మీ చిన్నారిలోని శాస్త్రవేత్తను వెలికితీయడమెలా?

 

పిల్లల్లో రెండు రకాలు- ఒకరేమో సైన్స్ తరగతి అనగానే ఎగిరి గంతేస్తారు. రెండో రకం ఆ సబ్జెక్ట్ పైన పెద్దగా ఆసక్తి కనబరచరు. పిసి మీ పిల్లల మనసులోని ఆసక్తిని, సైన్స్ అనే కాదు, మరే ఇతర సబ్జెక్టులోనైనాగానీ జాగృత పరుస్తుంది. పిసి యొక్క తక్షణ సమాచారం అందించే సదుపాయం మరియు ఇంటరాక్టివ్ మూలకం మీ చిన్నారిలోని శాస్త్రవేత్తను వెలికి తీయడంలో సహకరిస్తుంది.

1. నాసా కిడ్స్ క్లబ్ ద్వారా అంతరిక్ష సాహసం చేయడం

అంతరిక్ష శోధన మరియు నాసా అనేవి ఒకసారి మనసులో ముద్ర పడ్డాయనుకోండి. నాసా కిడ్స్ క్లబ్ ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆటల రూపంలో అందిస్తుంది. ఇంటరాక్టివ్, విద్య సంబంధం, ఆకట్టుకునే చిత్రాల గ్యాలరీలు, ప్రస్తుతం సాగుతున్న ప్రాజెక్టులు మరియు సాధారణ విషయాలు అన్నీ నాసా కిడ్స్ క్లబ్ ద్వారా సమకూరతాయి. [1] దీనిలోని భాష అతి సరళంగా, చాలామటుకు బొమ్మలు కార్టూన్ల మాదిరిగా ఉన్నందున మీ పిల్లలు విసుగు చెందకుండా ఆసక్తిగా అన్వేషణ సాగిస్తారు.

2. సెల్ క్రాఫ్ట్తో ఆటగా మార్చండి

ఒక్కోసారి క్లాసులో చెప్పినదానిని సమగ్రంగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే, సైంటిఫిక్ కాన్సెప్ట్‌లతో ప్రత్యేకంగా రూపొందించిన ఆటలను ఆడడంద్వారా మీ చిన్నారి మూలాల్లోకి వెళ్లడం సులభం. అలాంటిదే సెల్ క్రాఫ్ట్. ఇది పెల్ చేసే పనులను జీవితానికి అన్వయింపజేస్తూ అధునాతన కళగా మరియు ఇంటరాక్టివ్ గేమ్‌గా రూపొందించినది. [2] సెల్ ఫోన్‌ని వైరస్ ఓడించడానికి ముందుగానే ఆటగాడు దానిని ఓడించే పాత్రని పోషిస్తాడు. ఇక్కడ సెల్ అంటే మీరే! ఈ సరదా పాత్ర పిల్లలు ఆడుకోవడానికి మరియు సెల్ ప్రపంచపు మూలాల్లోకి వెళ్లడానికి దోహదపడుతుంది.

3. సైన్స్ కిడ్స్‌తో శాస్త్రీయ పరిశోధనలు సాగించండి

సైన్స్‌ని నేర్చుకోవడంలో పరిశీలన మరియు ప్రయోగాలు అతి ముఖ్యమైనవి. సైన్స్ కిడ్స్ ద్వారా వనరులు అందుబాటులో లేకపోయినప్పటికీ, పిసిలో పరిశోధనలను చూడడానికి వీలవుతుంది. [3] ఒక అంశాన్ని ఎంచుకోవడమే చిన్నారి చేయాల్సిన పని. ఇక, అక్కడి నుంచి వీడియోని సమగ్రంగా అర్థమయ్యేవరకు ఎన్నిసార్లయినా చూడవచ్చు. మరియు కొత్తగా నేర్చుకున్న అంశాన్ని నిజ జీవితంలో, పరీక్షల వరకు గుర్తుంచుకునేలా సహాయపడుతుంది.

మీ బిడ్డలో దాగున్న శాస్త్రవేత్తను వెలుగులోకి తేవాల్సి వచ్చినప్పుడు ఇది మరియు Makerspace ప్రాజెక్టులు సహాయకారిగా ఉంటాయి. మీ చిన్నారి శాస్త్ర ప్రపంచంలో అగ్రగామిగా నిలవడానికి వివిధ ప్రయోజనాలకు మరియు అన్ని యుగాలకు సంబంధించిన అసంఖ్యాకమైన ఆలోచనలతో పిసి తక్షణ సమాచారాన్ని అందించగలదు.