మీ ప్రాజెక్టుల్లో 10/10 ఎలా పొందాలి!

మీ స్కూలు ప్రాజెక్ట్ల్లో 10/10 ఎలా పొందాలని మీరు తరచుగా ఆలోచిస్తుంటారా? మీ ప్రాజెక్ట్ ప్రముఖంగా నిలవాలని మీరు అనుకుటున్నారా? ఒకవేళ అవును అయితే, మీతో పంచుకునేందుకు ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది- అదే టెక్నాలజీ.

స్కూళ్లలో టెక్నాలజీ ‘‘కంప్యూటర్ క్లాస్’’ను వైవిధ్య భరితమైన అభ్యసన టూల్‌గా మలుస్తుంది, ఇది మీరు కాన్సెప్ట్‌లను డెమానిస్ట్రేట్ చేయడం మరియు ప్రాజెక్ట్‌లను అమలు చేసే తీరును మారుస్తుంది. దీనిలో అత్యుత్తమ విషయం ఏమిటంటే, ఇది మీ ప్రాజెక్ట్‌లకు గ్రేడ్‌లను ఇస్తుంది.

ప్రాజెక్ట్‌ల కొరకు మెరుగైన గ్రేడ్‌లను సాధించేందుకు అత్యుత్తమ మార్గం ఏది?

1. మెరుగైన సిమ్యులేషన్‌లు మరియు మోడల్స్

కంపనాల ద్వారా ధ్వని ఏవిధంగా ఏర్పడుతుందని ప్రదర్శించడానికి శృతిదండం అనేది ఒక ఆమోదించబడ్డ కచ్చితమైన మార్గం, అయితే విభిన్న పరిస్థితుల్లో అణువులు ఏవిధంగా ఏర్పడతాయి, లేదా రెండు నిర్ధిష్ట అణువులు కలుస్తాయని చూపించడం చాలా క్లిష్టంగా మరియు ప్రమాదకరంగా ఉంటుంది. ఆన్‌లైన్‌లో లభించే వివిధ రకాల సిమ్యులేషన్‌లు మరియు మోడల్స్ ఉపయోగించి దీనిని చేయవచ్చు. అత్యంత సంక్లిష్టమైన శాస్త్రీయ భావనలపై మెరుగైన సిమ్యులేషన్‌లు మరియు మోడల్స్ కొరకు ఈ ఆర్టికల్‌ని చదవండి. సబ్జెక్ట్ గురించి మీ అవగాహనను సులభంగా ప్రదర్శించడానికి మరియు మీ ప్రాజెక్ట్‌ని మెరుగ్గా ప్రదర్శించడం కొరకు వాటిని ఉపయోగించండి.

2. కథ చెప్పడం మరియు మల్టీ మీడియా

ఒక విషయాన్ని ఒక కథగా చెప్పడం మించి మరో మార్గం లేదు. ఆడియో వీడియో టూల్స్ ద్వారా కథ చెప్పడం అనేది మీ ప్రాజెక్ట్ ప్రముఖంగా నిలవడానికి దోహదపడే ఒక గొప్ప మార్గం. టెక్ట్స్‌బుక్‌లో పేర్కొనని విషయాలను సైతం మీరు నేర్చుకోవచ్చు, ఎందుకంటే, ఈ అప్రోచ్ మీకు గొప్ప వినోదాన్ని కలిగిస్తుంది.

"మీరు సేకరించిన మొత్తం సమాచారాన్ని ఒక కథ రూపంలో చెప్పడానికి ప్రయత్నిస్తారు కనుక, మీ ప్రాజెక్ట్‌కు 10/10 వస్తాయని,’’ మోనికా సెవానే, ప్రిన్సిపాల్ మరియు సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్, ఖెమాని స్కూలు, ఉల్లాస్‌నగర్, మహారాష్ట్ర పేర్కొంటారు.  

3. అద్భుతమైన ప్రజంటేషన్‌లు చేయడం

పిల్లల్లో ప్రజంటేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయా అని టీచర్లు పిల్లల్ని టెస్ట్ చేస్తుంటారు. అజ్నా నీమ్, ఎడ్యుకేషన్‌లో పిసి స్టోరీటెల్లర్‌ల యొక్క విజేత మాట్లాడుతూ, ‘‘ ఇతర నైపుణ్యాల వలే జీవిత నైపుణ్యాలు ఎంతో ముఖ్యమైనవి, మరియు ఎమ్ఎస్ పవర్‌పాయింట్ అసైన్‌మెంట్‌లు ఉపయోగించడం ద్వారా విద్యార్థులు తమ యొక్క ప్రజంటేషన్ నైపుణ్యాలను అందంగా పెంపొందించుకోగలుగుతారు. వారికి కావాల్సిందల్లా పిసి మరియు చక్కటి ఇంటర్నెట్ కనెక్షన్, మరియు వారి కొరకు ఒక మరపురాని ప్రజంటేషన్ ఎదురు చూస్తూ ఉంటుంది.

పిల్లలు కథలు చెప్పే నైపుణ్యాన్ని పొందుతారు, అదే సమయంలో, టెక్నాలజీ సాయంతో మాట్లాడటం జరుగుతుంది.

మీరు టీచర్ మరియు క్లాస్‌మేట్‌లతో మీరు నేర్చుకున్న విషయాలను ఇమేజ్‌లు మరియు టెక్ట్స్‌తో చక్కటి ప్రజంటేషన్‌లో ఉంచవచ్చు.

సరళమైన పేపర్ మరియు పెన్ను ప్రాజెక్ట్‌ల కొరకు, నేటి కంప్యూటర్‌లు మనం నేర్చుకున్న విషయాలను మరింత మెరుగ్గా మరియు మరింత ఆసక్తికరమైన మార్గంలో చూపించేందుకు మనల్ని అనుమతిస్తుంది. సమాచారాన్ని సరళంగా ప్రదర్శించడానికి బదులుగా, పిసిలు మన అభ్యసనను అప్లై చేయడానికి వివిధ మార్గాలను కల్పిస్తాయి,ప్రాజెక్ట్‌లపై మెరుగైన మార్కులను పొందడమే కాకుండా, వాటిని మరింత సమర్థవంతంగాను మరియు వినోదాత్మకంగా రూపొందించేందుకు దోహదపడతాయి.