్ధి కి సంబంధించిన లక్ష్యంతో రెండు వ్యక్తుల మధ్య ఉండే సంబంధం. ‘‘మెంటార్’’ సాధారణంగా అనుభవం ఉన్న వ్యక్తి, ఇతడు తక్కువ అనుభవం ఉన్న వ్యక్తి, లేదా ‘‘మెంటీ’’తో తన నాలెడ్జ్, అనుభవం మరియు సలహాను పంచుకుంటాడు.

ఒక మెంటార్ ని పొందేటప్పుడు మీరు పరిగణనలోకి తీసుకోవాల్సిన మూడు విషయాలు:

 

1. మెంటార్ లు ప్రోత్సాహం అందిస్తూ, వారు నిరంతరం ముందుకు సాగేలా చూస్తారు.

మెంటారింగ్ అనేది ఎంచుకోవడానికి మెదడు, వినడానికి చెవి, మరియు సరైన దిశలోనికి పంపడం.”

- జాన్ క్రాస్ బే

ఒక మంచి మెంటార్ మిమ్మల్ని మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకొస్తారు, మీ సామర్ధ్యరూపకల్పనకు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు, ఏవైనా బలహీనతలు ఉంటే పరిష్కరిస్తారు మరియు మీరు అత్యంత అత్యుత్తమైన వారిగా మారేలా చూస్తారు.

 

2. మెంటార్ లకు అనుభవం ఉంటుంది, అందువల్ల ఒకే తప్పులు చేయకుండా వారిని నిరోధించడానికి వారి నుంచి మీరు నేర్చుకోవచ్చు

మెంటార్, మిమ్మల్ని మామూలుగా చూడకుండా, మీలో ఉండే టాలెంట్ మరియు సామర్ధ్యాలను చూస్తారు, మరియు ఆ సామర్ధ్యాలను బయటకు తీసుకొని రావడానికి సాయపడతారు.”

- బాబ్ ప్రొక్టర్

ఒక మెంటార్ ఉంటే మనం ఏ పని అయినా చేయవచ్చు. మీ మెంటార్ మీకు నిర్మాణాత్మకంగా ఉండే ఫీడ్ బ్యాక్ ఇస్తాడు మరియు మిమ్మల్ని విజయవంతమైన మార్గంలో ఉంచేందకు ఒక కార్యాచరణ ప్రణాళికని రూపొందిస్తారు. ఉదాహరణకు, మీ ఇంగ్లిష్ ఎస్సేలో గ్రామర్ విషయంలో మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే, మీ మెంటార్  మీకు Grammarly లేదా Grammarixని మీకు సిఫారసు చేస్తారు, తద్వారా మీరు కావాల్సిన సాయాన్ని పొందుతారు.

 

3. మెంటార్ లు వ్యక్తిగతీకరించబడ్డ గోల్ సెట్టింగ్ ని అందిస్తారు.

‘‘ఇనుముని ఇనుమే వంచుతుంది, అదేవిధంగా ఒక వ్యక్తిని మరో వ్యక్తి మాత్రమే తీర్చిదిద్దగలడు.’’

- బైబిల్

దశ 1 - మీ గోల్ సెట్ చేయండి

దశ 2 - కార్యాచరణ ప్రణాళికను సృష్టించండి

దశ 3 - దానిపై పనిచేయడం

దశ 4 - మధ్యలో వచ్చేవాటిని స్వీకరించడం

దశ 5 - మీ తప్పుల నుంచి నేర్చుకోవడం

దశ 6 - పునరావృతం చేయడం

గోల్ సెట్ చేయడం అనేది విజయవంతమైన మెంటారింగ్ కు పునాది.  మీరు ఆ సరైన దానిని పొందిన తరువాత, మీ మెంటార్ నుంచి అత్యుత్తమైన దానిని మీరు పొందగలుగుతారు.

మెంటార్ ఉండటం వల్ల, ఉత్పాదకత అనేది కేవలం పరీక్షకు ఒక్కరోజు ముందు పరిమితం కాకుండా, అది మీలో భాగం అవుతుంది, ఇది ఎతో సహజంగా వచ్చే లక్షణం. అన్నింటిని మించి, స్కూలులో ప్రథమ స్థానంలో నిలవాలని అనుకునేవారికి సాయపడుతుంది.