సాంకేతికత ఆధునిక పేరెంటింగ్‌ని ఎలా మార్చింది

మహమ్మారిచే ప్రేరేపించబడిన ఆధునిక విద్యా పద్ధతులు, పాత రోజుల నాటి వాస్తవికతకు చాలా దూరంగా ఉన్నాయి. నేడు, ఎన్నో విషయాల ప్రోటోకాల్స్ సమీక్షించబడిన ఈ తరుణంలో, తమ పిల్లల బోధన మరియు అభివృద్ధితో పాటు, తల్లిదండ్రులు ఎన్నో అంశాలను నిర్వహించవలసి ఉంటుంది.

గత కాలంలో లాగా కాకుండా, ఆధునిక తల్లిదండ్రులు పాఠశాల ఉపాధ్యాయులతో కలిసి పని చేస్తున్నారు, ఇక్కడ సాంకేతికత ఒక ఉపకరణంగా పని చేస్తుంది మరియు అంతరాన్ని పూరించడానికి సహాయపడుతుంది.

1. యాప్స్ ద్వారా విద్యను ప్రారంభించడం: ఆఫ్ లైన్ నుండి ఆన్ లైన్ తరగతికి సజావుగా మారడానికి, తల్లిదండ్రులు వివిధ యాప్స్ మరియు విద్య సాధనాలను ప్రయత్నిస్తున్నారు, వీటిలో ఇతర సాధనాలతో పాటు ప్రత్యేక అభ్యాస కార్యక్రమాలు ఉండే ఖాన్ అకాడెమీ కిడ్స్ మరియు వివిధ హోమ్ వర్క్ ప్రశ్నలను చేయగలిగే బ్రైన్లీ ఉన్నాయి.

2. అభ్యాసాన్ని సరదాగా ఉండేలా చేయడం: ఇతర యాప్స్ తో పాటు, నాణ్యమైన ఆడియో కంటెంట్ యొక్క పెద్ద భాండాగారాన్ని కలిగి ఉండే కిండర్ లింగ్ కిడ్స్ రేడియో, చిన్న పిల్లలకి స్పానిష్ పరిచయం చేసే FabLingua, చిన్న పిల్లలలో సమస్యలను పరిష్కరించ కలిగే సామర్ధ్యాన్ని పెంచే Thinkrolls Play & Code వంటి యాప్స్ అభ్యాస సెషన్ లలో తల్లిదండ్రులు మరియు పిల్లలకు బంధం ఏర్పడేందుకు సహాయపడుతుంది.

3. పేరెంటల్ నియంత్రణలు ఉపయోగించడం/సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించడం: తమ తోటివారితో పిల్లలు సంభాషించే విధానాన్ని సాంకేతికత మార్చేసింది. తల్లిదండ్రులు చేయవలసినది ఏమిటంటే, Qustodio, Kaspersky, Safe Kids మొదలైన పేరెంటల్ నియంత్రణలను ఉపయోగించి సురక్షితమైన బ్రౌజింగ్ ప్రవర్తనను పిల్లలకు బోధించడం. ఆన్ లైన్ భద్రత మరియు గోప్యత యొక్క ప్రాముఖ్యతను నేర్పించడం మరియు డిజిటల్ పౌరసత్వం అంటే ఏమిటో వారికి అవగాహన కల్పించడం అవసరం, తద్వారా వారు ఇంటర్నెట్ యొక్క అసలైన శక్తిని ఉపయోగించుకోగలరు.

విద్య రంగంలో, మారుతున్న కాలానికి అనుగుణంగా మారడం నేటి తల్లిదండ్రులకు చాలా ముఖ్యం. తగిన పద్ధతులను అవలంబించి, తల్లిదండ్రులు తమ పిల్లల అభ్యాస వాతావరణాన్ని సరదాగా, సురక్షితంగా మరియు లాభదాయకంగా చేయగలరు. గొప్ప అభ్యాస అవకాశాలతో పిల్లలను సాధికారులను చేయడం కోసం డెల్ పి సి అక్షరాస్యతను ప్రోత్సహిస్తుంది. మరింత తెలుసుకునేందుకు ఇక్కడ నొక్కండి.