పిసిని వినియోగించడంద్వారా గ్రూప్ పనిని పూర్తిగా ఎలా మార్చవచ్చు

 

విద్యార్థులకోసం పనిచేయడాన్ని గ్రూప్ పనిగా మార్చడానికి కొంత ప్రయాస పడాలి. పిసిని గనుక చేర్చుకుంటే టీచర్లకు మరియు విద్యార్థులకు జీవితం చాలా తేలికగా మారుతుంది. పిసిని వినియోగించడంద్వారా గ్రూప్ పనిని పూర్తిగా ఎలా మార్చవచ్చునో చూడండి :

1) ప్రతి దానిని ఒక దగ్గరకు చేర్చండి

విద్యార్థుల రిఫరెన్స్ కోసం అసైన్మెంట్ మొదలుకొని పనికొచ్చే వెబ్సైట్లు, మునుపటి ప్రాజెక్టులు, అభ్యాస మెటీరియల్ వంటి- అవసరమయ్యే డాటా మొత్తాన్ని పిసి సాయంతో ఒక దగ్గర చేర్చుకోవచ్చు. వాటిని విద్యార్థులకు ఈ-మెయిల్ చేయవచ్చు, Google Driveని [1] నవీకరించుకోవచ్చు లేదా మీ సొంత WikiSpaces Classroom తయారుచేసుకోవచ్చు. తద్వారా మీ విద్యార్థులు తమకు అవసరమైన ప్రతిదానిని ఒకే చోట పొందగలరు. వివిధ విషయాలకోసం వెదుకులాటకు వెచ్చించే సమయం కలిసొస్తుంది. సకాలంలో ప్రాజెక్టుని పూర్తి చేయడంపైనే దృష్టి లగ్నం చేయగలుగుతారు.

2) చిన్న చిన్న విషయాలను గుర్తించడానికి వీలవుతుంది

తరచుగా విద్యార్థులు చివరి క్షణంలో వత్తిడికి లోనవుతారు. లక్ష్యాలను చిన్న చిన్న బిట్లుగా (ఎంత చిన్నవైనా సరే) విడదీసుకుని మరియు ఎప్పటికప్పుడు పనిని సమీక్షించుకుంటే, గ్రూప్ వర్క్గా మార్చుకోవచ్చు.
పురోగతిని ఈ కింది విధంగా సమీక్షించుకోవచ్చు :
1. తరగతిలోని ప్రతి గ్రూప్తోనూ క్షుణ్ణంగా చర్చించండి.
2. కొంత క్లాస్ సమయాన్ని కేటాయించి గ్రూప్ సమావేశాల్లో పాల్గొనండి.
3. మీరు వినియోగిస్తున్న క్లౌడ్ సర్వీసులో ఏం జరుగుతోందో ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి.
4. ప్రతి గ్రూప్ సభ్యుడు సాధించిన పురోగతిని నిరంతరం గమనిస్తూ, లక్ష్యం పూర్తి కాగానే ఈ-మెయిల్ చేయాల్సిందిగా మీ విద్యార్థులను అడగండి.

3) విద్యార్థులు తమను తామే అంచనా వేసుకోవలసిందిగా అడగండి

ఇది మొదట్లో కొంత ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ, గ్రూప్లో ఎవరు గరిష్టంగా లేదా కనిష్టంగా సహకరిస్తున్నారన్నదీ మదింపు వేయడానికి మీకు చాలా దోహదపడుతుంది. తుది ప్రాజెక్టులో ప్రతి ఒక్క విద్యార్థి భాగస్వామ్యాన్ని సమగ్రంగా గుర్తించడానికి, అలాగే నేరుగా ప్రశ్నించడానికి Survey Monkey [2] మరియు Google Form [2] వంటి వనరులు మీకు సాయపడతాయి.

ఇతరులతో కలిసి పనిచేయడం మరియు విద్యార్థులందరినీ సమానంగా చూడడం అనేది కొంత కష్టమేనని మరువరాదు. అయితే, గ్రూప్ వర్క్ అనేది నేర్పించడానికి మరియు నేర్చుకోవడానికికూడా అనువైనది. పిసిని వినియోగించడం మరియు ఇతరులతో కలిసి మీ విద్యార్థులు పనిచేయడం, పాఠ్యాంశాల-ప్రత్యేక పిసి అభ్యాస వనరులతో మరిన్ని ప్రాజెక్టులను ఇవ్వడం మేలు చేస్తుంది.