పిసి ఆధారిత అభ్యసన నుంచి మీ బిడ్డ ఏవిధంగా ప్రయోజనం పొందుతాడు

 

“ఏదైతే మనం సంతోషంగా నేర్చుకుంటామో, దానిని ఎన్నడూ మర్చిపోము.” – ఆల్‌ఫ్రెడ్ మెర్సియర్. వ్యక్తిగత కంప్యూటర్లు మనం పని చేసే విధానాన్ని, మనం సృష్టించే విధానాన్ని మరియు మనం నేర్చుకున్న మార్గాన్ని కూడా మార్చాయి. ఇవాళ ప్రతి ఆఫీసులోని కంప్యూటర్‌లు వేళ్లూనుకున్నాయి, అలానే స్కూల్లు సైతం కంప్యూటర్‌లను చదువుకు సంబంధించిన ఒక అంతర్గత టూల్‌గా ఉపయోగిస్తున్నాయి, పిసి ఆధారిత అభ్యసన కార్యక్రమం అనేది సంప్రదాయ విధానాలతో పోలిస్తే, పెరిగిన ఇంటరాక్టివిటీ, సిమ్యులేషన్‌లు, విస్త్రృతశ్రేణి వనరులను పొందడం మరియు సబ్జెక్ట్ మెటీరియల్‌కు సంబంధించిన లోతైన అవగాహన కల్పించడానికి దోహదపడుతుంది. ఇది పాఠశాలలోనే కాకుండా ఇంటి వద్ద కూడా, ఒక అభ్యసన సాధనంగా గణనీయమైన విలువను అందిస్తాయి.

 

1. వనరులు

పిసి ఆధారిత అభ్యసనంతో, విద్యార్థులు పాఠ్యపుస్తకాలు అందించేవాటికే పరిమితం కావాల్సిన అవసరం లేదు స్కూళ్లకు సంబంధించిన కంప్యూటర్‌లు అభ్యసన మరింత సులభతరం చేయడానికి ఎడ్యుకేషనల్ సాఫ్ట్‌వేర్ మరియు అభ్యసన కార్యక్రమాలను అందిస్తోంది. దానితోపాటుగా, ఇంటర్నెట్‌ని ఉపయోగించడం వల్ల విద్యార్థులు అనేక అభ్యసన టూల్స్‌ని స్కూలు లేదా ఇంటి వద్ద ఉపయోగించుకోవడానికి దోహదపడుతుంది.

 

2. తేలికగా రివిజన్ చేయడానికి దోహదపడుతుంది

అభ్యసన కొరకు విద్యార్థులు కంప్యూటర్లను ఉపయోగించినప్పుడు, విద్యార్థులు రివిజన్ మాడ్యూల్ మరియు పాఠానికి మాత్రమే పరిమితం కారు, భావనలను మరింత బలంగా అర్థం చేసుకోవడం కొరకు ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు పాఠాన్ని నేర్చుకోగలుగుతారు.  దీని ఫలితంగా భావనలు మరియు పాఠాలను మరింత తేలికగా తిరిగి సందర్శించడానికి మరియు రివిజన్ చేయడానికి దోహదపడుతుంది.

 

3. భద్రత

సిమ్యులేషన్‌లు ద్వారా విద్యార్థులు తేలికగా ఇంటి వద్దనే శాస్త్రీయ భావనలను అర్థం చేసుకోవడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు, వారు వర్చువల్ ప్రయోగాలను నిర్వహించి, రసాయనాలు ఒకదానితో మరొకటి ఏవిధంగా ప్రతిస్పందిస్తున్నాయనే విషయాన్ని తెలుసుకోగలుగుతారు. ఇది మాత్రమే కాకుండా, విద్యార్థులు వివిధ రకాల వర్చువల్ కార్యక్రమాలను మళ్లీ మళ్లీ చేయడం ద్వారా మెటీరియల్‌లో తాము నేర్చుకున్న విషయాలను బలోపేతం చేసేందుకు సిమ్యులేటర్‌లు విద్యార్థులకు దోహదపడతాయి.

 

4. డీప్ లెర్నింగ్

పిసి ఆధారిత అభ్యసన ద్వారా విద్యార్థులకు లోతైన అభ్యసన జరుగుతుందని తద్వారా విద్యార్థులు భావనలు మరనియు ఆలోచనలను మరింత మెరుగ్గా నేర్చుకోగలరని పరిశోధనలు సూచిస్తున్నాయి. వారు ఈ పాఠాలను ఉపయోగించుకొని, వాటిని తమ చుట్టూ ఉండే ప్రపంచానికి అనువర్తించగలుగతారు, వైవిధ్యభరితమైన మరియు వివేచనతో కూడిన ఆలోచనా నైపుణ్యాలను ప్రదర్శించగలుగుతారు.[1]

 

ఇంటి వద్ద మరియు స్కూలు వద్ద ఉపయోగించే కంప్యూటర్‌లు పిల్లలు అభ్యసనకు అత్యంత కీలక అభ్యసన టూల్స్. పైన పేర్కొన్న ప్రయోజనాలతోపాటుగా, అవి సమాచార ప్రపంచానికి ద్వారాలు తెరుస్తాయి.[2] ఇంటరాక్టివ్ లెర్నింగ్‌కు ఆస్కారం కల్పించేందుకు కూడా వాటిని ఉపయోగించవచ్చు, ఇవి బిడ్డ మరింత మెరుగ్గా నేర్చుకోవడానికి సహాయపడుతుంది. [3]

నేడే ఇంటికి ఒక పిసిని తీసుకురండి మరియు కొత్త అభ్యసన తరంగాన్ని ఆరంభించండి.