డిజిటల్ పేరెంట్ కావడమెలా?

 

డిజిటల్ శకం ఆరంభం కావడంతో పిల్లల సమగ్రాభివృద్ధికి డిజిటల్‌గా ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి పేరెంటుకి ఉంది. వారి జీవితంలో అధిక సమయాన్ని ఏదోక రూపంలో సాంకేతికత సాయంతో గడపాల్సి వస్తుంది. ఈ ఆలోచనతోనే డిజిటల్ పేరెంట్‌కి బీజం పడింది. వీరు మాత్రమే సాంకేతిక ప్రపంచంలో శరవేగంగా మారుతున్న పరిణామాలకనుగుణంగా పిల్లలను తీర్చిదిద్దగలరు. పిల్లలు తమ దైనందిన జీవనంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అర్థం చేసుకుని, అవలీలగా వినియోగించడానికి ఇది ఉపయోగపడుతుంది.  

ఇప్పుడు డిజిటల్ పేరెంట్ అంటే ఎవరో, మీరెలా కాగలరో తెలుసుకోండి. 

1. డిజిటల్ ప్రపంచం గురించి తెలుసుకోండి

డిజిటల్ పేరెంట్ కావాలంటే ముందుగా మిమ్మల్ని మీరు ఎడ్యుకేట్ చేసుకోవాలి. పిల్లలకు ఎదురుబొదురుగా ఉండి నూతన సాంకేతిక పరిణామాలపై అవగాహన కల్పించాలి. డిజిటల్ పేరెంటింగ్‌పై ది హిందూ దినపత్రికలో పబ్లిషయిన ఒక ఆర్టికల్‌లో..."పిల్లలు ఆన్‌లైన్ వినియోగిస్తున్నప్పుడు వాళ్లను మానిటర్ చేయడం తల్లిదండ్రులకు ఇబ్బందిగా ఉంది. స్వయంగా వాళ్లు వాడుకుందామన్నా తగినంత పరిజ్ఞానం లేనందున ఇబ్బంది పడుతుంటారు" అని ఉంది. ఈ పరిస్థితుల్లో సాంకేతికంగా మిమ్మల్ని మీరు నవీకరించుకోవడం చాలా అవసరం.

2. ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూ పాటించాల్సిన విలువల్ను మీ పిల్లలకు అలవరచండి

తాము నేర్చుకున్నదానిని పునశ్చరణ చేసుకోవడానికి ఇంటర్‌నెట్ ఒక కొత్త వేదికను కల్పిస్తుంది. ఈ విశాల మైదానంలో సైబర్ ఉచ్చు పొంచి ఉంది. సింగపూరుకి చెందిన మీడియా లిటరసీ కౌన్సిల్ ప్రకారం పిల్లలు సైబర్ ఉచ్చులో పడకుండా, మరే ఇతర ఆన్‌లైన్ విష ప్రభావానికి గురి కాకుండా "విలువలు నేర్పించు" బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రులపైన ఉంది.

3. పిల్లల స్వేచ్ఛకు భంగం కల్పించకుండా వారి కంప్యూటర్ వినియోగాన్ని గమనిస్తూ ఉండాలి

ఇంటర్‌నెట్ వినియోగాన్ని గమనిస్తూ పర్యవేక్షించాలి. మీ ఉపకరణాల్లోనే పేరెంటింగ్ యాక్సెస్ ఉండేలా సాప్ట్‌వేర్ ఉంటుంది. దీనివల్ల మీ పిల్లలు ఎప్పుడెప్పుడు, ఏ విధంగా ఇంటర్‌నెట్ ఉపయోగించారన్న వివరాలను గమనించవచ్చు. మీ వై-ఫై, కంప్యూటర్ పాస్‌వర్డ్ మరచిపోకండి. ఇది పిల్లల యొక్క కంప్యూటర్ వినియోగాన్ని నియంత్రించడానికి వీలవుతుంది. మీ పర్సనల్ కంప్యూటరుని ఇంట్లో నలుగురూ మసలేచోటనే అమర్చుకుంటే మీకు తెలియకుండా పిల్లలు వాడుకునేందుకు అవకాశం ఉండదు.

పిల్లలతో కలివిడిగా ఉండడానికి, వారితో ఆడడానికి, నేర్చుకోవడానికి బ్రహ్మాండమైన అవకాశాన్ని డిజిటల్ స్పేస్ కల్పిస్తుంది. కంప్యూటరుని ఒక ఉపకరణంవలె మీరు స్వీకరించినట్లయితే మీ పిల్లల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగకారి కాగలదు. డిజిటల్ పేరెంటింగ్ అనేది మీ పిల్లలు ఆన్‌లైన్‌లోనూ, ఆఫ్‌లైన్‌లోనూకూడా బాధ్యతగల పౌరుడిగా ఎదగేలా తీర్చిదిద్దడానికి ఒక గుండెకాయలా పనిచేస్తుంది.