పిసి ఆధారిత అభ్యసనఏవిధంగా పిల్లల భవిష్యత్తుకు సహాయపడగలదు

 

భవిష్యత్తులో విద్యార్థులు విజయంసాధించడానికి టెక్నాలజీ ఒక కీలక పాత్ర పోషించనుంది. పిల్లవాడి యొక్క అభివృద్ధి తొలి దశలో పిసి ఎనేబుల్డ్ విద్య అనేది భవిష్యత్తులో ఎదుగుదలకు ఒక బలమైన పునాదిని ఏర్పరుస్తుంది. [1] సిలబస్‌ని దాటి, పరిధీయ నైపుణ్యాలను సాధించడం ద్వారా జీవితంలో స్థిరంగా ముందుకు సాగడానికి దోహదపడతాయి.

1. స్వతంత్రంగా నేర్చుకోవడానికి చొరవ

పరిశోధన చేస్తున్నా, సమాచారం సేకరిస్తున్నా లేదా ప్రాజెక్టులపై పనిచేస్తున్నా, పిసిఆధారిత అభ్యసన అనేది విద్యార్థులు తమ అభ్యసనపై నియంత్రణ సాధించడానికి దోహదపడుతుంది. మీ స్వంతంగా నేర్చుకునేందుకు చొరవ తీసుకోవడం ద్వారా విద్యార్థులు స్కూల్లు అదేవిధంగా పనిప్రాంతంలో మరింత మెరుగ్గా పనిచేస్తారు, ఎందుకంటే ఇది వారిలో ‘చేయగలం’ అనే దృక్పథాన్ని పెంపొందిస్తుంది.

2. వేగంగా మారుతున్న టెక్నాలజీ ద్వారా ఆత్మవిశ్వసం

మీ బిడ్డ ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నప్పటికీ,న కంప్యూటర్ అక్షరాస్యత అనేది, అవసరమైన మార్పులను స్వీకరించడానికి వారికి దోహదపడుతుంది. చిన్నవయస్సుల్లోనే స్కూలు మరియు ఇంటి వద్ద చదువుకోవడం కొరకు కంప్యూటర్‌ ఉపయోగించే పిల్లలు, వారు తమ భవిష్యత్తు వర్క్‌షాప్ కొరకు వాటిని మౌలికంగా ఉపయోగిస్తారు. ‘‘సాధనంబు సమకూరు ధరలలోన’’ అనే పాత్ర సామెత ఉంది, ఇది పిసిని మరియు సాంకేతికన ఉపయోగించడంలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

3. క్రిటికల్ థింకింగ్ నైపుణ్యాలను పొందడం

పిసి ఆధారిత అభ్యసన వివిధ రకాల టెక్నీక్‌లు మరియు యాక్టివిటీలను ఉపయోగిస్తుంది, ఇది అభ్యసన సామర్థ్యాన్ని పెంచడానికి మరియు విద్యార్థుల్లో కీలక ఆలోచనా నైపుణ్యాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఉదాహరణకు, డిజిటల్ ఆధారిత పీర్ రివ్యూ కార్యకలాపాలు విద్యార్థుల్లో ప్రత్యామ్నాయ కోణాలు అభివృద్ధి చెందడానికి దోహదపడుతుంది. ఆన్‌లైన్ చర్చా వేదికలు, మరోవైపున వారిలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలను పెంపొందిస్తాయి మరియు తమ దృష్టికోణాన్ని ముందుకు పెట్టడానికి దోహదపడుతుంది. అదనంగా, తరగతి గదిలో డిజిటల్ స్టోరీ టెల్లింగ్ అనేది కోర్సు కంటెంట్ మరింత సంపూర్ణంగా నేర్చుకోవడానికి, తాము నేర్చుకున్న దానిని ప్రతిబింబించేలా మరియు మదింపు చేసుకునేందుకు దోహదపడుతుంది.

4. విజయవంతమైన సహకారం

టీమ్ వర్క్ అనేది ఎప్పుడూ తరగతి గదిలో ఒక అంతరభాగంగా ఉంటుంది. సహకారం అనేది తేలికగా మరియు వేగంగా పిసి ఆధారిత అభ్యసన వల్ల కలుగుతుంది, ఎందుకంటే వనరులు మరియు టూల్స్‌ని వేగంగా యాక్సెస్ చేసుకోగలుగుతారు. ఉదాహరణకు, విద్యార్థులు వికీస్పేసెస్ క్లాస్ రూమ్ ఉపయోగించి, ఒకరినొకరి క్లాసును రిఫర్ చేసుకోవచ్చు, పరిశోధన మరియు సమాచార సేకరణ రెండూ కలిసి సాగడం వల్ల వారి ఆలోచనలను ముందుకు జీవితంలో మార్కర్‌స్పేస్‌కు తీసుకెళతాయి. ఈ కార్యక్రమాలు పిల్లలు సామరస్యంతో కలిసి పనిచేయడానికి దోహదపడుతుంది, వయస్సు పెరిగిన తరువాత ఈ నైపుణ్యం ఎంతగానో అవసరం అవుతుంది.

పిసి ఆధారిత అభ్యసన వల్ల పిల్లల కొరకు అనేక అవకాశాలు లభ్యం అవుతాయి మరియు వారిని సాంకేతికంగా మరింత విశ్వసనీయమైన వారిగా తీర్చిదిద్దుతుంది.

అందువల్ల,ఈ హైపర్ కనెక్టివిటీ ప్రపంచంలో మీ బిడ్డ విజయం సాధించడం కొరకు మీరు ఎలా సిద్ధం అవుతున్నారు?